India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష (ఎప్‌సెట్) ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు మెరిశారు. కరీంనగర్‌కు చెందిన మునీశ్వరి-చంద్రశేఖర్ రెడ్డిల కూతురు వి.హాసిని 144 ర్యాంకు, రజిని-శ్రీనివాస్‌ల కుమారుడు ఎన్. హేమంత్ 157వ ర్యాంకు, గంగాధరకు చెందిన ధనలక్ష్మి-పవన్‌ల కూతురు బొడ్ల ఆశ్రిత 220 ర్యాంకు సాధించారు. ఉన్నత విద్య అభ్యసించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈవీఎంను భద్రపర్చిన స్ట్రాంగ్‌రూం లను రాష్ట్ర ఎన్నికల డిప్యూటీ ప్రధాన అధికారి మురళీ మోహన్ రావు పరిశీలించారు. శనివారం రామగిరిలోని సెంటినరీకాలనీలో ఉన్న జేఎన్టీయూ మంథని కళాశాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీతో కలిసి తనిఖీ చేశారు. రామగుండం, మంథని, ధర్మపురి, పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన స్ట్రాంగ్ రూంలకు వేసిన సీల్‌లను పరిశీలించి సంబంధిత రిజిస్టర్‌లో సంతకం చేశారు.
@ కరీంనగర్ జిల్లాలో ముగ్గురు టీచర్ల సస్పెన్షన్. @ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ ముస్తాబాద్ మండలంలో విద్యుత్ షాక్ తో బర్రె మృతి. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ ఉపాధి హామీ కూలీలకు పని కల్పించాలన్న జగిత్యాల అడిషనల్ కలెక్టర్. @ నిజామాబాద్ పార్లమెంటులో టఫ్ ఫైట్ ఉందన్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. @ గ్రూప్ 1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు: సిరిసిల్ల కలెక్టర్
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు మంగ, సైదాపూర్ మండలం నల్లోనితండా పాఠశాల ఉపాధ్యాయురాలు సునీతలను డీఈవో జనార్దన్‌రావు సస్పెండ్ చేశారు. ఆయా పాఠశాలల్లో అనధికారిక వ్యక్తులు నివాసం ఉంటున్నారనే సమాచారం తెలియజేయకపోవడంతో విధుల నుంచి తొలగించారు. అదేవిధంగా కరీంనగర్ పట్టణం ఫకీర్ నగర్ స్కూల్ టీచర్ మంజులను విధులకు గైర్హాజరు కారణంగా సస్పెండ్ చేశారు.
ఇంటి స్థలం విషయంలో జరిగిన గొడవలో ఇద్దరు అన్నదమ్ముల కుమారులు <<13261896>>హత్య<<>>కు గురయ్యారు. బుగ్గారం పోలీసుల వివరాలు.. గోపులాపూర్‌కు చెందిన శ్రీనివాస్ ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. దాని పక్కనే అదే గ్రామానికి చెందిన నవీన్ ఇల్లు ఉంది. రోడ్డు విషయంలో వీరికి గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో శ్రీనివాస్(36)తో పాటు అతడి పెద్దనాన్న కొడుకైన మహేశ్(38)పై నవీన్ కొంతమంది యువకులతో కలిసి దాడి చేయగా.. ఇద్దరు మృతి చెందారు.
పెద్దపల్లిలో ప్రతి ఎన్నికల్లో ప్రజలు ఒక్కో పార్టీని ఆదరిస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో BRS అభ్యర్థి MPగా గెలుపొందగా.. 2023లో లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో BRS శ్రేణులు కాంగ్రెస్‌లో భారీగా చేరాయి. సిట్టింగ్ MP వెంకటేశ్ నేత BJPలో చేరారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు చర్చ జరుగుతోంది. మీ కామెంట్?
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 10లోపు పాఠశాలలో కనీస సదుపాయాలు పూర్తి చేయాలని, 20 రోజుల వ్యవధిలో మంజూరు చేసిన పనులు పూర్తి చేయాలన్నారు. ధరణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని సూచించారు. కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, అడిషనల్ కలెక్టర్లు దివాకర, రాంబాబు తదితరులున్నారు.
*కోరుట్లలో లైసెన్స్ లేకుండా మందులు విక్రయించిన వ్యక్తికి ఏడాది జైలు శిక్ష.
*ప్రభుత్వ పాఠశాలలలో మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయాలన్న జగిత్యాల కలెక్టర్.
*కోరుట్లలో ఆర్థిక ఇబ్బందులతో స్వర్ణకారుడు ఆత్మహత్య.
*వేములవాడ అర్బన్ మండలంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతుల ఆందోళన.
*పెద్దపల్లి మండలంలో పర్యటించిన డిపిఓ.
*కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల కురిసిన వర్షం.
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్రవారం రూ.1,59,135 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాల టికెట్లు అమ్మకం ద్వారా రూ.79,758 ప్రసాదం అమ్మకం ద్వారా రూ.65,245 అన్నదానం రూ.14,132 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.
పార్లమెంటు ఎన్నికల ఫలితాల పైనే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయా పార్టీల నుంచి పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల భవితవ్యం ఆధారపడి ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఇందుకోసం ఏ పార్టీ మద్దతు ఉంటే తమకు లాభం ఉంటుందనే విషయమై ఇప్పటికే అంచనాకు వచ్చి మొన్నటి ఎన్నికల్లో కొందరు పార్టీ మారారు. ఈ ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీల మార్పు కొనసాగే అవకాశమున్నట్లు తెలుస్తుంది.
Sorry, no posts matched your criteria.