India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెట్‌పల్లి మండలం బండలింగాపూర్ గ్రామానికి చెందిన కూకట్ల వేణుగోపాల్, స్రవంతిల కూతురు కూకట్ల వైష్ణవి ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీలో రాష్ట్రస్థాయి మార్కులు సాధించి సత్తా చాటింది. 440 మార్కులకు గానూ ఆమె 438 మార్కులు సాధించింది. అలాగే మెట్‌పల్లికి చెందిన ముక్క మృత్యుంజయ్, సంధ్యారాణిల కూతురు ముక్క హర్షిని ఇంటర్ ఎంపీసీలో 470 మార్కులకు గాను 465 మార్కులు సాధించి సత్తా చాటింది. వారిని పలువురు అభినందించారు.
సుల్తానాబాద్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 18న అల్పాహారం వికటించడంతో 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి అయిన విషయం తెలిసిందే. అయితే దీనిపై అభివృద్ధి అధికారి నివేదిక అందించిన ప్రకారం ప్రిన్సిపాల్ అలసత్వం ఉందని ప్రాథమికంగా భావించిన కలెక్టర్ ప్రిన్సిపాల్ ఎస్. సత్య ప్రసాద్ రాజ్‌ను సస్పెండ్ చేశారు.
కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్‌రావును ఆ పార్టీ ఎట్టకేలకు అధికారికంగా ప్రకటించింది. ఆయన తండ్రి జగపతిరావు కరీంనగర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. రాజేందర్ రావు గతంలో కరీంనగర్ వ్యవసాయ మార్కెట్‌కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. కొంతకాలం ప్రజారాజ్యం, బీఆర్ఎస్‌లో ఉన్నారు. 2009లో ప్రజారాజ్యం నుంచి కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేశారు. కాగా రాజేందర్ రావు ఇప్పటికే కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేశారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ రేపు ఉదయం 11.30 గంటలకు కరీంనగర్ ఎంపీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర రజనీకాంత్ భాయ్ పటేల్, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్‌లోని SRR కాలేజీ నుంచి గీతా భవన్ వరకు ర్యాలీ నిర్వహించేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధం అయ్యాయి.
KNR జిల్లా తిమ్మాపూర్ మండలంలో విషాదం నెలకొంది. ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు తండ్రి కొడుకులు మృతి చెందారు. స్థానికుల ప్రకారం.. వచ్చునూర్ శివారులోని లోయర్ మానేరు డ్యాంలో ఈతకు వెళ్లిన తండ్రి కొడుకులు నీటిలో మునిగి మృతి చెందారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడు గుండ్లపల్లిలోని ఎస్ ఆర్ కే ప్రైవేట్ స్కూల్ యజమాని చాడ రవీందర్ రెడ్డి ఆయన కొడుకుగా అనుమానిస్తున్నారు.
యువకుడిని తీవ్రంగా కొట్టి హత్య చేసి నిప్పు పెట్టిన ఘటనా మల్యాల మండలం రాజారాంలో చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం రాజారాం శివారులో సగం కాలిన యువకుడి మృతదేహం ఉన్నట్లు గ్రామస్థులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో భార్య జమున మృతదేహాన్ని గుర్తించి తన భర్త మహిపాల్‌దేనని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి అమాయక ప్రజల వద్ద డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడటంతో అతనిపై కేసు నమోదు చేశామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గ్రామానికి చెందిన దీకొండ సునీల్ అనే వ్యక్తి యూనిక్ ఎస్ఎంసిఎస్ అనే సంస్థ పేరుతో 800 మంది వద్ద డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడ్డాడు. బాధితులు ఎల్లారెడ్డిపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని తెలిపారు.
కొండగట్టు అంజన్న క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. చిన్న జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి కొండగట్టుకు దీక్షాపరులు, సాధారణ భక్తులు భారీగా చేరుకుంటున్నారు. మంగళవారం రాత్రి కొండపై ఇసుక వేస్తే రాలనంత రద్దీ నెలకొంది. రద్దీని కంట్రోల్ చేయడం కష్టమైంది. స్వామివారి దర్శనం, మాలవిరమణ, కళ్యాణకట్ట వద్ద గంటల సమయం పడుతోంది. ఇప్పటికి రెండు లక్షల వరకు భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అంచనా.
ఓదెల మండలంలోని ఓ గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని యువతిపై అదే గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు మంగళవారం అత్యాచారం చేసినట్లు సమాచారం. యువతి కుటుంబ సభ్యులు పనికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈమేరకు పోత్కపల్లి పోలీసులు వృద్ధుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం
నేడు వెలువడనున్న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షల ఫలితాల కోసం ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా సుమారు 68,400 మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరంలో 33,756 మంది, ద్వితీయ సంవత్సరంలో 34,660 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. కొందరు గైర్హాజరయ్యారు. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 127 కేంద్రాలలో పరీక్షలు జరిగాయి.
Sorry, no posts matched your criteria.