India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సమగ్ర విచారణతో నేరస్తులకు న్యాయస్థానం ద్వార శిక్ష పడే విధంగా పోలీస్ అధికారులు బాధ్యతగా కృషి చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. కమిషనరేట్‌లో మంచిర్యాల జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా CP మాట్లాడుతూ.. వర్టికల్స్ సమర్ధవంతంగా అమలయ్యేలా చూడాలన్నారు. బాధితుల ఫిర్యాదులకు వెంటనే స్పందించాలన్నారు. సత్వర న్యాయం చేస్తామనే నమ్మకం, భరోసా కలిగించాలన్నారు.
@ రాయికల్ మండలంలో ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య.
@ ఇబ్రహీంపట్నం మండలంలో బావిలో దూకి వ్యక్తి ఆత్మహత్య.
@ వేములవాడలో కురిసిన భారీ వర్షం.
@ కరీంనగర్ రూరల్ మండలంలో విద్యుత్ షాక్‌తో నాలుగు ఆవులు మృతి.
@ ఎల్లారెడ్డిపేట మండలంలో మహిళా అదృశ్యం.
@ రేపు కరీంనగర్‌కు రానున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్.
@ బాధ్యతలు స్వీకరించిన జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్.
జగిత్యాల జిల్లా నూతన ఎస్పీగా నియమితులైన అశోక్ కుమార్ మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని జిల్లా ప్రజలు సహకరించాలని కోరారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం కరీంనగర్ రానున్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి కరీంనగర్ విచ్చేస్తున్న బండి సంజయ్ కుమార్‌కు ఘన స్వాగతం పలికేందుకు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని బీజేపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఈనెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 23న ఢిల్లీ పయనమమవుతారు.
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన చంద్రయ్య(55) ప్రమాదవశాత్తు మాల్దీవుల్లో పని చేస్తూ సోమవారం సాయంత్రం మృతి చెందారు. కుటుంబీకుల ప్రకారం.. జీవనోపాధి కోసం బొంబాయిలోని ఓ కంపెనీలో పనిచేస్తూ కంపెనీ చేపట్టిన బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా మాల్దీవులకు తీసుకెళ్లారు. అక్కడ విధులు నిర్వహిస్తుండగా రెండు క్రేన్ల మధ్యలో ఇరుక్కుని మృతి చెందాడు.
బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లిలోని డిగ్రీ పాసైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ తెలిపారు. ఈనెల 19 నుంచి జూలై 03 వరకు వెబ్ సైట్ www.tgbcstudycircle.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవలని సూచించారు. ఆన్ లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తామన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ ముంపు ప్రాంతంలో 92.77 లక్షల టన్నుల ఇసుక పూడికను తీయనున్నారు. దీనికోసం తెలంగాణ ఖనిజ అభివృద్ధి సంస్థ 14 బ్లాకులను గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో ఇసుకను తవ్వి తరలించనున్నారు. ఈ మేరకు 14 బ్లాక్‌లో విడివిడిగా టెండర్లను ఆహ్వానించింది. ఇసుక పూడిక తీయడం ద్వారా బ్యారేజీలో నీటి నిలువ సామర్థ్యం పెరుగుతుందని భావిస్తోంది.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ జాతీయ రహదారిపై మంగళవారం పెను ప్రమాదం తప్పింది. మొలంగూర్ మూల మలుపు వద్ద జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి. ఆ రోడ్డు గుండా వెళ్తున్న గ్రానైట్ లారీ అదుపుతప్పడంతో గ్రానైట్ కింద పడింది. కాగా ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హూస్నాబాద్ మండలంలో దారుణం జరిగింది. కూచన్‌పల్లికి చెందిన నరసయ్య(55) ఇంట్లో నిద్రిస్తుండగా గొడ్డలితో దుండగులు నరికి హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కరీంనగర్ కార్పొరేషన్‌తో పాటు జమ్మికుంట, హుజూరాబాద్, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీల పరిధిలో ఇళ్ల మధ్య ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇప్పటికే చెత్తా చెదారంతో నిండిపోగా వాటిని ఎప్పటికప్పుడూ శుభ్రం చేసుకోవాల్సిన యజమానులు పట్టించుకోవడం లేదు. వర్షం పడితే ఆయా స్థలాల్లో మురుగునీరు నిలిచి దోమలకు ఆవాసంగా మారే ప్రమాదం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో స్థల యజమానులు స్పందించి పరిసరాల పరిశుభ్రతకు సహకరించాల్సిన అవసరం ఉంది.
Sorry, no posts matched your criteria.