Karimnagar

News April 22, 2024

కరీంనగర్: గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి

image

గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతిచెందిన ఘటన ఆదివారం జరిగింది. మృతుడి కుమారుడు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి నుంచి సిద్దిపేటకు వెళుతున్న ఖలీల్ కల్లూరు సమీపంలోని హోటల్ వద్ద భోజనానికి ఆపారు. భోజనం అనంతరం తిరిగి లారీ ఎక్కుతుండగా గుండెపోటు రావడంతో కుప్పకూలాడు. స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈయన RTC డ్రైవర్‌గా జగిత్యాల డిపోలో పనిచేసి 2014లో ఉద్యగ విరమణ చేశారు.

News April 22, 2024

పెద్దపల్లి: పురుగు మందు తాగి మహిళ సూసైడ్

image

పురుగు మందు తాగి మహిళ సూసైడ్ చేసుకుంది. SI వివరాల ప్రకారం.. పెద్దపల్లి మండలం సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామానికి చెందిన మల్లమ్మ అదే గ్రామానికి చెందిన సంపత్ దగ్గర రూ.1.30లక్షలు అప్పు తీసుకుంది. దీంతో అప్పు చెల్లించాలంటూ సంపత్ శనివారం గొడవకు దిగడంతో మనస్తాపం చెంది పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. కేసు నమోదైంది.

News April 22, 2024

కరీంనగర్ అభివృద్ధికి మీరేం చేశారో చెప్పండి: ఎంపీ అభ్యర్థి

image

కరీంనగర్ అభివృద్ధికి ప్రస్తుత ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిందేమీ లేదని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ ఆరోపించారు. బియినపల్లిలె ఆదివారం ఆయన మాట్లాడుతూ.. 2014-19లో ఆయన తాను ఎంపీగా ఉన్నప్పుడు కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ తెచ్చినట్లు పేర్కొన్నారు. వెయ్యి కోట్లతో స్మార్ట్ సిటీ తీసుకొచ్చానన్నారు. బండి సంజయ్ కులం, మతం పేరు చెప్పి రాజకీయ్ చేస్తున్నారని విమర్శించారు.

News April 22, 2024

కొండగట్టులో నేటి నుంచి హనుమాన్ జయంతి వేడుకలు

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో నేటి నుండి మూడు రోజులపాటు జరగనున్న హనుమాన్ జయంతి వేడుకల ఏర్పాట్లను ఆదివారం అడిషనల్ కలెక్టర్ దివాకర పరిశీలించారు. తాగునీటి వసతి ఏర్పాట్లు, కోనేరు, కళ్యాణకట్ట, ఆలయ పరిసరాలను తదితర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.

News April 21, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ మెట్ పల్లి పట్టణంలో కుక్కను కాపాడబోయి మహిళ మృతి. @ కోరుట్ల మండలంలో 18 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్. @ ఓదెల మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ కొండగట్టులో ఏర్పాట్లను పరిశీలించిన జగిత్యాల అడిషనల్ కలెక్టర్. @ హనుమాన్ జయంతికి ముస్తాబైన కొండగట్టు అంజన్న ఆలయం. @ మహదేవ్పూర్ మండలంలో గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు. @ అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన హుజురాబాద్ వాసి.

News April 21, 2024

బండి సంజయ్ బడి తేలేదు.. గుడి తేలేదు: వినోద్

image

బండి సంజయ్ ఐదేళ్లు MPగా ఉండి బడి తేలేదు.. గుడి తేలేదని BRS MP అభ్యర్థి వినోద్‌కుమార్ అన్నారు. ఆదివారం కొత్తపల్లిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్ MPగా బండి సంజయ్ చేసిన నియోజకవర్గ అభివృద్ధి మాట దేవుడెరుగు… ఆలయాల అభివృద్ధి కోసం రూ.5 కూడా తేలేదన్నారు. బండి సంజయ్ 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారైనా జిల్లా పరిషత్ సమావేశాలకు హాజరయ్యారా ..? అని ప్రశ్నించారు.

News April 21, 2024

హుజూరాబాద్: అమెరికాలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

image

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి చెందిన ముక్క నివేశ్ (20) అమెరికాలోని అరిజోనా రాష్ట్రం ఫీనిక్స్ ప్రాంతంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నట్లు మృతుడి తల్లిదండ్రులు నవీన్-జ్యోతి తెలిపారు. కళాశాలకు వెళ్లి వస్తుండగా కారు ప్రమాదంలో నివేశ్‌తో పాటు అతడి స్నేహితుడు గౌతమ్ కూడా మృతి చెందినట్లు తెలిపారు.

News April 21, 2024

పెద్దపల్లి: అభ్యర్థుల ఖర్చుల వివరాల నిర్ధారణ

image

ఎన్నికల్లో పోటచేసే అభ్యర్థుల రోజువారీ ఖర్చుల వివరాలను ఎన్నికల సంఘం నిర్ధారించింది. వీడియో చిత్రీకరణకు (నెలకు) 45000, ఫంక్షన్‌హాల్ (రోజుకు) 20000, రంగుల్లో పోస్టర్లు 5000, హోర్డింగ్స్ 6000, వ్యాన్ 7000, ఇన్నోవా 3500, త్రీ వీలర్ 1500, డ్రైవర్ సహా సుమో 3000, ప్రచారరథం 3000, ఎల్ఈడి స్క్రీన్ 5000, షామియానా 12000, బిగ్ సైజ్ బెలూన్స్ (రోజుకు) రూ. 20,000, పవర్ జనరేటర్ 7000 రూపాయలుగా నిర్ధారించింది.

News April 21, 2024

కొప్పుల ఈశ్వర్ దొంగ ప్రేమలు చూపిస్తున్నారు: ఎమ్మెల్యే అడ్లూరి

image

గతంలో మంత్రిగా ప్రభుత్వ విప్‌గా ఉన్నప్పుడు రైతులను పట్టించుకోని కొప్పుల ఈశ్వర్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా దొంగ దీక్ష, దొంగ ప్రేమలు చూపిస్తున్నారని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా పెగడపల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నాయకులతో సమావేశమై మీడియాతో మాట్లాడారు. రేపటి ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

News April 21, 2024

కరీంనగర్‌లో KCR రోడ్ షో షెడ్యూల్

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ ఈనెల 24 నుంచి రోడ్ షోలలో పాల్గొననున్నారు. 9వ రోజు మే 2న 6 సాయంత్రం జమ్మికుంటలో రోడ్ షో, వీణవంకలో రాత్రి బస, 3వ తేదీన 6 సాయంత్రం రామగుండంలో రోడ్ షో, రాత్రి బస, 5న 6 సాయంత్రం జగిత్యాలలో రోడ్ షో, బస, 9వ తేదీన 6 సాయంత్రం కరీంనగర్లో రోడ్ షో, రాత్రి బస, 10వ తేదీన 5 సాయంత్రం సిరిసిల్లలో రోడ్ షోలలో పాల్గొంటారని BRS పార్టీ వర్గాలు తెలిపాయి.

error: Content is protected !!