Karimnagar

News June 3, 2024

కరీంనగర్: సీఎంను కలిసిన సివిల్ ర్యాంకర్

image

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన సాయికిరణ్ ఇటీవల విడుదలైన సివిల్స్-2023 ఫలితాల్లో ఆల్ ఇండియా 27వ ర్యాంకర్ సాధించిన విషయం తెలిసిందే. సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కుటుంబ సభ్యులతో కలిసి సాయి కిరణ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సివిల్స్ ర్యాంకర్‌ను సీఎం శాలువాతో సత్కరించి అభినందించారు.

News June 3, 2024

పెద్దపల్లి: రైళ్ల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు!

image

కాజీపేట- బల్లార్షా స్టేషన్ల మధ్య రైళ్లు తరచూ రద్దవుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా కంటే ముందు అందుబాటులో ఉన్న కాజీపేట- అజ్ని కరోనా సమయంలో రద్దయింది. దాని స్థానంలో ఎక్స్ ప్రెస్ రైలును తీసుకొచ్చినప్పటి 7 నెలల క్రితం అది కూడా రద్దయింది. పెద్దపల్లి- విజయవాడ మధ్య నడిచే పుష్పుల్ డెమో రైలును సైతం రద్దు చేశారు. ఈ రైళ్లను పునరుద్ధరించాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

News June 3, 2024

మన ఎంపీ వంశీకృష్ణనా.. కొప్పులనా.. శ్రీనివాసా?

image

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రేపే వెలువడనుండడంతో పెద్దపల్లి ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BRS నుంచి కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ, BJP నుంచి గోమాస శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. కాగా కాంగ్రెస్, BJP మధ్య పోటీ ఉంటుందని పలువురు అంటుండగా.. BRS, కాంగ్రెస్ మధ్య పోటీ ఉందని మరికొందరు అంటున్నారు. దీంతో ఈ స్థానం ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

News June 3, 2024

వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల కోలాహలం

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో సోమవారం స్వామివారికి ఇష్టమైన రోజు కావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. అర్చక స్వాములు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో గంటల తరబడి క్యూలైన్ భక్తులు వేచి చూశారు. ధర్మ దర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

News June 3, 2024

మన ఎంపీ బండినా.. వెలిచాలనా.. వినోద్ కుమార్‌నా?

image

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రేపే వెలువడనుండడంతో కరీంనగర్ ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BJP నుంచి బండి సంజయ్, BRS నుంచి వినోద్ కుమార్, కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ రావు పోటీలో ఉన్నారు. కాగా కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉంటుందని పలువురు అంటుండగా.. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉందని మరికొందరు అంటున్నారు. దీంతో ఈ స్థానం ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

News June 3, 2024

కరీంనగర్: రోడ్డు ప్రమాదంలో HM మృతి

image

రాష్ట్ర ఆవిర్భావ వేడుకల రోజున విషాదం నెలకొంది. పోలీసుల వివరాల ప్రకారం.. రామడుగు మండలం వెలిచాలకు చెందిన సత్తవ్వ VMWD మండలం శాత్రాజ్ పల్లి ZPHSలో ప్రధానోపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఆదివారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ముగించుకొని తిరిగి స్కూటీపై ఇంటికి వెళుతుండగా వెలిచాల క్రాస్ వద్ద HZB డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

News June 3, 2024

పెద్దపల్లి: కాంగ్రెస్ నాయకుడు హత్య

image

పెద్దపల్లి జిల్లాలో హత్య జరిగింది. స్థానికుల వివరాలు.. ధర్మారం మండలం కటికెనపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు రేండ్ల నరేశ్‌ కొత్తగా ఇంటిని నిర్మించుకుంటున్నారు. అక్కడ సమీపంలోని ఓ షెడ్డులో ఉంటూ పనులు చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో చీకటి పడ్డాక ఇద్దరు వ్యక్తులు పదునైన ఆయుధంతో దాడి చేయగా.. తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 3, 2024

సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్ర సాకారం.. సోనియాగాంధీకి ఆలయం

image

ఎల్లారెడ్డిపేట మేజర్‌ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచి నేవూరి వెంకట్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర సాకారానికి సోనియాగాంధీ కారణమని ఆమె ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అయితే 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి చెందడంతో BRSలో చేరారు.దీంతో ఆలయ నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మళ్లీ ఆయన హస్తం గూటికి చేరుకుని ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు.

News June 3, 2024

కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు: సీపీ

image

లోకసభ ఎన్నికల లెక్కింపు జూన్ 4న జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలుచేస్తూ కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులు 4న ఉదయం 6 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6గంటల వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఐదుగురికి మించి గుమికూడరాదని తెలిపారు.

News June 2, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. @ సుల్తానాబాద్ మండలం లో అగ్ని ప్రమాదంలో గడ్డి కట్టలు దగ్ధం. @ గంగాధర మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రధానోపాధ్యాయురాలికి తీవ్రగాయాలు. @ ఓదెల మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల కురిసిన వర్షం. @ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ.