India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సింగరేణిలో 327 పోస్టులను భర్తీ చేసేందుకు యాజమాన్యం మార్చి 14న నోటిఫికేషన్‌ను జారీచేసింది. వీటికి సంబంధించి దరఖాస్తు గడువును జూన్ 4వ తేదీ వరకు పొడిగించింది. ముందుగా మే 4వ తేదీ వరకే ఆఖరి గడువుగా నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కొద్దిరోజుల పాటు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను నిలిపివేశారు. పోలింగ్ ముగియడంతో దరఖాస్తు గడువును పెంచినట్లు యాజమాన్యం పేర్కొంది.
చొప్పదండి మండలానికి చెందిన ఓ యువతిని అత్యాచారం చేసిన ఘటన సంచలనం సృష్టించింది. యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై మంగళవారం చొప్పదండికి చెందిన నలుగురిని అదుపులోకి తీసుకొని KNRకు తరలించారు. ముగ్గురు యువకులను అరెస్ట్ చేసి కరీంనగర్ జైలుకు.. మరో బాలుడిని వరంగల్ జువైనల్ హోంకు తరలించినట్లు బుధవారం తెలిసింది.
పెద్దపల్లిలో విజయం ఎవరిదనేది హాట్ టాపిక్‌గా మారింది. 2019లోనూ రసవత్తర పోరు సాగింది. చంద్రశేఖర్(కాంగ్రెస్)పై వెంకటేశ్ నేతగాని(BRS) 95,180 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. S.కుమార్ (BJP) 3వ స్థానంలో నిలిచారు. అయితే 2024లో గడ్డం వంశీకృష్ణ (కాంగ్రెస్), గోమాస శ్రీనివాస్ (BJP), కొప్పుల ఈశ్వర్ (BRS) నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశారు. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు మాదే మెజార్టీ అంటున్నారు. మీ కామెంట్?
స్వయం సంఘాల గ్రూపులకు చెందిన మహిళలు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా నూతన ఆలోచనలతో ముందుకు వెళ్లాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పిలుపునిచ్చారు. స్వయం సంఘాల గ్రూపులకు చెందిన మహిళలు యంత్రాలపై విస్తారాకులు , పేపర్ ప్లేట్స్, చట్నీలు, వక్కపొడి, స్వీట్స్, సమోసాలు తదితర సామాగ్రి తయారుచేసి విక్రయిస్తున్నారు. వీరందరితో కలెక్టరేట్లో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ గౌతమి తదితరులున్నారు.
@ ఓదెల మండలంలో ఈతకు వెళ్లి యువకుడి మృతి. @ కోరుట్ల మున్సిపల్ పరిధి ఎకిన్ పూర్ లో కూతురిపై అత్యాచారానికి పాల్పడిన తండ్రికి కఠిన కారాగార శిక్ష. @ మేడిపల్లి మండలంలో హత్యకు పాల్పడిన వ్యక్తికి జీవిత ఖైదు. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వర్ష సూచన. @ బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో కరీంనగర్ వాసి. @ వేములవాడలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన సిరిసిల్ల కలెక్టర్.
కోరుట్ల మున్సిపల్ పరిధిలోని ఏకిన్‌పూర్‌కు చెందిన ఎల్లాల తుకారం (40) తన కూతురుపై అత్యాచారానికి పాల్పడినందుకు 25 ఏళ్ల జైలుశిక్ష, పదివేల జరిమానాతో పాటు బాధితురాలికి 3 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని జగిత్యాల జడ్జి నీలిమ బుధవారం తీర్పునిచ్చారు. 2022 అక్టోబర్ 14న రాత్రి అత్యాచారానికి పాల్పడగా.. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయగా, సాక్షులను విచారించి న్యాయమూర్తి నేడు తీర్పు వెలువరించారు.
తెలంగాణకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే జూన్ 1న కేరళను ఋతుపవనాలు తాకనున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది. KNR జిల్లాలో రెండో విడత గొర్రెల పంపిణీకి ఇప్పటికే DDలు చెల్లించిన వారందరికీ తిరిగి డబ్బులు వాపసు ఇవ్వనున్నారు. రెండో విడతలో యూనిట్ ధర రూ.1.75 లక్షలుగా ఉండటంతో లబ్ధిదారుల వాటాగా రూ.43,750 చెల్లించారు. ఈ విడతలో 3,404 యూనిట్ల కోసం DDలు చెల్లించగా 718 మందికి పంపిణీ చేశారు. మిగిలిన 2,686 మందికి డీడీల సొమ్ము తిరిగి చెల్లించనున్నారు.
ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా 32,16,115 మంది ఓటర్లు ఉండగా.. 23,15,233 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మానకొండూరు నియోజకవర్గంలో 77.75% అత్యధికంగా ఓట్లు పోలవగా.. అత్యల్పంగా కరీంనగర్‌లో 60.51% పోలవడం గమనార్హం. మొత్తంగా 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో 8,34,164 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఓటు వినియోగంలో పట్టణ ఓటర్ల కన్నా గ్రామీణ ఓటర్లలోనే చైతన్యం ఎక్కువ ఉంది. మరి మీరు ఓటేశారా? కామెంట్.
కరీంనగర్‌లో విజయం ఎవరిదనేది హాట్ టాపిక్‌గా మారింది. 2019లోనూ రసవత్తర పోరు సాగింది. బీ వినోద్ కుమార్(BRS)పై బండి సంజయ్ (BJP) 89,08,768 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పొన్నం ప్రభాకర్(కాంగ్రెస్) 3వ స్థానంలో నిలిచారు. అయితే 2024లో రాజేందర్ రావు (కాంగ్రెస్), బండి సంజయ్(BJP), వినోద్ కుమార్ (BRS) నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశారు. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు మాదే మెజార్టీ అంటున్నారు. మీ కామెంట్?
Sorry, no posts matched your criteria.