India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జమ్మికుంటలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి జనజాతర సభకు వెళ్లి వడదెబ్బతో మహిళ మృతి చెందిన ఘటన వీణవంక మండలం రెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అంబాల ఐలమ్మ జనజాతర సభకు మంగళవారం వెళ్లారు. ఈ క్రమంలో ఆమె వడదెబ్బకు గురయ్యారు. దీంతో ఆమె మృతిచెందారు. వారి కుటుంబసభ్యులను హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి ప్రణవ్ పరామర్శించారు. కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున అన్నిరకాలుగా ఆదుకుంటామన్నారు.
కోరుట్ల పట్టణంలోని పశువైద్య కళాశాల సమీపంలో నేడు జరుగనున్న జన జాతర ఎన్నికల ప్రచార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డికి మద్దతుగా నిర్వహించే సభలో సీఎం పాల్గొంటారని ఎమ్మెల్సీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
సెలవులు ముగిసేలోగా మరమ్మతు పనులు పూర్తి చేయాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. వేములవాడ మండలం వట్టెంల, ఫాదర్ నగర్ గ్రామాలలోని జిల్లా పరిషత్ పాఠశాలలో చేపట్టనున్న మరమ్మతు పనుల మంగళవారం ఆయన పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమ్మ ఆదర్శ పాఠశాల కింద తరగతి గదులు మరుగుదొడ్లు మరమ్మతుల పనులు చేయించాలని అధికారులకు ఆయన సూచించారు.
గ్రూప్ 1 పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి నికోలస్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నోడల్ అధికారులు, పోలీసు నోడల్ అధికారులతో హైదరాబాదు నుంచి మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జూన్ 9న జరగనున్న గ్రూప్ 1 పరీక్షకు అన్నిమౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
సిద్దిపేట జిల్లా కోడూరు మండలంలోని అలిపూర్ గ్రామానికి చెందిన బాలయ్య అనే వ్యక్తి తన ఆస్తులను కొండగట్టు ఆంజనేయస్వామికి రాసిచ్చేందుకు సిద్ధమయ్యాడు. కని పెంచిన కొడుకులు సరిగ్గా చూసుకోవడం లేదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. కాగా తన ఆస్తులను ఆంజనేయ స్వామి పేరిట పట్టా చేసేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని కోరాడు.
నేడు విడుదలైన పదోతరగతి ఫలితాల్లో గిరిజన అమ్మాయి సత్తా చాటింది. సిరిసిల్ల జిల్లా వీర్ణపల్లి మండలం బంజేరు గ్రామానికి చెందిన అమూల్య పదోతరగతి ఫలితాల్లో 10 జీపీఏ సాధించింది. తన కూతురు రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించడం పట్ల తల్లిదండ్రులు రమేశ్, రాధిక సంతోషం వ్యక్తం చేశారు. పలువురు గ్రామస్థులు అమూల్యను అభినందించారు.
పదోతరగతి ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలో సిరిసిల్ల 98.27 శాతంతో రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. కరీంనగర్ 96.65 శాతంతో ఏడో స్థానం, పెద్దపల్లి 96.32 శాతంతో ఎనిమిదో, జగిత్యాల 95.76 శాతంతో 11వ స్థానంలో నిలిచింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 8న వేములవాడకు రానున్నారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వస్తున్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. భారీ జన సమీకరణకు సిద్దమవుతున్నారు.
నేడు పదోతరగతి ఫలితాలు ఉదయం 11గంటలకు వెలువడనున్నాయి. కరీంనగర్ జిల్లాలో 12,650 మంది, పెద్దపల్లి జిల్లాలో 7,728, జగిత్యాలలో 11,366 మంది, సిరిసిల్లలో 6,486 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. అందరి కంటే ముందుగా రిజల్ట్స్‌ను Way2News యాప్‌లో సులభంగా, వేగంగా పొందవచ్చు.
MP ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. కరీంనగర్‌లో 33 నామినేషన్లు ఆమోదించగా.. ఐదుగురు విత్‌డ్రా చేసుకొన్నారు. 28 మంది బరిలో నిలిచారు. పెద్దపల్లి లోక్‌సభలో 49 నామినేషన్లు ఆమోదించగా.. ఏడుగురు విత్ డ్రా చేసుకోగా.. 42 మంది బరిలో ఉన్నారు. SHARE IT
Sorry, no posts matched your criteria.