Karimnagar

News June 5, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ మంథని మండలంలో పిడుగుపాటుకు గేదె మృతి.
@ రాయికల్ మండలంలో రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి.
@ ఓదెల మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ.
@ మోరపల్లిలో బస్సు కిందపడి బాలుడి మృతి.
@ ఓదెల మండలంలో పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య.
@ గ్రూప్ 1 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్న జగిత్యాల కలెక్టర్.
@ వేములవాడ రాజన్న ఆలయంలో వైభవంగా మహా లింగార్చన.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం.

News June 5, 2024

కరీంనగర్: ఒకరికి మోదం.. ఒకరికి ఖేదం!

image

MP ఎన్నికల ఫలితాలు ఉమ్మడి కరీంనగర్ కాంగ్రెస్ నేతలకు మిశ్రమ స్పందనను మిగిల్చాయి. కరీంనగర్, పెద్దపల్లి కాంగ్రెస్ ఇన్చార్జిలుగా వ్యవహరించిన మంత్రులు అభ్యర్థుల గెలుపు కోసం శాయశక్తుల కృషి చేశారు. అయితే పెద్దపల్లిలో కాంగ్రెస్ గెలుపొందడంతో జిల్లాలో ఉత్సాహ వాతావరణం నెలకొంది. మొదటిసారి మంత్రి పదవి చేపట్టిన హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి విజయానికి చేసిన కృషి ఫలించలేదు.

News June 5, 2024

దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలనే మోడీకి ఓటేశారు: ఈటల

image

నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రజానీకానికి శిరస్సు వంచి నమస్కారం. దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలన్నా.. ఆత్మగౌరవం నిలబడాలన్నా మోదీకే మా ఓటు అని ప్రజలు వేశారని అన్నారు. అసెంబ్లీలో 15 శాతం ఉన్న ఓటు బ్యాంక్ 35కి పెరిగింది’ అని అన్నారు.  

News June 5, 2024

మేడిగడ్డ బ్యారేజ్ వద్ద భూపరీక్షలు

image

మేడిగడ్డ బ్యారేజ్‌లో సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ నిపుణులు భూపరీక్షలు ప్రారంభించారు. బ్యారేజ్ నిర్మాణంలో ఉపయోగించిన మట్టి, మెటీరియల్ నమూనాలను సేకరిస్తున్నారు. బ్యారేజ్ కుంగిన పిల్లర్ల వద్ద 25 ఫీట్ల మేర డ్రిల్ చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. భూభౌతిక, భూ సాంకేతిక పరీక్షలను నిపుణులు పర్యవేక్షిస్తున్నారు.

News June 5, 2024

చొప్పదండి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం!

image

చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం జన్మదిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక లేఖను విడుదల చేశారు. మేడిపల్లి సత్యం ప్రజాసేవలో నిమగ్నమై నియోజకవర్గ అభివృద్ధి కృషి చేయాలని, భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని పేర్కొన్నారు.

News June 5, 2024

జగిత్యాల: బస్సు కింద పడి బాలుడు మృతి

image

బస్సు కింద పడి ఓ బాలుడు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మోరపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ బాలుడు(4) ఇంటి నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చాడు. ఈ క్రమంలో జగిత్యాల నుంచి కొత్తపేటకు వెళ్తున్న బస్సు కింద పడటంతో నుజ్జునుజ్జుయి బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 5, 2024

KNR: లోక్‌సభ ఎన్నికల్లో పార్టీల వారీగా వచ్చిన ఓట్లు

image

నిన్న జరిగిన ఓట్లు లెక్కింపులో ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాల్లో పార్టీల వారీగా ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. KNR లోక్‌సభ పరిధిలో బీజేపీకి 5,85,116, కాంగ్రెస్‌కు 3,59,907, బీఆర్ఎస్‌కు 2,82,163 ఓట్లు వచ్చాయి. పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో కాంగ్రెస్‌కు 4,75,587, బీజేపీకి 3,44,223, బీఆర్ఎస్‌కు 1,93,356 ఓట్లు వచ్చాయి. KNRలో బీజేపీ, పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించిన విషయం తెలిసిందే.

News June 5, 2024

KNR: బీఆర్ఎస్ ఓటమి.. కార్యకర్త మృతి

image

లోక్‌సభ ఎన్నికల్లో BRS ఓటమిని జీర్ణించుకోలేక ఓ కార్యకర్త మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మొగిలిపేట గ్రామానికి చెందిన తుక్కన్న(80) BRS ఓడిపోయిందంటూ కనిపించిన వారి దగ్గరల్లా ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ తర్వాత గుండెపోటుతో మృతి చెందాడు. కాగా, మృతుడు TRS పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి పార్టీలోనే క్రియాశీల కార్యకర్తగా కొనసాగుతున్నారు.

News June 5, 2024

పవన్ కళ్యాణ్‌కు కలిసొచ్చిన కొండగట్టు సెంటిమెంట్!

image

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ సక్సెస్ అవ్వడంతో కొండగట్టు అంజన్న సెంటిమెంట్ కలిసొచ్చిందని ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్నను దర్శించుకొని ‘వారాహి’ వాహనానికి పూజలు చేయించారు. దీంతో ఆంజనేయస్వామి ఆశీస్సులు పవన్‌పై మెండుగా ఉన్నాయని, అంజన్న సెంటిమెంట్ కలిసొచ్చిందని అభిమానులు అంటున్నారు.

News June 5, 2024

పెద్దపల్లి: తండ్రీకొడుకుల చేతిలో ఓడిన గోమాసె శ్రీనివాస్

image

పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి BJP అభ్యర్థిగా పోటి చేసిన గోమాసె శ్రీనివాస్ 2 సార్లు ఒకే కుటుంబానికి చెందిన వారి చేతిలో ఓటమిపాలయ్యారు. 2009లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామిపై ఓడిపోయిన ఆయన తాజాగా ఆయన కుమారుడు వంశీకృష్ణపై ఓటమి పాలయ్యారు. 2009లో TRS తరఫున పోటీ చేసిన శ్రీనివాస్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామిపై 49,017 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాగా ఇప్పడు 1,31,364 ఓట్ల తేడాతో ఓడిపోయారు.