India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
@ కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి ఘన స్వాగతం.
@ వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్నను దర్శించుకున్న బండి సంజయ్.
@ కమలాపూర్ మండలంలో కారు, బైకు ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు.
@ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చొప్పదండి ఎమ్మెల్యే సత్యం.
@ రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడిని పరామర్శించిన మాజీ గవర్నర్.
@ మేడిపల్లి మండలంలో అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య.
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని బుధవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బుధవారం రాత్రి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోడె మొక్కు చెల్లించుకోని సేవలో తరించారు. ఆలయానికి చేరుకున్న బండి సంజయ్‌కు బీజేపీ శ్రేణులు, అభిమానులు, నాయకులు అపూర్వ స్వాగతం పలికారు.
కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అడుగుపెట్టడంతో బాణాసంచా పేల్చి సంబురాలు చేసుకున్నారు.
భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో మూడు రోజుల క్రితం గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓ రైతు మామిడి తోటలోని రావులమ్మ గుడి కింద గుప్తనిధులు ఉన్నాయని కొంత మంది JCB సహాయంతో తవ్వకాలు జరిపారని తోట యజమాని పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనలో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.1,08,321 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.63,010, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.35,000, అన్నదానం రూ.10,311 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నేతలు హనుమంతరావు, సంపత్ కుమార్ పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే తరానికి మార్గదర్శి రాహుల్ గాంధీ అని కొనియాడారు.
కరీంనగర్ జిల్లాలో గతంలో కలెక్టర్‌గా పనిచేసిన స్మిత సబర్వాల్‌కు ట్విటర్(X) వేదికగా ‘కరీంనగర్ స్మార్ట్ సిటీ అప్డేట్స్’ ప్రొఫైల్ నుంచి అడ్మిన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే దీనిపై స్మిత సబర్వాల్ స్పందించారు. ‘Karimnagar is an emotion’ అంటూ రీట్వీట్ చేశారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారికి కృతజ్ఞతలు అని రాసుకొచ్చారు.
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా కానిస్టేబుల్‌పై గన్ చూపెట్టి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డట్లు బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. భవాని సేన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ కీచక ఎస్ఐ లైంగిక వేధింపుల ఆరోపణ వెలుగులోకి వచ్చాయి. కాటారం సబ్‌డివిజన్‌లోని ఓ మండలంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ మహిళ కానిస్టేబుల్ ను లైంగికంగా వేధించేవాడని ఆమె ఫిర్యాదు చేసింది. కాగా సదరు ఎస్ఐపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనట్లు సమాచారం. ఎస్ఐ సర్వీస్ రివాల్వర్ డీఎస్పీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా పమేల సత్పతి కొనసాగనున్నారా ? కొత్త కలెక్టర్‌గా అనురాగ్ జయంతి బాధ్యతలు తీసుకోరా? అనే చర్చ అధికార వర్గాల్లో కొనసాగుతుంది. మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశాల్లో ప్రస్తుత కలెక్టర్ పమేల సత్పతి పాల్గొనడంతో బదిలీ ఆగిందనే చర్చ కలెక్టరేట్ వర్గాల్లో విస్తృతంగా వినిపిస్తోంది.
హుస్నాబాద్(M) కూచన్‌పల్లి వాసి నరసయ్య(55)ను <<13460938>>హత్య <<>>చేసిన విషయం తెలిసిందే. SI మహేశ్ వివరాలు.. నర్సయ్య సామగ్రి ఏరుకుంటూ విక్రయించేవాడు. మద్యానికి బానిసై రోజు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. సోమవారం రాత్రి అతని భార్య లేచి చూసేసరికి రక్తపు మడుగులో చనిపోయి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామస్థులతో మాట్లాడి నర్సయ్య భార్య, తమ్ముడి కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.