Karimnagar

News May 3, 2024

నేడు గోదావరిఖనికి మాజీ CM KCR

image

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మాజీ CM KCR ఈరోజు సాయంత్రం గోదావరిఖని చౌరస్తాలో జరిగే రోడ్డు షోలో పాల్గొంటారని BRS అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రజల్లో BRSకు వస్తున్న ఆదరణ ఓర్వలేక రోడ్డు షోను ఆపేందుకు అధికార పార్టీ పాలకులు దుర్మార్గపు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ బస్సు యాత్ర విజయవంతం చేయాలన్నారు.

News May 3, 2024

మ్యాచ్ ఫిక్సింగ్‌కి బ్రాండ్ అంబాసిడర్ బండి సంజయ్: ఎంపీ అభ్యర్థి

image

కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు కరీంనగర్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌పై నిప్పులు చెరిగారు. శాసనసభ ఎన్నికల్లో మంగళసూత్రం అమ్మి నామినేషన్ వేసిన బండి సంజయ్‌కి వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. మ్యాచ్ ఫిక్సింగ్‌కి బండి సంజయ్ బ్రాండ్ అంబాసిడర్ అని, తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఎంతకైనా దిగజారే వ్యక్తి బండి సంజయ్ అంటూ ద్వజమెత్తారు.

News May 2, 2024

వేములవాడ రాజన్న హుండీ లెక్కింపు

image

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి హుండీ లెక్కింపును గురువారం ఆలయ ఓపెన్ స్లాబ్‌లో నిర్వహించారు. గడిచిన 21రోజులకు గాను స్వామివారికి రూ.1కోటి 52లక్షల 15 వేల 575 నగదుతో పాటు 218 గ్రాముల బంగారం, 11కిలోల 500గ్రాముల వెండి సమకూరినట్లు ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ EO కృష్ణప్రసాద్, కరీంనగర్ AC కార్యాలయం పరిశీలకులు సత్యనారాయణ, AEO హరికిషన్ తదితరులు పాల్గొన్నారు.

News May 2, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

*జగిత్యాలలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్ట్.
*మెట్‌పల్లిలో రూ.1,70,000 నగదు సీజ్.
*చత్తీస్‌గడ్ ఎన్కౌంటర్లో భీమదేవరపల్లి మండల వాసి మృతి.
*మెట్పల్లిలో కోర్టుకు హాజరు కాకుండా తిరుగుతున్న వ్యక్తి అరెస్ట్.
*ఎన్నికల భద్రత ఏర్పాట్లపై రామగుండం సీపీ సమీక్ష.
*బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన బుగ్గారం ఎంపీపీ, జడ్పీటీసీ.
*ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని పార్టీల నాయకుల విస్తృత ప్రచారం.

News May 2, 2024

మనమే నంబర్ వన్: బండి సంజయ్

image

కరీంనగర్ నగరంలోని మంచిర్యాల చౌరస్తా స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌ను బండి సంజయ్ నిర్వహించారు.‌ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో మనమే నంబర్ వన్. బ్యాలెట్ పేపర్లో కూడా 1వ స్థానం మనదే అన్నారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ఎండలను లెక్క చేయకుండా ప్రతి ఒక్కరూ, ఊరూవాడా కదిలి వచ్చి బ్యాలెట్ పేపర్లోని 1వ నంబర్ పక్కనున్న పార్టీ గుర్తుపై బటన్ నొక్కి ఓటేసి బంపర్ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

News May 2, 2024

ధర్మపురి దేవస్థానం ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి గురువారం రూ.99,343 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. టికెట్ల ద్వారా రూ.54,792, ప్రసాదాల ద్వారా రూ.28,760, రూ.15,791 విరాళం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి సంకటాల శ్రీనివాస్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

News May 2, 2024

KNR: మరణంలోనూ మరో ఇద్దరికి కాంతి పంచారు

image

మంథని మండలం నాగారం గ్రామానికి చెందిన గీట్ల ప్రతాప్ రెడ్డి(102) అనే పోలీసు పటేల్ అనారోగ్యంతో మరణించారు. కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు సదాశయ ఫౌండేషన్ ద్వారా నేత్రదానం చేశారు. HYD-LV ప్రసాద్ ఐ ఆసుపత్రి టెక్నీషియన్ రాజన్న ఆధ్వర్యంలో మృతుడి నేత్రాలను సేకరించారు. కుటుంబ సభ్యులు దామోదర్ రెడ్డి, సుగుణ, నరోత్తం రెడ్డి, పుష్ప, రామకృష్ణారెడ్డి, పద్మ, సుజాత, రాం రెడ్డి, పుష్పా, కృష్ణారెడ్డి, నిర్మల ఉన్నారు.

News May 2, 2024

భీమదేవరపల్లి: ఎన్ కౌంటర్‌లో వంగర వాసి మృతి

image

ఛత్తీస్ ఘడ్‌లోని అబుజ్ మాడ్‌లో జరిగిన ఎన్ కౌంటర్‌లో భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన కాశవేణి రవి ఆలియాస్ వినయ్ మృతి చెందాడు. కాగా, 33 ఏళ్ల క్రితం తన తండ్రి ఉపాధి నిమిత్తం మంచిర్యాలలో ఉండగా.. మావోయిస్టుల్లో చేరిన అనంతరం రవి డీసీఎం స్థాయికి ఎదిగాడు. ఈ క్రమంలో ఎన్ కౌంటర్‌లో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

News May 2, 2024

గోదావరిఖనిలో రేపు రాత్రి మాజీ CM- KCRరోడ్ షో

image

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మాజీ CM- KCRరేపు రాత్రి 8 గంటల తర్వాత గోదావరిఖని చౌరస్తాలో జరిగే రోడ్డు షోలో పాల్గొంటారని BRSపార్టీ MPఅభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గోదావరిఖని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల్లో BRSకు వస్తున్న ఆదరణ ఓర్వలేక రోడ్డు షో ను ఆపేందుకు అధికార పార్టీ పాలకులు దుర్మార్గపు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. మాజీ MLAకోరుకంటి చందర్ ఉన్నారు.

News May 2, 2024

బుగ్గారం: బీఆర్ఎస్‌కు రాజీనామా ఎంపీపీ, జడ్పీటీసీ

image

బుగ్గారం మండల MPP, ZPTC బాదినేని రాజమణి, రాజేందర్ గురువారం BRSకు రాజీనామా చేశారు. ధర్మపురి నియోజకవర్గంలో కీలకనేతగా గుర్తింపు పొందిన రాజేందర్ రాజీనామా చేయడంతో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పార్టీ పిలుపు మేరకు అన్నికార్యక్రమాలు చేపట్టిన కూడా తమను అణచివేతకు గురిచేసి, చిన్నచూపు చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రాజీనామా చేసినట్టు వివరించారు.

error: Content is protected !!