India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆదర్శకాలనీలో మందకుమార్ ఇంటి వెనుక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఇతను రైల్వే స్టేషన్లో, రైల్వే ట్రాక్ వెంబడి కాలి ప్లాస్టిక్ సీసాలు ఏరుకుంటూ జీవిస్తుంటాడని సమాచారం. ఇతడి స్వగ్రామం, కుటుంబసభ్యుల వివరాలు తెలిసినవారు జమ్మికుంట సీఐ ( 8712670776), జమ్మికుంట ఎస్ఐ (8712574759) నంబర్లకు సమాచారం అందించాలని జమ్మికుంట సీఐ వరంగంటి రవి తెలిపారు.
పెద్దపల్లి జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుల్తానాబాద్ మండలం రేగటి మద్దికుంటలో ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళలు మృతి చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మామిడి చెట్టు పై నుంచి కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన శంకరపట్నం మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. కన్నాపూర్ గ్రామానికి చెందిన నాంపల్లి ఎల్లయ్య ఇంటి ఆవరణంలోని మామిడి చెట్లు ఎక్కి కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని భార్య కొమురమ్మ తెలిపారు.
భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల పురాణిపేటలో జరిగింది. బింగి నవీన్ గోదావరికి చెందిన జ్యోత్స్నతో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇటీవల దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో భార్య పుట్టింటికి వెళ్ళింది. భార్య కాపురానికి రానని చెప్పడంతో దీంతో మనస్తాపానికి గురైన శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేపట్టారు.
కరీంనగర్ లోక్ సభ పరిధిలోని హుస్నాబాద్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికల్లో BJP అభ్యర్థిగా పోటీ చేసిన బొమ్మ శ్రీరాంచక్రవర్తి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. 3 రోజుల క్రితం మంత్రి పొన్నం, కాంగ్రెస్ అభ్యర్ధి వెలిచాల రాజేందర్ రావు శ్రీరాంచక్రవర్తితో మంతనాలు జరిపినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆదివారం పార్టీలో చేర్పించేందుకు మంత్రి ప్రభాకర్ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిసింది.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నేడు జిల్లాకు రానున్నారు. సాయంత్రం జగిత్యాల జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్ వరకు రోడ్డు షో నిర్వహించనున్నారు. నిజామాబాద్ లోక్ సభ బీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తరఫున ప్రచారం నిర్వహిస్తారు.
వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మత్తారం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. పారుపల్లికి చెందిన జెల్ల రాజేశ్వరి(25) కడుపు నొప్పితో భాదపడుతుంది. ఆస్పత్రుల్లో చూపించుకొని, మందులు వాడినా నయం కాలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆమె శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. భర్త సురేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
కరీంనగర్ జిల్లాలో భానుడు భగభగ మండుతున్నాడు. శనివారం జిల్లాలోనే అత్యధికంగా వీణవంక మండల కేంద్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 46.5 డిగ్రీలుగా నమోదైంది. గత 3,4 రోజులుగా ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తోంది. దీంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భానుడి ప్రతాపంతో ఇల్లు దాటి కాలు బయట పెట్టేందుకు జంకుతున్నారు. బయటికెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
వీవీ ప్యాట్స్‌లో జాగ్రత్తగా సింబల్ లోడింగ్ చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి సిబ్బందిని ఆదేశించారు. శనివారం హుజూరాబాద్‌లోని జూనియర్ కళాశాలలో వీవీ ప్యాట్స్‌లో సింబల్ లోడింగ్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జాగ్రత్తలపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, తేడాలు రాకుండా చూసుకోవాలని ఆదేశించారు.
@ తంగళ్ళపల్లి మండలంలో ఉపాధి హామీ కూలి మృతి. @ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న జగిత్యాల అడిషనల్ కలెక్టర్ దివాకర. @ వడదెబ్బతో వెల్గటూర్ మండల విద్యాధికారి మృతి. @ బీర్పూర్ మండలంలో వడదెబ్బతో రైతు మృతి. @ పెద్దపల్లి జిల్లాలో ప్రచారం నిర్వహించిన కేసీఆర్. @ బిఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఆరుగురు జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్లు.
Sorry, no posts matched your criteria.