India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లోక్‌సభ ఎన్నికల్లో పోటీలో ఉండేదెవరో ఈరోజు తేలిపోనుంది. నామినేషన్ల ఉపసంహరణకు 3 గంటల వరకే సమయం ఉంది. దీంతో బరిలో ఎవరు ఉంటారు..? ఎవరు నామపత్రాలు వెనక్కి తీసుకుంటారో వెల్లడి కానుంది. 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. కరీంనగర్‌లో 53 మంది, పెద్దపల్లికి 63 మంది, నిజామాబాద్‌లో 42 మంది నామపత్రాలు దాఖలు చేశారు. 114 మందిలో తుది పోటీలో ఎవరు ఉంటారో మరికొద్ది గంటల్లో తేలనుంది.
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం రూ.1,81,459 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాల టికెట్లు అమ్మకం ద్వారా రూ98,542, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.62,880, అన్నదానం రూ.20,037, వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌కు చెందిన మట్ట సురేశ్ రెడ్డి- దీప్తి దంపతులు నిర్మల్ జిల్లాలోని బంధువుల ఇంటికి ‘ఆడెల్లి పోచమ్మ’ బొనాల పండగకు వెళ్లారు. అది ముగించుకుని తిరుగు పయనమయ్యారు. డిచ్‌పల్లి వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఇందులో దీప్తి మృతిచెందగా.. సురేశ్ గాయాలతో బయటపడ్డారు.
జగిత్యాల జిల్లాలో సూర్యుడు భగభగ మండుతున్నాడు. దీంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలోని వెల్గటూర్ మండల కేంద్రంలో నేడు 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో వెల్గటూర్‌కు వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ జారీచేసింది. ఎండల నేపథ్యంలో ఉదయం 10 నుంచే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. అటు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
ఎంపీ నామినేషన్ల ఉపసంహరణకు రేపటితో చివరి గడువు అని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్ణీత నమూనా 5లో కలెక్టరేట్లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలన్నారు. 3గంటల తర్వాత నామినేషన్ల ఉపసంహరణకు వచ్చే దరఖాస్తులను ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం సెలవు దినం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ముందుగా పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి, స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా వేములవాడ రాజన్న స్వామివారికి పేరుంది.
కొడుకుని తండ్రి <<13131085>>హత్య <<>>చేసిన విషయం తెలిసిందే. పోలీసుల కథనం ప్రకారం.. చింతకుంటకు చెందిన శ్రీనివాస్ కొడుకు శివసాయి(21) HYDలో ఉద్యోగం చేస్తున్నాడు. శివసాయి ఇంటికి రావడంతో, ఆన్‌లైన్ గేమ్‌లో డబ్బులు పోగొట్టొద్దని తండ్రీకొడుకుల మధ్య వాదన చోటుచేసుకుంది. ఈక్రమంలో భూమి అమ్మాలంటూ తండ్రిపై ఒత్తిడి తేవడంతో శుక్రవారం కొడుకు నిద్రిస్తున్న సమయంలో కారం చల్లి, రోకలి బండతో మోది హత్యచేసినట్లు పోలీసులు తెలిపారు.
ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించాడు. ఇటీవల బదిలీపై తాడువాయి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం వేకువ జామున మూడు గంటల ప్రాంతంలో కారులో కామారెడ్డికి వెళ్తుండగా, కారు రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు.
లంచం తీసుకుంటూ ఇన్‌ఛార్జి సబ్‌రిజిస్ట్రార్ పట్టుబడ్డిన విషయం తెలిసిందే. దీంతో కరీంనగర్‌లోని గంగాధర ఇన్‌ఛార్జి సబ్ రిజిస్ట్రార్ సురేశ్‌బాబు నివాసంలో శనివారం అనిశా అధికారులు సోదాలు జరిపారు. రూ.12.30 లక్షల నగదు, 350 గ్రాముల బంగారు ఆభరణాలు గుర్తించారు. ఇంకా ఏమైనా ఆస్తులకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయా? అనే కోణంలో ఆరా తీశారు.
జగిత్యాల జిల్లా యువకుడు, శ్రీలంక యువతి మధ్య చిగురించిన ప్రేమ మూడుముళ్ల బంధంగా మారింది. మేడిపల్లికి చెందిన అశోక్ పదేళ్ల కిందట జోర్దాన్ వెళ్లి అక్కడ ఓ కంపెనీలో స్టోర్ మేనేజర్ గా పనిచేస్తున్న సమయంలో శ్రీలంకకు చెందిన సమాన్వితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వీరి ప్రేమ వివాహానికి ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో కుటుంబ సభ్యులు, మిత్రుల సమక్షంలో హిందూ సంప్రదాయబద్ధంగా ఏకమయ్యారు.
Sorry, no posts matched your criteria.