India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సిరిసిల్లలో నియోజకవర్గ పోలింగ్ ఏజెంట్ల సమావేశం నేడు జరిగింది. ఈ సమావేశానికి బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “హిందూ సమాజమంతా తన వెనుకుంది. నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా.. కరీంనగర్‌లో వినోద్ కుమార్ ఓడిపోతే బీఆర్ఎస్‌ను మూసేసి రాజకీయాల నుంచి తప్పుకునేందుకు నువ్వు సిద్ధమా?” అంటూ కేసీఆర్‌కు సవాల్ విసిరారు. దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలని అన్నారు.
ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్‌కు చెందిన వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గడ్డి రమేష్(42) ఈనెల 8న మద్యం సేవించి ఇంటికి వస్తున్న క్రమంలో వ్యవసాయ బావిలో పడ్డాడు. భార్య స్వప్న వెతకగా ఆయన ఆచూకీ దొరకలేదు. గురువారం ఉదయం తొమ్మిది గంటలకు బావిలో శవమై తేలాడు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై రమాకాంత్ కేసు నమోదు చేశారు.
హుజూరాబాద్ బస్టాండ్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. రోజుల వ్యవధి గల పసికందును గుర్తు తెలియని వ్యక్తులు వదివెళ్లారు. కాగా, చనిపోయి చీమలు పట్టిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా, రెండ్రోజుల క్రితం వదిలివెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మహాముత్తారం మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు జాడి కీర్తిబాయ్ గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆమె పార్థివ దేహానికి మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ శుక్రవారం నివాళులు అర్పించారు. అనంతరం కీర్తిబాయి అంతిమయాత్రలో మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పాల్గొని పాడె మోశారు.
రోడ్డు ప్రమాదంలో మహాముత్తారం కాంగ్రెస్ మండల <<13216465>>అధ్యక్షురాలు <<>>మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా ఆమె కాంగ్రెస్ నాయకులతో కలిసి మహాముత్తారంలో కీర్తిబాయి(45) ప్రచారం నిర్వహించారు. అనంతరం పెగడపల్లిలో ప్రచారం నిర్వహించడానికి ఆమె భర్తతో కలిసి కారులో వెళ్తుండగా నిమ్మగూడెం వద్ద కారు అదుపుతప్పి మట్టి కుప్పను ఢీకొట్టింది. దీంతో కీర్తిబాయి అక్కడికక్కడే మృతిచెందారు.
ఓటర్లను ప్రభావితం చేసేందుకు బుధవారం రాత్రి హుజూరాబాద్ క్లబ్‌లో విందు ఏర్పాటు చేయడంపై ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు, పర్యాటకాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్, బండ శ్రీనివాస్, క్లబ్ నిర్వాహకుడు రవీందర్ రావు, బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేసినట్లు సీఐ బొల్లం రమేశ్ గురువారం తెలిపారు.
రాజకీయ గురువు చొక్కారావును ఓడించిన జగపతిరావు కొడుకునే వెంటేసుకుని తిరుగుతూ గురువుకే పంగనామాలు పెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ అని, తనపై ఆరోపణలు చేయడం విడ్డూరమని బండి సంజయ్ ఆరోపించారు. తనపై పోటీ చేస్తే డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని వ్యక్తి పొన్నం అన్నారు. అలాంటి వ్యక్తి వ్యక్తిగత దూషణలు చేయడం సిగ్గు చేటన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు బాధితుల పోరాటంలో తాను పాల్గొని బాధితులకు అండగా నిలిచానన్నారు.
మోసపూరిత హామీలను ఇచ్చి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని మాజీ సీఎం KCR అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం లేదని, రైతు రుణమాఫీ చేయలేదని, మహిళలకు పెంచిన పెన్షన్లు ఇవ్వడం లేదని అన్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయట్లేమని ఫైర్ అయ్యారు.
కరీంనగర్ గడ్డ ఎంతో రాజకీయ చైతన్యం కలిగిన ఉద్యమాల గడ్డ అని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గీతా భవన్ చౌరస్తాలో రోడ్ షోలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి నాంది వేసిందే కరీంనగర్ అని తెలిపారు. కరీంనగర్ ప్రజలు తనను కడుపులో పెట్టి చూసుకున్నారని.. కరీంనగర్ లేకుంటే తెలంగాణ ఉద్యమానికి ఉనికి లేదని తెలిపారు. కరీంనగర్ అంటే తనకు ఎంతో ప్రేమ అని కేసీఆర్ చెప్పారు.
*ఎల్లారెడ్డిపేట మండలంలో చేపల వేటకు వెళ్లి యువకుడి మృతి.
*మహాముత్తారం మండలంలో కారు బోల్తా పడి కాంగ్రెస్ నాయకురాలు మృతి.
*మెట్పల్లి మండలంలో అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్ పట్టివేత.
*కరీంనగర్లో రోడ్ షోలో పాల్గొన్న మాజీ సీఎం కేసీఆర్.
*రేపు కమలాపూర్‌కు కేటీఆర్, సిరిసిల్లకు కేసీఆర్.
*పోలింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు: జగిత్యాల కలెక్టర్.
Sorry, no posts matched your criteria.