India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల పోలీస్ స్టేషన్‌లో కోర్టు విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ మనోహర్‌ను సోమవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నాన్ బెయిల్ వారెంట్ జారీ అయిన కేసులో పెరకపల్లి గ్రామానికి చెందిన తిరుపతి మామ గంగాధర్ వద్ద రూ.5,000 తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ తిరుపతి, సీఐ క్రిష్ణ కుమార్ పట్టుకున్నారు. దుబాయిలో ఉన్న ఫిర్యాదుదారుడు తిరుపతి మెయిల్ ద్వారా ACB DGకి ఫిర్యాదు చేశారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల అంశానికి సంబంధించి కోడ్ ఉల్లంఘనతో పాటు ఏమైనా ఫిర్యాదులు, సలహాలు, సూచనల కోసం ఎన్నికల పరిశీలకులను సంప్రదించవచ్చని కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం తెలిపారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు అమిత్ కటారియా మొబైల్ నంబర్ 9177435833, పోలీస్ పరిశీలకులు మనీష్ చౌదరి మొబైల్ నంబర్ 7032800525, వ్యయ పరిశీలకులు అశ్వినీ కుమార్ పాండే మొబైల్ నంబర్ 9032659531లో సంప్రదించాలన్నారు.
పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు మినహా మిగిలిన 24 మంది అభ్యర్థులకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గుర్తులను కేటాయించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అభ్యర్థుల సమక్షంలో గుర్తుల కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు. అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల జాబితాను కలెక్టర్ ఛాంబర్ ఆవరణలో ప్రదర్శించారు.
సిరిసిల్ల జిల్లాలో ‘ఆపరేషన్ చబుత్ర’ మొదలైంది. రాత్రి పూట సరదాగా బయట తిరిగితే పోలీసులు అరెస్టు చేస్తున్నారు. సరైన కారణం లేకుండా రాత్రిపూట రోడ్లపై తిరిగితే అంతే సంగతి. SP అఖిల్ మహాజన్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్ చబుత్రలో భాగంగా ఇప్పటివరకు ఏ కారణం లేకుండా తిరుగుతున్న 256 మంది యువకులను వారి 81 ద్విచక్ర వాహనాలను పోలీసులు పట్టుకున్నారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల బరిలో నామినేషన్లు ఉపసంహరణ అనంతరం 28 మంది బరిలో నిలిచారు. మొత్తం 33 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. వివిధ పార్టీల అభ్యర్థులతో పాటు 15 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దీంతో ఇక్కడ రెండు ఈవీఎం మెషిన్లను ఏర్పాటు చేయవలసి ఉంటుంది.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం వర్గానికి దాఖలైన నామినేషన్ల నుండి ఐదుగురు అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేల సత్పతి సోమవారం తెలిపారు. రాజ్యాధికార పార్టీ అభ్యర్థి ఆరెల్లి సుమలతతో పాటు స్వతంత్ర అభ్యర్థులైన పిడిశెట్టి రాజు, పచ్చిమట్ల రవీందర్, ఎండి జిషన్, గుజ్జుల శ్రీనివాస్ రెడ్డి నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని అడవి రేగుంట గ్రామానికి చెందిన రాజారెడ్డిపై కొడుకు శేఖర్ సోమవారం పారతో తలపై దాడి చేశాడు. తీవ్ర గాయాలైన రాజారెడ్డిని చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా పరిధిలో ఇద్దరు రాజకీయ నాయకుల వారసులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పెద్దపల్లి బరిలో మాజీ ఎంపీ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడు వంశీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కరీంనగర్‌లో మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు తనయుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ రాజేందర్ రావు కాంగ్రెస్ నుంచే బరిలో ఉన్నారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఉండేందుకు ఉమ్మడి జిల్లాలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 28 వరకు నిర్వహించిన తనిఖీలలో రూ.9.71 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో రూ. 71లక్షలకు మాత్రమే ఆధారాలు చూపించి వెనక్కి తీసుకున్నారు. బంగారం, మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలను సైతం స్వాధీనం చేసుకున్నారు.
ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని యువకుడు బానోత్ అనిల్ (26) శనివారం ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబసభ్యులు అనిల్ ఆచూకీ కోసం వెతికే క్రమంలో ధర్మారం గ్రామశివారులోని ఊరకుంట చెరువులో అతడి మృతదేహం కనిపించింది. ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగి చనిపోయినట్లు మృతుడి తల్లి బానోతు చిన్నమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ టి.సత్యనారాయణ తెలిపారు.
Sorry, no posts matched your criteria.