Karimnagar

News May 14, 2024

నేడు కాటారానికి డిప్యూటీ సీఎం భట్టి

image

కాటారం మండలం ధన్వాడ గ్రామంలో శ్రీ దత్తాత్రేయస్వామి ఆలయ వార్షికోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంగళవారం హాజరుకానున్నారు. భట్టి విక్రమార్కకు కమాన్ పూర్ ఎక్స్ రోడ్ వద్ద ఘన స్వాగతం పలకనున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైనాల రాజు తెలిపారు. కావున.. కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి డిప్యూటీ సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.

News May 13, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్. @ రాయికల్ మండలంలో అనుమానాస్పద స్థితిలో 20 గొర్రెలు మృతి. @ ఇబ్రహీంపట్నం మండలంలో ఓటు వేస్తూ సెల్ఫీ తీసుకున్న యువకుడు. @ మెట్పల్లి పట్టణంలో ఒకరి ఓటును మరొకరు వేశారు. @ ఓటు హక్కును వినియోగించుకున్న ఎంపీ అభ్యర్థులు. @ మెట్ పల్లి మండలంలో గుండెపోటుతో రేషన్ డీలర్ మృతి. @ ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్లు.

News May 13, 2024

కరీంనగర్: పోలింగ్ ముగించుకొని తిరుగు ప్రయాణమైన సిబ్బంది

image

కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో సోమవారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగించుకొని పోలింగ్ సిబ్బంది తిరుగు ప్రయాణమయ్యారు. ఈవీఎం వీవీ ప్యాట్లను రిసెప్షన్ సెంటర్లలో అప్పగించి అనంతరం వారి స్వగ్రామాలకు బయలుదేరి వెళుతున్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాలలో ఆలస్యం అవుతుండడంతో వారు ఇంకా రిసెప్షన్ కేంద్రాలకు చేరుకోలేదు. పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో పోలింగ్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

News May 13, 2024

కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపై కేసు నమోదు

image

కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు క్రమ సంఖ్య 4వ నంబర్ కలిగిన టీ షర్టును ధరించి కాంగ్రెస్‌కు ఓటేయాలంటూ పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేస్తున్నారని ఎన్నికల సంఘానికి బీజేపీ కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్ బోయిన్‌పల్లి ప్రవీణ్ రావు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి రాజేందర్ రావుపై ఎన్నికల సంఘం అధికారులు కేసు నమోదు చేశారు.

News May 13, 2024

జగిత్యాల: తల్లి మృతి.. దుఃఖంలోనూ ఓటేశారు!

image

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన తోకల గంగాధర్ తల్లి మల్లు అనారోగ్యంతో మృతి చెందారు. పుట్టెడు దుఃఖంలో ఉన్నా ఓటు హక్కును గంగాధర్‌తో పాటు ఆయన భార్య ప్రవళిక వినియోగించుకున్నారు. ఓటు వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గంగాధర్ అన్నారు.

News May 13, 2024

ఓటును వినియోగించుకునేందుకు లండన్ నుంచి మెట్‌పల్లికి.. 

image

మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు తనయుడు కొమిరెడ్డి కపిల్ పార్లమెంట్ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి లండన్ నుంచి సోమవారం మెట్‌పల్లికి వచ్చారు. పట్టణంలోని పోలింగ్ కేంద్రానికి కుటుంబ సమేతంగా వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అర్హులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

News May 13, 2024

@ 5PM: పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ 63.86%

image

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు 5 గంటల వరకు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి-73.53%, చెన్నూర్- 68.00%, ధర్మపురి-69.83%, మంచిర్యాల-59.78%, మంథని-61.55%, పెద్దపల్లి- 64.80%, రామగుండం-55.18 శాతంగా ఉన్నాయి. మొత్తం పోలింగ్ 63.86% నమోదైంది. కాగా కరీంనగర్‌లో పోలింగ్ 55.92% నమోదైంది. ఇప్పటికే బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల, మంథనిలో పోలింగ్ పూర్తి అయింది.

News May 13, 2024

@5 PM: కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ 67.67%

image

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు సాయంత్రం 5 గంటల వరకు ఇలా ఉన్నాయి. చొప్పదండి- 70.13%, హుస్నాబాద్- 73.63%, హుజూరాబాద్-68.67%, కరీంనగర్-55.82%, మానకొండూర్-71.11%, సిరిసిల్ల-69.58%, వేములవాడ-71.26 శాతంగా ఉన్నాయి. మొత్తం పోలింగ్ 67.67% నమోదైంది.

News May 13, 2024

కరీంనగర్: ALERT.. మరో గంట మాత్రమే!

image

కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. కాగా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రధాన పార్టీలకు చెందిన నాయకుల మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు జరగగా పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. మరో గంటలో పోలింగ్ ముగియనున్న నేపథ్యంలో ఓటర్లు త్వరగా ఓటేసేందుకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఓటు వేయనట్లయితే త్వరగా వెళ్లండి. – SHARE IT

News May 13, 2024

@ 3PM: పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ 55.92%

image

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు 3 గంటల వరకు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి-63.00%, చెన్నూర్-58.65%, ధర్మపురి-60.23%, మంచిర్యాల-52.97%, మంథని-56.20%, పెద్దపల్లి-55.60%, రామగుండం-47.10 శాతంగా ఉన్నాయి. మొత్తం పోలింగ్ 55.92% నమోదైంది.

error: Content is protected !!