Karimnagar

News May 28, 2024

ఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహించాలి: పమేలా సత్పతి

image

జూన్ 4న కరీంనగర్ లోక్‌సభ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపును జాగ్రత్తగా, పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News May 27, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ధర్మారం మండలంలో కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య. @ మల్హర్రావు మండలంలో మామిడి చెట్టు పైనుండి పడి వ్యక్తి మృతి. @ వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న ఆలయాలలో భక్తుల రద్దీ. @ మెట్ పల్లి పట్టణంలో మురికి కాలువలో లభ్యమైన పసికందు మృతదేహం. @ ధర్మారం మండలంలో వడదెబ్బతో వృద్ధుడి మృతి. @ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఫర్టిలైజర్ షాప్ లలో తనిఖీలు.

News May 27, 2024

బాసర IIIT ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

image

నిర్మల్ జిల్లాలోని బాసర IIIT కళాశాలలో 2024-25లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 1 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా 22 వరకు స్వీకరించనున్నారు. ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించనున్నారు. మరిన్ని వివరాల కోసం www.rgukt.ac.in లేదా ఈమెయిల్ ద్వారా admissions @rgukt.ac.inని సందర్శించండి.
# Share it

News May 27, 2024

ఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

జూన్ 4న కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపును జాగ్రత్తగా, పకడ్బందీగా నిర్వహించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News May 27, 2024

ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. సోమవారం ఉమ్మడి జిల్లా ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లాలోని వెల్గటూర్ మండలంలో 44.8°C, ధర్మపురి మండలం జైనలో 44.7.°C, ధర్మపురిలో 44.4°C, నేరెళ్లలో 44.4°C, కరీంనగర్ జిల్లాలోని వీణవంక మండలంలో 44.5°C ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు.

News May 27, 2024

KNR: బావమరిది కోసం మోకాళ్లపై నడిచి మొక్కు తీర్చుకున్న బావ

image

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తన బావమరిది రజినీకాంత్ కోలుకుంటే మోకాళ్ల మీద ఐనవోలు మల్లికార్జున స్వామి వారి దర్శనానికి నడుచుకుంటూ వస్తానని కమలాపూర్ మండలం అంబాలకు చెందిన నాగరాజు మొక్కుకున్నారు. ఈ మేరకు రజినీకాంత్ ఆరోగ్యం మెరుగుపడటంతో నాగరాజు మొక్కు తీర్చుకునేందుకు మోకాళ్లపై 70 కి.మీ నడుచుకుంటూ ఐనవోలు వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు నాగరాజును అభినందిస్తున్నారు.

News May 27, 2024

బీర్పూర్: ధాన్యం కోతలు.. రైతుల వెతలు

image

సమాచారం ఇవ్వకుండానే తరుగు పేరుతో కోతలు విధిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీర్పూర్ మండలంలోని తుంగూర్ కొనుగోలు కేంద్రంలో సేకరించిన ధాన్యాన్ని మిల్లుకు తరలించారు. నాణ్యత లేదంటూ మిల్లర్లు మూడు రోజుల పాటు ధాన్యం తీసుకోకుండా నిలిపివేశారు. విషయాన్ని రైతులకు ముందు సమాచారం ఇవ్వాల్సిన నిర్వాహకులు సంచికి 3కిలోల కోత విధించారని తెలిపారు. ఈవిషయంలో రైతులకు, నిర్వాహకులకు వాగ్వాదం చోటుచేసుకుంది.

News May 27, 2024

గల్ఫ్ దేశంలో జగిత్యాల వాసి కష్టాలు.. సెల్ఫీ వీడియో

image

గల్ఫ్ దేశానికి వెళ్లిన తనను ఓ ముఠా మోసం చేసిందంటూ ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. జగిత్యాలకు చెందిన రాజేశ్(39) 6నెలల క్రితం దుబాయ్ వెళ్లాడు. ఓ ముఠా జాబ్ ఇప్పిస్తానని చెప్పి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించింది. ఇండియాకు వెళ్లిరావాలని వారు చెప్పడంతో స్వదేశానికి బయల్దేరగా అబుదాబి ఎయిర్పోర్టులో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. తన ప్రమేయం లేకుండా లోన్లు తీశారని, ప్రభుత్వం కాపాడాలని బాధితుడు కోరారు.

News May 27, 2024

పెద్దపల్లి: బాలికపై లైంగిక వేధింపులు.. ఉరేసుకొని ఆత్మహత్య

image

యువకుడి లైంగిక వేధింపులు భరించలేక బాలిక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన పాలకుర్తి మండలం జీడీనగర్ గ్రామపరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. PDPL మండలం గుర్రాంపల్లికి చెందిన బాలిక(16) కొంతకాలంగా బీసీ కాలనీలో నివాసముంటోంది. బొంపెల్లికి చెందిన శ్యాం అనే వ్యక్తి కొంతకాలంగా బాలికను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో వేధింపులు తాళలేక ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

News May 27, 2024

KNR: ఉపాధ్యాయుల కొరత.. ఉత్తీర్ణతపై ప్రభావం

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల కొరత నెలకొంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలు ఎక్కువ ఉండటంతో గతేడాది ఉత్తీర్ణతపై ప్రభావం పడింది. ఉమ్మడి జిల్లాలో 2,560 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. 1,55,935 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి 9,952 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. జగిత్యాల 334, KNR 245, PDPL 93, సిరిసిల్లలో 151 చొప్పున సబ్జెక్టులకు సంబంధించి ఉపాధ్యాయుల కొరత ఉంది.

error: Content is protected !!