India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
@ మంథని మండలంలో పర్యటించిన మంత్రి శ్రీధర్ బాబు. @ మల్హర్ మండలంలో గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసుల దాడులు. @ బోయిన్పల్లి మండలంలో ఈతకు వెళ్లి బాలుడు మృతి. @ బిఆర్ఎస్ శవ రాజకీయాలు చేస్తుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్. @ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్న రామగుండం పోలీస్ కమిషనర్. @ మెట్పల్లి, ఇబ్రహీంపట్నం మండలాలలో ప్రచారం నిర్వహించిన బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి.
రోడ్డు ప్రమాదంలో మాజీ కార్యదర్శి మృతిచెందిన ఘటన ముస్తాబాద్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ పంచాయతీ కార్యదర్శి అబ్రవేణి సాయిలు బైక్‌పై వెళ్తుండగా కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎండాకాలం నేపథ్యంలో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. దీంతో జగిత్యాల జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ధర్మపురి మండలం నేరెళ్లలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకే 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో నేరెళ్ల రాష్ట్రంలోనే రెండోస్థానంలో నిలిచింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని కోరుతున్నారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలో చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడే వారిపై ఉక్కు పాదం మోపుతూ నేరాల నియంత్రణకై పటిష్టమైన చర్యలు చేపడతామని పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణా, పిడిఎస్ రైస్, ఇసుక అక్రమ రవాణా, నకిలీ విత్తనాల అక్రమ రవాణా, పేకాట, కోడి పందాలు ఆడేవారిపై, గుడుంబా తయారీపై నిఘా పెట్టామని పేర్కొన్నారు.
ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న కవలలు( అక్కా చెల్లెళ్లు) ప్రతిభ చూపారు. తిమ్మాపూర్ మండలం అల్గునూర్‌లోని తెలంగాణ గురుకుల కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నారు. ఎంపీసీ చదువుతున్న శార్వాణి 470 మార్కులకు 465 మార్కులు సాధించగా.. బైపీసీ చదువుతున్న ప్రజ్ఞాని 440 మార్కులకు 436 మార్కులు సాధించారు. దీంతో వీరిని కళాశాల ప్రిన్సిపల్ దేవేందర్ అభినందించారు.
నామపత్రాల పర్వం ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ గెలుపు కోసం ఓ వైపు ప్రచారం చేస్తూనే, మరోవైపు తమ ఓటు బ్యాంకు చీలకుండా వ్యూహాలు రచిస్తున్నారు. తమకు నష్టం కలిగించే స్వతంత్రులను పోటీ నుంచి తప్పించి తమకు అనుకూలంగా ప్రచారం చేయించుకోవాలనే ఆలోచనతో బుజ్జగింపుల పర్వానికి తెరతీశారు. ప్రత్యర్థి అభ్యర్థుల ఓటు బ్యాంకును గండికొట్టే స్వతంత్రులను ఏవిధంగానైనా పోటీలో ఉండేట్లు సంప్రదింపులు చేస్తున్నారు.
KNR MP స్థానానికి 53 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. APR 18 నుంచి 25 వరకు నిర్వహించిన నామినేషన్ల స్వీకరణలో భాగంగా 53 మంది అభ్యర్థులకుగాను 94 నామినేషన్ల పత్రాలు దాఖలు చేశారన్నారు. కాగా, పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి 63 మంది 109 నామినేషన్ పత్రాలు దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. అయితే KNR స్థానంలో ఒక్కరోజే 23మంది, PDPL స్థానంలో 22 మంది నామినేషన్లు వేశారు.
➤తంగళ్ళపల్లి: ఉరివేసుకొని చేనేత కార్మికుడి ఆత్మహత్య
➤భీమదేవరపల్లి: ట్రాక్టర్ ఢీకొని వృద్ధురాలి మృతి
➤ మెట్పల్లి: వెల్లుల్లలో తాళం వేసిన ఇంట్లో చోరీ
➤జిల్లాలో వ్యాప్తంగా ప్రపంచ మలేరియా దినోత్సవం వేడుకలు
➤మెట్పల్లిలో నెంబర్ ప్లేట్ లేని 32 వాహనాలు పట్టివేత
➤జగిత్యాలలో పోలీసుల విస్తృత తనిఖీలు
➤కోనరావుపేట మండలంలో పర్యటించిన కేటీఆర్
పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మళ్ళీ ఐపీఎల్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేందర్ రావు తరఫున మానకొండూరు మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఆశీర్వదించాలని బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని మోసం చేసిందని మండిపడ్డారు.
తంగళ్ళపల్లి మండలం ఇందిరా నగర్‌లో ఓ చేనేత కార్మికుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. అహంకారపు మల్లేశం (50) చేనేత కార్మికులుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండడంతో గురువారం ఇంద్రనగర్ శివారులో ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు.
Sorry, no posts matched your criteria.