India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
@ కాటారం మండలంలో ఉరి వేసుకొని రైతు ఆత్మహత్య. @ సుల్తానాబాద్ మండలంలో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి. @ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ పై కేసు నమోదు. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ముగిసిన ఎన్నికల ప్రచారం. @ పార్లమెంట్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు: కరీంనగర్ సిపి. @ పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కరీంనగర్ కలెక్టర్.
ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలక్షన్ కమిషన్ నిబంధన మేరకు సైలెంట్ పీరియడ్ అమల్లోకి వచ్చింది. ఇకపై ఎలాంటి ఎన్నికల ప్రచారం నిర్వహించవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంతవరకు పార్లమెంట్ వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వస్తుందని తెలిపారు. ఎన్నికల నియమాలు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠినచర్యలు ఉంటాయని అధికారుల హెచ్చరించారు. సోమవారం ఓటింగ్ ప్రక్రియ మొదలుకానుంది .
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో మొత్తం 29.78 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 14.51 లక్షల మంది పురుషులు, 15.26 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఇందులో 30 ఏళ్ల లోపు యువత 7,00,201 మంది ఉన్నారు. అంటే మొత్తం ఓటర్లలో 23.50 శాతం యువతీ యువకులే. 18-19 ఏళ్లలోపు 82,100 ఓటర్లు ఉన్నారు. 20-29 ఏళ్ల లోపు 6,18,101 ఓటర్లు ఉన్నారు.
ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన ఘటనలో పెద్దపల్లి BRS MP అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. బెల్లంపల్లి మండలం పెద్దబూద గ్రామంలో ఈ నెల 6న పార్టీ కండువాలు ధరించి ప్రచారం చేసినట్లు పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎన్నికల అధికారులు ఆయనకు నోటీసులు పంపించారు. దీనిపై ఆయన వివరణ ఇవ్వాలని లేదంటే చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేశారు.
బావిలో పడి యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సుల్తానాబాద్‌లో జరిగింది. ఎస్ఐ, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. యాదవ్ నగర్‌కు చెందిన చింతల రాజు(20) గురువారం రాత్రి భోజనం చేసి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. శుక్రవారం ఓ వ్యవసాయ బావి వద్ద తన బైక్, చెప్పులు గమనించారు. కొడుకు మృతిపట్ల అనుమానాలు ఉన్నట్లు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిజామాబాద్ పార్లమెంట్ BJP అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ వేణుగోపాల్ శుక్రవారం తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 8న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి హిందువులకు ప్రమాదకరంగా మారాడన్నారు. జగిత్యాల ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని అర్వింద్ మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు. దీంతో ఎలక్షన్ ఇన్‌ఛార్జ్ విజయేందర్ ఫిర్యాదుతో కేసు చేశామన్నారు.
లోక్ సభ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 6 గంటలకు ముగించాలని, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. గడువు ముగిసిన తర్వాత రాజకీయ అంశాలకు సంబంధించిన బల్క్ ఎస్ఎంఎస్‌లు పంపడం నిషేధమన్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముస్లింలంతా ఒక్కటై బండి సంజయ్‌ను ఓడించాలంటూ మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో స్పందించారు. 20 శాతం ఓట్ల కోసం 80 శాతం హిందువులను అవమానిస్తున్న కేసీఆర్‌ను ఓడించి హిందువుల సత్తాను చాటాలని పిలుపునిచ్చారు. బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్‌కు బుద్ది చెప్పండని అన్నారు.
*కమలాపూర్ మండలంలో విద్యుత్ వైర్లు తగిలి బొలెరో వాహనం దగ్ధం.
*సిరిసిల్లలో రోడ్ షోలో పాల్గొన్న మాజీ సీఎం కేసీఆర్.
*కాంగ్రెస్ పార్టీకి ఉగ్రవాద సంస్థల మద్దతు: ఎంపీ అరవింద్.
*తంగళ్ళపల్లి మండలంలో మల్లన్న ఆలయంలో చోరీ.
*ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని పార్టీల నాయకుల విస్తృత ప్రచారం.
*కరీంనగర్లో రూ.88 వేల నగదు పట్టివేత.
*మెట్పల్లిలో ప్రచారం నిర్వహించిన ఎంపీ అరవింద్.
మే 11న సాయంత్రం 06 నుంచి మే 13న పోలింగ్ ముగిసే వరకు 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు కరీంనగర్ సీపీ అభిషేక్ మొహంతి ఉత్తర్వులు జారీ చేశారు. లోక్‌సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా, ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతా సహకరించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.