Karimnagar

News May 6, 2024

నా పాదయాత్రకు బండి సంజయ్ స్ఫూర్తి: అన్నామలై

image

మోదీ గుండెలో బండి సంజయ్ కుమార్‌కు ప్రత్యేక స్థానం ఉందని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై అన్నారు. దక్షిణ భారత దేశంలో బీజేపీని బలోపేతం చేసేందుకు బండి సంజయ్‌కు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారని చెప్పారు. సంజయ్ చేసిన పోరాటాలు దేశానికే ఆదర్శనీయమన్నారు. సంజయ్ పాదయాత్ర స్ఫూర్తితోనే తమిళనాడులో తాను పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు.

News May 6, 2024

వేములవాడ: DSP హెచ్చరిక

image

ప్రధాని మోదీ వేములవాడ పర్యటన నేపథ్యంలో నేటి నుంచి బుధవారం వరకు 3 రోజుల పాటు వేములవాడ పట్టణ పరిధిలో డ్రోన్ల వినియోగంపై నిషేధం విధించినట్లు డీఎస్పీ నాగేంద్ర చారి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా డ్రోన్లు వినియోగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News May 6, 2024

పెద్దపల్లి: లోక్‌సభ ఎన్నికలపై అనాసక్తి!

image

పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో 2014లో జరిగిన పోలింగ్ కంటే 2019లో కాస్త పోలింగ్ శాతం తగ్గింది. 2014లో జరిగిన ఎన్నికల్లో 71.93 శాతం పోలింగ్ నమోదు కాగా.. 2019 ఎన్నికల నాటికి అది కాస్తా 65.59 శాతంకు తగ్గింది. ఎన్నికల్లో ఓటర్లందరూ ఓటు వినియోగించుకునేలా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ఎంత ప్రచారం చేసిన పెద్దగా ఫలితం ఉండడం లేదు.

News May 6, 2024

వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

image

వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. వేసవి సెలవులు కావడంతో రాజన్నను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజామునుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్‌లో బారులుదీరారు. అనంతరం ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు రాజన్నను దర్శించుకొని తరించారు.

News May 6, 2024

చిన్నబొంకూరు కన్నీరు!

image

ట్రాక్టర్‌ బోల్తా పడి చిన్నబొంకూర్‌‌కు చెందిన బేతి లక్ష్మీ, మల్యాల వైష్ణవి, పోచంపల్లి రాజమ్మ <<13186723>>మృతి చెందిన<<>> విషయం విదితమే. రాజమ్మ భర్త రాజకొమురయ్య మృతి చెందగా.. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నడిపి కుమారుల పెళ్లి చేసింది. అటు లక్ష్మి త్వరలోనే తన కొడుకు వివాహం జరిపించాలని నిర్ణయించుకుందని ఆమె భర్త విలపించారు.మల్యాల వైష్ణవి పిల్లలు ఇంటి వద్ద అన్నం తింటుండగా..తల్లి మరణ వార్త విని బోరున విలపించారు.

News May 6, 2024

వేములవాడ రాజన్న సన్నిధికి ప్రధాని మోదీ

image

వేములవాడ రాజన్నను దర్శించుకోవడానికి భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈనెల 8న రానున్నారు.ఈ మేరకు ప్రధాని పర్యటన షెడ్యూల్ కూడా ఖరారయ్యింది. ప్రధాని రాక సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ చరిత్రలో ఓ విశేషమేమంటే.. దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు గతంలో శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలిలోని ధర్మకర్తలలో ఒకరుగా ఉన్నారు.

News May 5, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ శంకరపట్నం మండలంలో మామిడి చెట్టు పైనుండి పడి వ్యక్తి మృతి. @ ఎల్లారెడ్డిపేట మండలంలో చెరువులో పడి యువకుడి మృతి. @ సుల్తానాబాద్ మండలంలో ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళలు మృతి. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని పార్టీల నాయకుల విస్తృత ప్రచారం. @ జగిత్యాలలో రోడ్ షోలో పాల్గొన్న మాజీ సీఎం కేసీఆర్. @ కాటారం మండలంలో గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు. @ హుస్నాబాద్: వడదెబ్బతో ఉపాధ్యాయుడి మృతి.

News May 5, 2024

గోదావరిఖని: ఉరేసుకుని సింగరేణి కార్మికుడి ఆత్మహత్య

image

గోదావరిఖని తిలక్‌నగర్‌కు చెందిన బొడ్డుపల్లి నరేష్ (38) సింగరేణి కార్మికుడు ఇంటిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వన్ టౌన్ SIశ్రీనివాస్ తెలిపారు. గత కొంత కాలం నుంచి నరేష్ మానసిక స్థితి బాగాలేక విధులకు హాజరుకావడం లేదన్నారు. ఇంటిలో ఉన్న వస్తువులు అన్ని పగలగొట్టి కుటుంబసభ్యులతో గొడవ పడినట్లు తెలిపారు. ఇదే క్రమంలో పైకప్పు సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకున్నట్లు SIతెలిపారు.

News May 5, 2024

వెల్గటూర్‌లో అత్యధికంగా 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. ఆదివారం అత్యధికంగా జగిత్యాల జిల్లాలోని వెల్గటూర్ లో 47.1°C, ఇబ్రహీంపట్నం మండలం గోదూరులో లో 46.8°C, రాయికల్ మండలం అల్లీపూర్ లో 46.7°C, కరీంనగర్ జిల్లా వీణవంకలో 46.7°C , జగిత్యాల జిల్లాలోని ధర్మపురిలో 46.1°C, బీర్పూర్ మండలం కొల్వైలో 46.0°C, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 45.9°C, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన లో 45.8°C ఉష్ణోగ్రత నమోదైంది.

News May 5, 2024

HSBD: వడదెబ్బతో ఉపాధ్యాయుడి మృతి

image

ఎలక్షన్‌ ట్రైనింగ్‌‌లో వడదెబ్బ తగిలి లకావత్‌ రామన్న (45) అనే ఉపాధ్యాయుడు మృతి చెందాడు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రామన్న హుస్నాబాద్ నుంచి గజ్వేల్‌కు ఎలక్షన్‌ విధులకు వెళ్లాడు. శిక్షణ సమయంలో వడదెబ్బ తగిలింది. డ్యూటీలో సిబ్బంది గజ్వేల్‌ PHCలో అడ్మిట్‌ చేశారు. ప్రథమ చికిత్స అనంతరం ఇంటికి వచ్చాడు. పరిస్థితి విషమించడంతో వరంగల్‌ MGMకు తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడని స్థానిక టీచర్లు తెలిపారు.

error: Content is protected !!