India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. అనంతరం ఈవీఎంల కౌంటింగ్‌ను ఎన్నికల కౌంటింగ్ అధికారులు ప్రారంభించారు. ఈవీఏం మెషిన్లను ఓపెన్ చేసి వివిధ పార్టీల అభ్యర్థులకు పోలైన ఓట్లను నమోదు చేస్తూ కౌంటింగ్ ఏజెంట్లకు చూపుతున్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రంలో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్, ఈటిపీబిఎస్ ఓట్ల లెక్కింపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపును కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతి పర్యవేక్షిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కాగానే ఈవీఎంల లెక్కింపును చేపట్టమన్నారు.
కరీంనగర్‌లో ఎవరు గెలుస్తారు…? పెద్దపల్లిలో ఎవరు గెలుస్తారు..? రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటూ పార్లమెంట్ ఫలితాలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మరికొద్ది గంటల్లోనే ఫలితాలు తేలిపోనుండటంతో అందరిలో పార్లమెంట్ ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ఎక్కడ నలుగురు కలిసినా ఓట్ల లెక్కింపు, ఫలితాలపైనే చర్చించుకుంటున్నారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు తుది ఫలితాలు వెలువడే అవకాశాలుంటాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం మరి కొన్ని గంటల్లో తేలనుంది. సుమారు 21 రోజుల నిరీక్షణకు నేటితో తెరపడనుంది. కరీంనగర్‌లోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్లను SRR కళాశాలలో లెక్కించనున్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన 4 అసెంబ్లీ సెగ్మెంట్లను మంథని JNTU కళాశాలలో లెక్కించనుండగా.. మిగతా 3 అసెంబ్లీ సెగ్మెంట్లవి మంచిర్యాలలోని ఐజా కళాశాలలో లెక్కిస్తారు.
కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వివరాలు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం కౌంటింగ్‌ను కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కౌంటింగ్‌ను రామగిరి మండలం పన్నూరులోని జేఎన్టీయూ కళాశాలలో నిర్వహిస్తున్నారు. అలాగే నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్‌ను డిచ్‌పల్లిలోని సీఎంసీ కళాశాలలో ఏర్పాటు చేశారు.
@ కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్. @ గోదావరిఖనిలో రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించిన మున్సిపల్ అధికారులు. @ వీర్నపల్లి మండలంలో ఉరి వేసుకుని యువతీ ఆత్మహత్య. @ సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రిలో శిశువు మృతి. @ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమలు. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ కోరుట్లలో కత్తిపోట్ల కలకలం.
ఉరేసుకుని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సోమవారం సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం లాల్‌సింగ్ తండాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూక్య సరస్వతి (18) అనే యువతి వ్యక్తిగత సమస్యలు తీర్చుకోలేకపోతున్నానని మనస్తాపం చెందింది. ఈ క్రమంలో ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య పాల్పడింది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి పెద్ద జయంతి సందర్భంగా వివిధ టికెట్ల ద్వారా రూ.1,51,38,490 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ చంద్రశేఖర్ తెలిపారు. దీక్ష విరమణ టికెట్ల ద్వారా రూ.31,09,700, శీఘ్ర దర్శనం ద్వారా రూ.21,77,500, కేశఖండనం ద్వారా రూ.9,76,150, లడ్డు ప్రసాదం ద్వారా రూ.76,42,000, పులిహోర ప్రసాదం ద్వారా రూ.12,33,140 ఆదాయం సమకూరినట్లు వివరించారు. ఈ ఏడాది ఆదాయం పెరిగినట్లు పేర్కొన్నారు.
కరీంనగర్ స్థానం బీజేపీదేనని RTV సర్వే తేల్చి చెప్పింది. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బండి సంజయ్, కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్‌రావు, బీఆర్ఎస్ నుంచి బోయినపల్లి వినోద్‌కుమార్ బరిలో ఉన్నారు. పెద్దపల్లి స్థానంలో కాంగ్రెస్ గెలుపొందనుందని ఈ సర్వే పేర్కొంది. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున గడ్డం వంశీకృష్ణ, బీజేపీ తరఫున గోమాస శ్రీనివాస్, బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ నిల్చున్నారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపును 162 రౌండ్లలో లెక్కించనున్నారు. నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 2,194 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటి కోసం గాను 116 టేబుళ్లను సిద్ధం చేశారు. మొత్తం ఇక్కడ 28 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందని భావిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.