India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పలిమెల మండలంలోని సర్వాయిపేట గ్రామానికి చెందిన పురుషోత్తం (28) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పురుషోత్తం వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని ఖమ్మం మూడో టౌన్, RPF పోలీసులు రక్షించిన ఘటన శనివారం ఖమ్మంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. జమ్మికుంటకు చెందిన అనిల్‌కు భార్యతో కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్య పుట్టింటికి వెళ్లి కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందాడు. దీంతో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు ఖమ్మం మూడో టౌన్
ఇన్స్పెక్టర్ రమేశ్ తెలిపారు.
శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఈనెల 18న జరగాల్సిన ఎంఈడీ మొదటి సెమిస్టర్ 19వ తేదీకి వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి డా. శ్రీరంగ ప్రసాద్ శనివారం ఓ ప్రకటనలు తెలిపారు. 18న యూజిసి నెట్ ఎగ్జామినేషన్ కారణంగా 19వ తేదీన నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
ఆరేళ్ళ చిన్నారిని ఓ యువకుడు హత్యచారం చేసిన విషయం తెలిసిందే. బిహర్‌కు చెందిన నిందితుడు వినోద్ మాజేను పోలీసులు శనివారం జిల్లా కోర్టులో హాజరుపర్చారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి హేమంతం కుమార్ నిందితుడికి రిమాండ్ విధించారు. దీంతో అతడిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించినట్లు ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపారు.
ఫాస్ట్ బౌలర్ల కోసం HYD క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా టాలెంట్ హంట్ చేపడుతోంది. ఈ నెల 22న HYD ఉప్పల్ స్టేడియంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఆసక్తి గల క్రీడాకారులు తమ పేర్లను HCA అధికారిక వెబ్సైట్ http://www.hycricket.inలో నమోదు చేసుకోవాలని అసోసియేషన్ వివరించింది.
@ కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు బదిలీ. @ జగిత్యాల అడిషనల్ కలెక్టర్ దివాకర బదిలీ. @ గొల్లపల్లి మండలంలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం. @ మెట్పల్లి మండలంలో గుండెపోటుతో పూజారి మృతి. @ సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న సిరిసిల్ల ఎస్పీ. @ మల్యాల మండలంలో రెండిళ్లలో చోరీ. @ కథలాపూర్ మండలంలో 8 మంది పేకాట రాయుళ్ల పట్టివేత.
రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిని కరీంనగర్ జిల్లా పాలనాధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత కలెక్టర్ పమెల సత్పతిని బదిలీ చేశారు.
శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామానికి చెందిన మమత పొరుగింటి వ్యక్తి రత్నాకర్‌ను 2023లో ప్రేమ వివాహం చేసుకుంది. ఆ పెళ్లి మమత కుటుంబానికి ఇష్టం లేదు. మమత ఇంటి ఎదుట నుంచి రత్నాకర్ ఇంటికి వెళ్లాలి. దీంతో మమత తల్లిదండ్రులు రోడ్డుపై అడ్డంగా గోడ కట్టారు. దీనిపై ఎవరు చెప్పినా వారు వినకపోవడంతో మమత తల్లిదండ్రులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట- సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య రామగుండం నుంచి నడిచే 14 ప్యాసింజర్, సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నెలరోజుల పాటు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సాంకేతిక కారణాలతో ఈరోజు నుంచి రాకపోకలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. కొన్నింటిని దారి మళ్లించామని, మరికొన్నింటిని ఆలస్యంగా నడిపిస్తామని వివరించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోజురోజుకి మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో 2022లో 68, 2023లో 58, 2024లో 27 పోక్సో కేసులు నమోదయ్యాయి. రాజన్న సిరిసిల్లలో 2022లో 62, 2023లో 42, 2024లో 18, జగిత్యాల జిల్లాలో 2022లో 59, 2023లో 84, 2024లో 48, పెద్దపల్లి జిల్లాలో 2022లో 29, 2023లో 20, 2024లో 01 పోక్సో కేసులు నమోదయ్యాయి.
Sorry, no posts matched your criteria.