Karimnagar

News April 25, 2024

KNR: 30 నుంచి బీఫార్మసీ పరీక్షలు

image

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించే బీఫార్మసీ ఆరో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 30న, తృతీయ, నాలుగో సెమిస్టర్ పరీక్షలు మే 1 నుంచి ప్రారంభమవుతున్నట్లు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్ వి శ్రీరంగ ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల కాల పట్టికను యూనివర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

News April 25, 2024

జగిత్యాల జిల్లా స్పెషల్.. ముగ్గురు ఎంపీలు

image

జగిత్యాల జిల్లా మూడు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఉంది. మొత్తం 20 మండలాలు, 5 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాలు నిజామాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో, చొప్పదండి సెగ్మెంట్‌లోని మల్యాల, కొడిమ్యాల, వేములవాడ సెగ్మెంట్‌లోని కథలాపూర్, మేడిపల్లి మండలాలు కరీంనగర్ ఎంపీ పరిధిలోకి వస్తాయి. ఇక ధర్మపురి నియోజకవర్గం పెద్దపల్లి లోక్ సభ స్థానం పరిధిలో ఉంది.

News April 25, 2024

KNR: రూ.10 కాయిన్స్‌తో నామినేషన్ వేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి

image

కరీంనగర్ పార్లమెంటు స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు పేరాల మానస రెడ్డి డిపాజిట్ రూపంలో పది రూపాయల కాయిన్స్‌తో నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇంటి నుంచి గంపలో తీసుకొచ్చిన రూ.25 వేల నాణేలను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేసింది. తన అఫిడవిట్ సమర్పించిన అనంతరం జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతికి సమర్పించారు.

News April 25, 2024

KNR: మానసిక సమస్యల కోసం టోల్ ఫ్రీ నెంబర్

image

విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎవరైనా మానసిక ఆందోళనలు లేదా మానసిక ఒత్తిడికి గురి అయినప్పుడు మానసిక వైద్యుడిని సంప్రదించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత సూచించారు. చిరాకు పడడం, ఆసక్తిని కోల్పోవడం, నిద్రలేమి వంటి సమస్యలతో మానసిక ఒత్తిడికి గురి అయినట్లు భావిస్తే టెలి మానస్ టోల్ ఫ్రీ నెంబర్ 14416 ఫోన్ చేసి మానసిక వైద్యుడు సలహాలను సూచనలను ఉచితంగా పొందవచ్చునని తెలిపారు.

News April 25, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

*ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు.
*పెద్దపల్లి జిల్లాలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి.
*వేములవాడ, కొండగట్టు, ధర్మపురి ఆలయాలను సందర్శించిన ఎండోమెంట్ కమిషనర్.
*కొండగట్టులో ఘనంగా చిన్న హనుమాన్ జయంతి.
*జగిత్యాల రూరల్ మండలంలో యువకుడి దారుణ హత్య.
*కరీంనగర్ పార్లమెంటుకు నేడు 12 మంది అభ్యర్థుల నామినేషన్.
*కొండగట్టులో బస్సు ఎక్కుతూ జారి బస్సు కిందపడి ఒకరి మృతి.

News April 24, 2024

కరీంనగర్: 12 నామినేషన్లు దాఖలు

image

కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు మంగళవారం 12 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో ముగ్గురు రెండో సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తన ఛాంబర్‌లో అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించారు. హెల్ప్ డెస్క్ సిబ్బంది నామినేషన్ పత్రాలు నింపే అంశంలో అభ్యర్థులకు సహాయపడ్డారు. ఇందులో 10 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు.

News April 24, 2024

మహారాష్ట్ర కోర్టులో హాజరైన పెద్దపల్లి, కరీంనగర్ ఎమ్మెల్యేలు

image

బాబ్లీ ప్రాజెక్టు కేసులో విచారణ నిమిత్తం మంగళవారం మహారాష్ట్రలోని బలోలి సెషన్ కోర్ట్‌లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంటా విజయ రమణా రావు హాజరయ్యారు. అలాగే పెద్దపల్లి ఎమ్మెల్యేతో పాటు ఇదే కేసు విచారణకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే కె.ఎస్. రత్నం తదితరులు కోర్టులో హాజరయ్యారు.

News April 24, 2024

మోదీ వెన్నులో వ‌ణుకు పుడుతోంది: మంత్రి పొన్నం

image

మొదటి దశ ఓటింగ్ తర్వాత మోదీ వెన్నులో వణుకు పుడుతోంద‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. కరీంనగర్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఆస్తులు పంచుతుందని స్వయంగా ప్రధానమంత్రి అనడం విచారకరమ‌న్నారు. పాంచ్ న్యాయ్, కులగణన వంటివి బీజేపీకి రుచించడం లేదని, ప్రధాని స్థాయిలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించాల్సిన మోదీ నీచంగా మాట్లాడుతున్నార‌ని అన్నారు.

News April 24, 2024

కొండగట్టు: జయంతి సందర్భంగా అంజన్న అలంకరణ

image

జగిత్యాల జిల్లా మల్యాల మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన కొండగట్టు ఆంజనేయ స్వామి చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా.. మంగళవారం అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అరటి పండ్లు, తమలపాకు, కొబ్బరికాయలతో స్వామివారిని అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు.

News April 24, 2024

కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చి ఒకరు మృతి

image

కొండగట్టులో జరుగుతున్న హనుమాన్ చిన్న జయంతి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన లక్ష్మణ్(55) కుటుంబంతో కలిసి కొండగట్టు వచ్చారు. ఉచిత బస్సు ఎక్కబోతుండగా కిందపడిన లక్ష్మణ్ కాళ్లపై నుంచి బస్సు చక్రం వెళ్లడంతో అతని కాళ్లు నుజ్జు నుజ్జయ్యాయి. దీంతో వెంటనే లక్ష్మణ్‌ను 108లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

error: Content is protected !!