India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో సోమవారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగించుకొని పోలింగ్ సిబ్బంది తిరుగు ప్రయాణమయ్యారు. ఈవీఎం వీవీ ప్యాట్లను రిసెప్షన్ సెంటర్లలో అప్పగించి అనంతరం వారి స్వగ్రామాలకు బయలుదేరి వెళుతున్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాలలో ఆలస్యం అవుతుండడంతో వారు ఇంకా రిసెప్షన్ కేంద్రాలకు చేరుకోలేదు. పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో పోలింగ్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు క్రమ సంఖ్య 4వ నంబర్ కలిగిన టీ షర్టును ధరించి కాంగ్రెస్‌కు ఓటేయాలంటూ పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేస్తున్నారని ఎన్నికల సంఘానికి బీజేపీ కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్ బోయిన్‌పల్లి ప్రవీణ్ రావు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి రాజేందర్ రావుపై ఎన్నికల సంఘం అధికారులు కేసు నమోదు చేశారు.
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన తోకల గంగాధర్ తల్లి మల్లు అనారోగ్యంతో మృతి చెందారు. పుట్టెడు దుఃఖంలో ఉన్నా ఓటు హక్కును గంగాధర్‌తో పాటు ఆయన భార్య ప్రవళిక వినియోగించుకున్నారు. ఓటు వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గంగాధర్ అన్నారు.
మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు తనయుడు కొమిరెడ్డి కపిల్ పార్లమెంట్ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి లండన్ నుంచి సోమవారం మెట్‌పల్లికి వచ్చారు. పట్టణంలోని పోలింగ్ కేంద్రానికి కుటుంబ సమేతంగా వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అర్హులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు 5 గంటల వరకు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి-73.53%, చెన్నూర్- 68.00%, ధర్మపురి-69.83%, మంచిర్యాల-59.78%, మంథని-61.55%, పెద్దపల్లి- 64.80%, రామగుండం-55.18 శాతంగా ఉన్నాయి. మొత్తం పోలింగ్ 63.86% నమోదైంది. కాగా కరీంనగర్‌లో పోలింగ్ 55.92% నమోదైంది. ఇప్పటికే బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల, మంథనిలో పోలింగ్ పూర్తి అయింది.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు సాయంత్రం 5 గంటల వరకు ఇలా ఉన్నాయి. చొప్పదండి- 70.13%, హుస్నాబాద్- 73.63%, హుజూరాబాద్-68.67%, కరీంనగర్-55.82%, మానకొండూర్-71.11%, సిరిసిల్ల-69.58%, వేములవాడ-71.26 శాతంగా ఉన్నాయి. మొత్తం పోలింగ్ 67.67% నమోదైంది.
కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. కాగా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రధాన పార్టీలకు చెందిన నాయకుల మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు జరగగా పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. మరో గంటలో పోలింగ్ ముగియనున్న నేపథ్యంలో ఓటర్లు త్వరగా ఓటేసేందుకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఓటు వేయనట్లయితే త్వరగా వెళ్లండి. – SHARE IT
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు 3 గంటల వరకు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి-63.00%, చెన్నూర్-58.65%, ధర్మపురి-60.23%, మంచిర్యాల-52.97%, మంథని-56.20%, పెద్దపల్లి-55.60%, రామగుండం-47.10 శాతంగా ఉన్నాయి. మొత్తం పోలింగ్ 55.92% నమోదైంది.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు 3 గంటల వరకు ఇలా ఉన్నాయి. చొప్పదండి- 61.58%, హుస్నాబాద్- 63.98%, హుజూరాబాద్-60.15%, కరీంనగర్-47.45%, మానకొండూర్-62.55%, సిరిసిల్ల-55.67%, వేములవాడ-62.45శాతంగా ఉన్నాయి. మొత్తం పోలింగ్ 58.24% నమోదైంది.
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి-50.42%, చెన్నూర్-45.45, ధర్మపురి-47.15%, మంచిర్యాల-41.40%, మంథని-48.21%, పెద్దపల్లి-44.40%, రామగుండం-38.78 శాతంగా ఉన్నాయి. మొత్తం పోలింగ్ 44.40% నమోదైంది. కాగా కరీంనగర్‌లో పోలింగ్ 45.11% నమోదైంది.
Sorry, no posts matched your criteria.