India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జగిత్యాల మున్సిపాలిటీలోని బీఆర్ఎస్‌కు చెందిన ఆరుగురు కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకున్నారు. రేణుక (7వ వార్డు కౌన్సిలర్), పద్మ (17వ వార్డు), భారతి (10వ వార్డు), రజిని (33వ వార్డు), లావణ్య (38వ వార్డు), గంగాసాగర్ (21వ వార్డు) రిజైన్ చేశారు. అయితే జగిత్యాలలో కేసీఆర్ రోడ్‌షో నిర్వహించనున్న నేపథ్యంలో వారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఎండాకాలం నేపథ్యంలో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. దీంతో జగిత్యాల జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ధర్మపురి మండలం నేరెళ్లలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకే 46.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో నేరెళ్ల రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. అటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలు నేడు రెడ్‌జోన్లో కొనసాగుతున్నాయి. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
బీర్పూర్ మండలంలోని మంగేలా గోండుగూడెమునకు చెందిన కొమురం సోము (58) అనే రైతు శనివారం వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఉదయం నువ్వు పంట కోయడానికి తన వ్యవసాయ భూమికి వెళ్లిన ఆయన తిరిగి మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నారు. నీరసంగా ఉందని పడుకోగా.. ఇంతలోనే భార్య నీళ్లు తాగమని లేపే సరికి అప్పటికి చనిపోయి ఉన్నాడని తెలిపారు. అతని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరారు.
ఓటర్లు అసెంబ్లీ ఎన్నికలపై చూపినంత ఆసక్తి లోక్‌సభ ఎన్నికలపై చూపడం లేదు. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య పెరుగుతున్నా పోలింగ్ శాతం మాత్రం పెరగడం లేదు. 2014లో జరిగిన ఎన్నికల్లో 74.71 శాతం పోలింగ్ నమోదు కాగా.. 2019 ఎన్నికల నాటికి అది కాస్తా 69.52 శాతంకు తగ్గింది. ఈసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్యను మరింత పెంచాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల విద్యాధికారి బత్తుల భూమన్న మృతి చెందారు. వడదెబ్బతో శనివారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎంఈఓ మృతి పట్ల మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
@ సైదాపూర్ మండలంలో బైక్ అదుపు తప్పి కిందపడి మహిళా మృతి. @ మెట్పల్లి పట్టణంలో 1,50,000 నగదు సీజ్. @ ఓదెల మండలంలో వడదెబ్బతో రైతు మృతి. @ రామగుండం రోడ్ షో లో కేసీఆర్. @ ధర్మపురి నియోజకవర్గంలో జన జాతర సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. @ రాయికల్ పట్టణంలో 11 మందిపై పిచ్చికుక్క దాడి. @ వేములవాడ రూరల్ మండలంలో బొలెరో వాహనం ఢీకొని బాలుడు మృతి. @ పార్లమెంట్ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు: కరీంనగర్ కలెక్టర్
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్‌కు మాజీ సీఎం KCR చేరుకున్నారు. 48 గం. ప్రచార నిషేధం అనంతరం శుక్రవారం గోదావరిఖని చౌరస్తాలో 8 గం. తర్వాత జరిగే బస్ యాత్రలో పాల్గొని ప్రసంగించనున్నారు. స్థానిక ఇల్లెందు క్లబ్‌కు వెళ్లిన ఆయన.. ర్యాలీ ద్వారా చౌరస్తాకు వెళ్లనున్నారు. అనంతరం PDPL MP అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ను గెలిపించాలని ప్రసంగించనున్నారు.
వాహనం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన సిరిసిల్ల జిల్లాలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లిలో శుక్రవారం ఉదయం బాలుడు సూర హర్షవర్ధన్(6) రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో బొలెరో వాహనం ఢీకొంది. తీవ్ర గాయాలైన బాలుడిని వేములవాడలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడని స్థానికులు చెప్పారు.
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎక్సైజ్ ఎస్ఐ అనుమానాస్పదంగా మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన కాళీ ప్రసాద్(54)మూడు నెలల క్రితం బదిలీపై ఎల్లారెడ్డిపేటకు వచ్చారు. మండల కేంద్రంలో ఇంట్లో అద్దెకు ఉంటుంన్నారు. శుక్రవారం ఉదయం అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కనిపించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కరీంగనర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఎలాబోతారం గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూరాబాద్ పట్టణం ఇందిరానగర్‌కు చెందిన రమ తన కుమారుడితో కలిసి బైక్‌పై హుజూరాబాద్ నుంచి రాములపల్లి గ్రామానికి వెళ్తున్నారు. ఈక్రమంలో ఎలాబోతారం కమ్యూనిటీ హాల్ వద్ద బైక్ అదుపుతప్పి కింద పడడంతో తలకు తీవ్ర గాయం కావడంతో రమ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.