India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిర్దేశిత వైద్య సేవలు ప్రజలకు సకాలంలో అందించాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో వైద్యశాఖ పనితీరుపై శనివారం ఆయన రివ్యూ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అధిక ప్రసవాలు జరిగే విధంగా వైద్య సిబ్బంది ప్రణాళికబద్ధంగా పనిచేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
@ కమాన్పూర్ మండలంలో షార్ట్ సర్క్యూట్ తో గుడిసె దగ్ధం. @ వేములవాడ రాజన్నను దర్శించుకున్న పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి. @ కరీంనగర్ పార్లమెంటు లో 20 మంది నామినేషన్ల తిరస్కరణ. @ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రోన్ కెమెరాల నిషేధం: పోలీస్ కమిషనర్. @ మే 1న కోరుట్ల బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి. @ కోరుట్లలో సీఎం సభ స్థలాన్ని పరిశీలించిన జగిత్యాల ఎస్పీ.
భార్య కాపురానికి రావడంలేదని భర్త సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన ముస్తాబాద్ మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని గూడురుకు చెందిన చెక్కపల్లి నర్సింహులు (45) తాగుడుకు బానిసయ్యాడు. దీంతో అతని భార్య పిల్లలతో ఆమె పుట్టింటికి వెళ్లింది. దీంతో తీవ్రమనస్తాపం చెందిన నర్సింహులు ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రుణమాఫీపై సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్న కాంగ్రెస్, BRSనేతల తీరుపై కరీంనగర్ MPబండి సంజయ్ విరుచుకుపడ్డారు. 6గ్యారంటీల అమలుపై చర్చ జరగకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇరుపార్టీల నేతలు డ్రామాలాడుతూ మీడియాలో బ్రేకింగ్‌ల కోసం యత్నిస్తున్నారని మండిపడ్డారు. 100రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని ఆరోపించారు.
వచ్చే 5 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వడగాలులు వీస్తాయని, ఉ. 11 నుంచి సా.4 వరకు బయటకు రావొద్దని సూచించింది. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిన్న పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటినట్లు తెలిపింది.
BRS ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘రెపరెపలాడే గులాబీ పతాకం.. తెలంగాణ ఎగరేసిన జయ కేతనం. మనమే తెలంగాణ దళం. మనమే తెలంగాణ గళం. జెండా మోసి.. జంగ్ చేసిన లక్షలాది కార్యకర్తలే బలం..బలగం. కంటికి రెప్పలా పార్టీని కాపాడుకున్న మీ పట్టుదలకు.. మీ శ్రమకు.. మీ కృషికి.. సదా సలాం..! BRS కుటుంబ సభ్యులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి జగిత్యాల జిల్లాకు రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల తరఫున నిర్వహించే బహిరంగ సభలలో పాల్గొంటారని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. కోరుట్లలో మే 1న ఉదయం 11 గంటలకు, ధర్మపురిలో మే 3న ఉదయం 11 గంటలకు బహిరంగ సభలు ఉంటాయని పేర్కొన్నారు.
కొడుకును ఓ తండ్రి హత్యచేశాడు. KNR జిల్లా కొత్తపల్లి PS పరిధిలో జరిగింది. చింతకుంట గ్రామానికి చెందిన శివ సాయి(21) HYDలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వారం రోజుల క్రితం ఇంట్లో శుభకార్యానికి వచ్చిన సాయిని కన్నతండ్రి శ్రీనివాస్(50) శుక్రవారం ఉదయం కళ్ళల్లో కారం చల్లి, రోకలి బండతో తలపై కొట్టి హత్యచేశాడు. అనంతరం నిందితుడు కొత్తపల్లి PSలో లొంగిపోయాడు. కేసు నమోదైంది. వివరాలు తెలియాల్సి ఉంది.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన 20 మంది నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. మొత్తం 53 మంది అభ్యర్థులు నామినేషన్లను సమర్పించినట్లు చెప్పారు. నామినేషన్ల పరిశీలన అనంతరం 33 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కాగా.. 20 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు వివరించారు.
లోకసభ ఎన్నికల పోలింగ్ సిబ్బంది రెండవ ర్యాండమైజేషన్ పూర్తిచేసినట్లు జగిత్యాల కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా శుక్రవారం తెలిపారు. కలెక్టరేట్‌లో ఎన్నికల వ్యయ పరిశీలకుల సమక్షంలో పోలింగ్ సిబ్బంది రెండవ ర్యాండమైజేషన్ నిర్వహించారు. జిల్లాపరిధిలోని 930 పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బందిని కేటాయించామన్నారు. సమావేశంలో ఎన్నికల పరిశీలకులు నింజే, అడిషనల్ కలెక్టర్లు దివాకర, రాంబాబు తదితరులున్నారు.
Sorry, no posts matched your criteria.