India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరి కొయ్యలు కాలుస్తుండగా వ్యక్తి మృతి చెందిన ఘటన రాయికల్ పట్టణంలో జరిగింది. పోలీసుల వివరాలు.. పట్టణానికి చెందిన భీమయ్య(68) పొలంలో వరి కొయ్యలు తగలబెడుతుండగా ఆ ప్రాంతమంతా భారీగా పొగ అలుముకుంది. దీంతో ఊపిరాడక స్పృహ తప్పి ప్రమాదవశాత్తు మంటల్లో పడ్డారు. శరీరమంతా కాలిపోయి మృతి చెందినట్టు ఎస్సై అజయ్ మంగళవారం తెలిపారు. మృతుడి కొడుకు వినోద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు పక్రియ ముగిసింది. జిల్లా యంత్రాంగం 321 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఇందులో ఐకేపీ 51 కేంద్రాల ద్వారా 45,125 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, ఫ్యాక్స్ 223 కేంద్రాల ద్వారా 1,87,031.68 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, DCMS ఆధ్వర్యంలో 43 కేంద్రాల ద్వారా 32,838.16 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, హాకా ఆధ్వర్యంలో 4 కేంద్రాల ద్వారా 2995.36 ధాన్యాన్ని కొనుగోలు చేశారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చి గుండెపోటుతో భక్తుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా నుంచి వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన బొట్ల వినయ్ కుమార్.. రాజన్న దర్శనం చేసుకున్నాడు. అనంతరం బద్ది పోచమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లే మార్గ మధ్యలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. స్థానికుల సహాయంతో ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వినయ్ మృతి చెందాడు.
పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు ప్రధాన అడ్డంకిగా మారాయి. గత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పంచాయతీరాజ్ చట్టం-2018 ఎన్నికల స్థానాలకు రిజర్వేషన్లు పదేళ్లపాటు వర్తిస్తాయని పేర్కొంటోంది. తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తుందా? లేక ఏమైనా మార్పులు చేస్తుందా? అనే అసక్తి సర్వత్రా నెలకొంది.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో దారుణం జరిగింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మూగ యువతిపై అదే గ్రామానికి చెందిన యాభై ఏళ్ల వ్యక్తి సోమవారం అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. దీంతో, సదరు యువతి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మేడారంలో వనదేవతల స్మృతి వనం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సమ్మక్క-సారలమ్మల చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలిపేలా గద్దెల వెనకవైపు ఉన్న 25 ఎకరాల్లో ఈ స్మృతి వనాన్ని నిర్మించాలని భావిస్తోంది. జాతర విశేషాలతో పాటు.. అప్పటి వస్తువులు, వారి గొప్పతనం తెలిపేలా మ్యూజియంను ఏర్పాటు చేయనుంది. చిలకల గుట్ట సుందరీకరణతో పాటు భక్తులకు సౌకర్యాలను కల్పించేందుకు కసరత్తు చేస్తోంది.
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి వరుస మరణాలు జరుగుతున్నాయి. గత 3 రోజుల్లో ముగ్గురు మృతి చెందారు. శుక్రవారం ఎల్లంపల్లిలో శంకరయ్య(75), శనివారం గుజ్జులపల్లిలో కందుగుల గ్రామానికి చెందిన దినసరి కూలీ శనిగరం మొగిలి(45), ఆదివారం ఘన్పూర్ తండాకు చెందిన డిగ్రీ విద్యార్థి బానోతు ఆంజనేయులు(18) ప్రమాదవశాత్తు వ్యవసాయ బావుల్లో పడి మృతి చెందారు.
KNR MPగా గెలిచిన బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఎంపికైన విషయం తెలిసిందే. ఇక ఆయన హోం శాఖ మంత్రిగా వ్యవహరించనున్నారు. అమిత్ షా నేతృత్వంలో సహాయ మంత్రిగా బండి బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఉమ్మడి జిల్లాకు ఈ మంత్రిత్వ శాఖ రావడం ఇది రెండోసారి. 1999లో KNR నుంచి గెలిచిన విద్యాసాగర్‌రావుకు ఇదే శాఖను కేటాయించారు. యాదృచ్ఛికంగా ఇద్దరు నాయకులకు రెండోసారి గెలిచిన తర్వాతే హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలు అప్పగించారు.
వానాకాలం సీజన్ ప్రారంభమైంది. తొలకరి పలకరించడంతో పాటు నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సాగుకు రైతులు సిద్ధమయ్యారు. పంటల సాగులో మేలైన విత్తనాలు ఎంపిక చేసుకోవడం ఎంతో ప్రధానం. పలు ప్రైవేట్ విత్తన కంపెనీలు ఆకర్షణీయ ప్యాకింగ్‌తో, నకిలీ లేబుళ్లతో రైతులను మోసం చేస్తున్నాయి. రైతులు వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు తీసుకొని నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేసి దిగుబడులు సాధించాలి.
బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి జైలు శిక్ష విధిస్తూ సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయపూర్తి ప్రేమలత సోమవారం తీర్పు వెల్లడించారు. సీఐ రఘుపతి ప్రకారం.. సిరిసిల్లకు చెందిన పదేళ్ల బాలిక ఇంటికి ఒంటరిగా వెళ్తున్న సమయంలో రాజీవ్‌నగర్‌కు చెందిన రాహుల్ 2023లో అత్యాచారానికి పాల్పడ్డాడు. తప్పించుకొని ఇంటికి వెళ్లిన బాధితురాలు ఇంట్లో చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, సోమవారం నేరం రుజువయింది.
Sorry, no posts matched your criteria.