India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పొరుగు రాష్ట్రాల నుంచి జిల్లాకు వలస వచ్చిన కూలీల బతుకులు అత్యంత దుర్భరంగా మారుతున్నాయి. ఇటుక బట్టీలు, రైస్ మిల్లులో పని చేసే వలస కూలీలకు కనీస వసతులు కరవయ్యాయి. సుల్తానాబాద్ ప్రాంతంలోనీ ఓ ఇటుక బట్టీలో పనిచేసే నిండు గర్భిణిని కరీంనగర్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పురిటి నొప్పులు అధికం కావడంతో KNR బస్టాండులోనే పురుడు పోసుకోవడంతో వారి పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో నిదర్శనంగా నిలుస్తోంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వచ్చే 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్IPS(IG) సూచించారు. ఈ సందర్భంగా కమిషనరేట్ పరిధి పెద్దపల్లి -మంచిర్యాల జిల్లాలోని ముస్లిం కుటుంబాలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా పండుగల సందర్భంగా సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి వదంతులు నమ్మవద్దన్నారు. 15 రోజుల నుంచి కమిషనరేట్‌లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ఆవుల అక్రమ రవాణాను జరగకుండా చేశామన్నారు.
గోదావరిఖని ఇందిరానగర్‌కు చెందిన ఓ వృద్ధురాలు కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ రోజు గోదావరి బ్రిడ్జి నుంచి నదిలో దూకే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా అక్కడే ఉన్న రివర్ గార్డు హెడ్ కానిస్టేబుల్ జంపయ్య, కానిస్టేబుల్ నరేందర్ ఆమెను అడ్డుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ చేసి ఇంటికి పంపించారు.
@ బాధ్యతలు స్వీకరించిన జగిత్యాల, సిరిసిల్ల నూతన కలెక్టర్లు. @ ఎల్లారెడ్డిపేట మండలంలో ఉరివేసుకొని పురోహితుడి ఆత్మహత్య. @ బీర్పూర్ మండలంలో విద్యుత్ షాక్ తో మూడు ఎద్దులు మృతి. @ కథలాపూర్ మండలంలో 2 అక్రమ ఇసుక రావణ ట్రాక్టర్లు పట్టివేత. @ గోదావరిఖనిలో మహిళను కాపాడిన రివర్ గార్డ్ పోలీసులు. @ మెట్ పల్లి మండలంలో దాబాలపై దాడులు నిర్వహించిన ఎక్సైజ్ పోలీసులు. @ జగిత్యాల డిఎంహెచ్వో గా సమియోద్దిన్.
అనారోగ్య కారణాలతో విధులు నిర్వహించలేని కార్మికుల విషయంలో పారదర్శకంగా అన్ ఫిట్ చేస్తామని సింగరేణి సంస్థ C&MD బలరాం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మధ్యవర్తుల విషయంలో మోసాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సింగరేణి అభ్యర్థన మేరకు అవినీతి నిరోధక శాఖ ఈ విషయంలో పరిశీలిస్తోందన్నారు. అదేవిధంగా ఎవరైనా మోసం చేసినట్లు తెలిస్తే సింగరేణి విజిలెన్స్ 94911 44104 సమాచారం అందించాలన్నారు.
కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆదివారం ఓ మహిళ ప్రసవించింది. ఆర్టీసీ సిబ్బంది తెలిపిన వివరాలిలా.. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి ఇటుకబట్టీలో పనిచేసే అంతర్రాష్ట్ర కూలీలయిన భార్యాభర్తలు ప్రసవం కోసం కరీంనగర్ వచ్చారు. బస్టాండ్ ఆవరణలో ఆ మహిళకు పురిటినొప్పులు అధికమయ్యాయి. మహిళా సిబ్బంది డిపో మేనేజర్‌కు సమాచారమిచ్చి..108 సిబ్బంది సాయంతో గర్భిణీకి ప్రసవం చేశారు. తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నారన్నారు.
ఎల్లారెడ్డిపేట మండలంలో ఓ పురోహితుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం పచ్చకాంతం సంతోష్( హైటెక్ పంతులు) అనే పురోహితుడు దమ్మన్నపేటలో ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇదే క్రమంలో అతను మనస్తాపానికి గురై ఆదివారం తన స్వగ్రామం రాచర్ల గొల్లపెల్లిలోని ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారమందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గోదావరిలో స్నానం చేస్తూ యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో చోటుచేసుకుంది. ఎస్సై భవానిసేన్ తెలిపిన వివరాలిలా.. వరంగల్‌కు చెందిన గరికపాటి అఖిల్ (19) ఆదివారం కాళేశ్వరం వచ్చారు. అందులో భాగంగా స్నానం చేయడానికి గోదావరిలోకి దిగాడు. ఈ క్రమంలో యువకుడు గల్లంతయ్యాడన్నారు. సమాచారమందుకున్న తమ సిబ్బంది నదీతీరానికి చేరుకుని గాలింపు చర్యలు సాగిస్తున్నట్లు తెలిపారు.
అనారోగ్య కారణాలతో విధులు నిర్వహించలేని కార్మికుల విషయంలో పారదర్శకంగా అన్ ఫిట్ చేస్తామని సింగరేణి సంస్థ C&MD బలరాం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మధ్య వర్తుల విషయంలో మోసాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సింగరేణి అభ్యర్థన మేరకు అవినీతి నిరోధక శాఖ ఈ విషయంలో పరిశీలిస్తున్నారన్నారు. అదేవిధంగా ఎవరైనా మోసం చేసినట్లు తెలిస్తే సింగరేణి విజిలెన్స్ 94911 44104 సమాచారం అందించాలన్నారు.
Sorry, no posts matched your criteria.