Karimnagar

News May 2, 2024

తెలంగాణలో కాంగ్రెస్సే గాడిదగుడ్డు: బండి సంజయ్

image

రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందని.. అందుకే గాడిద గుడ్డులో కూడా మోదీ కన్పిస్తున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ప్రచారంలో భాగంగా సీఎం ఒక గుడ్డు పెట్టుకుని ప్రధాని గాడిద గుడ్డు ఇచ్చారని మాట్లాడుతున్నారన్నారు. పేదలకు రూ.2500 ఇస్తా అని మోసం చేశారని, రూ.4వేల పింఛన్ , తులం బంగారం ఇస్తా అని మోసం చేసిన కాంగ్రెస్ తెలంగాణలో గాడిద గుడ్డుతో సమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

News May 2, 2024

కేసీఆర్‌పై నిషేధం.. ఉమ్మడి జిల్లా టూర్ క్యాన్సిల్

image

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఈసీ 48 గంటల నిషేధాన్ని విధించింది. దీంతో గురు, శుక్రవారాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరగాల్సిన బస్సుయాత్ర రద్దైంది. గురువారం సాయంత్రం జమ్మికుంటలో రోడ్‌షోలో పాల్గొని వీణవంకల బస చేయాల్సి ఉంది. ఈనెల 3న రామగుండంలో బస్సుయాత్ర చేసి అక్కడే బస చేయాల్సి ఉంది. మారిన షెడ్యూల్ ప్రకారం రామగుండంలో బస మాత్రమే చేసే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

News May 2, 2024

KNR: ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు

image

ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గొప్ప అనుకునే ఈరోజుల్లో ఓ యువకుడు అద్భుతం సృష్టించాడు. జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం తుంగూర్‌కు చెందిన బెత్తపు సంజయ్ పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యాడు. 2022లో రైల్వే ఉద్యోగం సాధించాడు. 2023లో ఎక్సైజ్ కానిస్టేబుల్ఉద్యోగం, టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ అధికారి, గ్రూప్-4, ఏఈఈ, ఏఈ పోస్టులకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం కానిస్టేబుల్ శిక్షణలో ఉన్న సంజయ్ ఏఈ ఉద్యోగంలో చేరుతానన్నారు.

News May 2, 2024

RFCLలో గత నెల 1,14,002.82 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి

image

రామగుండం ఎరువుల కర్మాగారంలో Aprilలో 1,14,002.82 మెట్రిక్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేసినట్లు CGMసుధీర్ కుమార్ ఝూ తెలిపారు. ప్రస్తుతం ప్లాంట్ లో ఉత్పత్తి అయిన నీమ్ కోటెడ్ యూరియా రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నామన్నారు. TG-35, 332.65MT, AP-8, 407.98MT, KT-20, 319.75MT, MH-14, 649.12MT, CG-13,526.37MT, TN-13, 520.43MT, MP-8,246.52MTలు సరఫరా చేశామన్నారు. ఈ సందర్భంగా అధికారులు, ఉద్యోగులను CGMఅభినందించారు.

News May 1, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మే డే దినోత్సవ వేడుకలు. @ బీర్పూర్ మండలంలో గుండెపోటుతో కార్మికుడి మృతి. @ సారంగాపూర్ మండలంలో వడదెబ్బతో ఐదేళ్ల బాలుడి మృతి. @ కోరుట్ల లో నిర్వహించిన జన జాతర బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. @ కేసులకు భయపడేది లేదన్న రేవంత్ రెడ్డి. @ ముత్తారం మండలంలో గుడుంబా స్థావరాలపై దాడులు.

News May 1, 2024

రామడుగు: వడదెబ్బతో ఐదేళ్ల బాలుడు మృతి

image

రామడుగు మండలం గోపాల్‌రావుపేట గ్రామానికి చెందిన కళ్లెం అంజయ్య పుష్ప దంపతుల కుమారుడు యశ్వంత్ (5) వడదెబ్బతో మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. ప్రకారం రోజువారీ లాగే ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న యశ్వంత్ ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడి మృతిచెందినట్లు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన అంజయ్య పుష్ప దంపతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

News May 1, 2024

జగిత్యాల: కత్తితో కోడల్ని చంపిన మామ

image

కుటుంబ కలహాలతో కత్తితో మామ కోడల్ని చంపిన ఘటన జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రేచపల్లి గ్రామానికి చెందిన మౌనిక(కోడలు)ను మామ రాజిరెడ్డి మటన్ కొట్టే కత్తితో గొంతు కోసి పారిపోయాడు. కాగా, నిందితుడికోసం పోలీసులు వెతుకుతున్నారు. మృతురాలి భర్త విదేశాలలో ఉన్నాడు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 1, 2024

కేసులు పెడితే భయపడేది లేదు: రేవంత్ రెడ్డి

image

కేంద్ర ప్రభుత్వం తనపై కేసులు పెడితే భయపడేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కోరుట్ల పట్టణ శివారులో జరిగిన జన జాతర సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తన వెనుక నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మార్చిన, రిజర్వేషన్లు రద్దు చేసిన ఊరుకునేది లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు.

News May 1, 2024

కోరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి

image

కోరుట్ల శివారులో నిర్వహిస్తున్న జన జాతర బహిరంగ సభకు విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, కోరుట్ల కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ జువ్వాడి నర్సింగరావు, సీనియర్ నాయకులు కృష్ణారావు, కొమిరెడ్డి కరంచంద్, తదితరులు సీఎంకు స్వాగతం పలికారు. అనంతరం సభలో పాల్గొన్న సీఎం.. ముందుగా కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు తెలిపారు.

News May 1, 2024

కరీంనగర్: ప్రచారానికి వడదెబ్బ!

image

లోక్ సభ ఎన్నికల ప్రచారానికి వడదెబ్బ తగిలింది. KNR, పెద్దపల్లి నియోజకవర్గాల్లో రోజూ ఉదయం 6-10 గంటల వరకు, సాయంత్రం 6-10 రాత్రి గంటల వరకు వివిధ పార్టీల నాయకులు ప్రచారం చేస్తున్నారు. సగటున రోజుకు 42 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత ఉండటంతో మధ్యాహ్నం పార్టీ ఆఫీసులకు పరిమితమై కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. ప్రచారానికి ఇంకా 11 రోజులే ఉండటంతో జనాల్లోకి మరింత ఎక్కువగా వెళ్లాలని యోచిస్తున్నారు.

error: Content is protected !!