India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జీహెచ్ఎంసీ కార్యాలయంలో వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జీహెచ్ఎంసీ ఇన్‌ఛార్జి కమిషనర్ అమ్రపాలి అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తంగా చేసి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి బడి గంట మోగనుంది. 48 రోజుల వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు బుధవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. వేసవి సెలవులను సరదాగా గడిపిన విద్యార్థులు ఆటపాటలకు గుడ్‌బై చెప్పి బడిబాట పట్టనున్నారు. ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా బడులు తెరిచిన మొదటి రోజే పాఠ్య పుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. గంబీరావుపేట మండలం పెద్దమ్మ స్టేజ్ వద్ద డీసీఎంను బైకు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. కాగా, మృతులు బిక్కనూరు మండలం మల్లుపల్లె వాసులు షేక్ అబ్దుల్లా, ఎస్ డి చందాగా గుర్తించారు. బైకుపై వేములవాడకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జురిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలకు రైతులు తీవ్రంగా పంట నష్టపోతున్నారని, వారిని గట్టెక్కించేందుకు బీమా అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జిల్లా వ్యవసాయాధికారి బి.శ్రీనివాసం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఉచిత పంట బీమా పథకం అమలుకు సిద్ధమయిందన్నారు. అయితే అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 2.03లక్షల మంది రైతులుండగా.. 3.45లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణమవుతుందన్నారు.
గుండెపోటుతో ఓ మహిళ RTC బస్సులోనే మృతి చెందిన ఘటన PDPL జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. ముత్తారం మండలానికి చెందిన మణెమ్మ(58) కోడలు లతతో కలిసి కాల్వ శ్రీరాంపూర్‌లోని బంధువుల ఇంటికి వెళ్తోంది. ఈ క్రమంలో మణెమ్మ అస్వస్థతకు గురవగా గమనించిన కండక్టర్, డ్రైవర్ బస్సులోనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు గెండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు.
పాఠశాలలు పున:ప్రారంభం నుంచి లంచ్ అండ్ లెర్న్ బుధవారం కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా నిర్వహించడం జరుగుతుందని తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. మధ్యాహ్న భోజనం నాణ్యత అంశంలో ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో సమావేశ మందిరంలో విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఏప్రిల్ 23 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవుల సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మూసి వేసిన బడులు నేటితో ప్రారంభం కానున్నాయి. పాఠశాలలు పున: ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించి సిద్ధం చేశారు. పాఠశాలల్లో చేపట్టవలసిన కార్యక్రమాలపై పాఠశాల సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేయనున్నారు.
@ మిషన్ భగీరథ సర్వే పనులను పరిశీలించిన జగిత్యాల కలెక్టర్. @ సైదాపూర్ మండలంలో 10 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత. @ మల్లాపూర్ మండలంలో విద్యుత్ షాక్‌తో రెండు గేదెలు మృతి. @ రాయికల్ మండలంలో అగ్ని ప్రమాదంలో వ్యక్తి మృతి. @ ధర్మపురిలో వైభవంగా సుదర్శన యాగం. @ మెట్ పల్లి పట్టణంలో ఘనంగా రేణుక ఎల్లమ్మ బోనాల జాతర. @ భక్తులతో కిటకిటలాడిన వెల్లుల్ల ఎల్లమ్మ ఆలయం.
గత శాసనసభ ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపిస్తే జైత్రయాత్ర లేదంటే శవయాత్ర అంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హైకోర్టును ఆశ్రయించారు. దానిపై హైకోర్టు మంగళవారం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ఈనెల 20న తమ ఎదుట హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు విచారణ చేయనుంది.
లంచం తీసుకుంటూ పట్టుబడిన సీనియర్ అసిస్టెంట్&ఇన్‌ఛార్జ్ సబ్ -రిజిస్ట్రార్ పై అనిశా అధికారులు అక్రమాస్తుల కేసు నమోదు చేశారు. KNR జిల్లా గంగాధర సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో పని చేస్తున్న సురేశ్ బాబు ఏప్రిల్‌లో రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. దీంతో మంకమ్మతోటలోని ఆయన నివాసంలో అనిశా అధికారులు సోదా చేయగా రూ.12,31,400 నగదుతో పాటు బంగారం, వెండి అభరనాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు స్వాధీనం చేసుకున్నారు.
Sorry, no posts matched your criteria.