India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
*ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు.
*పెద్దపల్లి జిల్లాలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి.
*వేములవాడ, కొండగట్టు, ధర్మపురి ఆలయాలను సందర్శించిన ఎండోమెంట్ కమిషనర్.
*కొండగట్టులో ఘనంగా చిన్న హనుమాన్ జయంతి.
*జగిత్యాల రూరల్ మండలంలో యువకుడి దారుణ హత్య.
*కరీంనగర్ పార్లమెంటుకు నేడు 12 మంది అభ్యర్థుల నామినేషన్.
*కొండగట్టులో బస్సు ఎక్కుతూ జారి బస్సు కిందపడి ఒకరి మృతి.
కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు మంగళవారం 12 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో ముగ్గురు రెండో సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తన ఛాంబర్‌లో అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించారు. హెల్ప్ డెస్క్ సిబ్బంది నామినేషన్ పత్రాలు నింపే అంశంలో అభ్యర్థులకు సహాయపడ్డారు. ఇందులో 10 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు.
బాబ్లీ ప్రాజెక్టు కేసులో విచారణ నిమిత్తం మంగళవారం మహారాష్ట్రలోని బలోలి సెషన్ కోర్ట్‌లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంటా విజయ రమణా రావు హాజరయ్యారు. అలాగే పెద్దపల్లి ఎమ్మెల్యేతో పాటు ఇదే కేసు విచారణకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే కె.ఎస్. రత్నం తదితరులు కోర్టులో హాజరయ్యారు.
మొదటి దశ ఓటింగ్ తర్వాత మోదీ వెన్నులో వణుకు పుడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఆస్తులు పంచుతుందని స్వయంగా ప్రధానమంత్రి అనడం విచారకరమన్నారు. పాంచ్ న్యాయ్, కులగణన వంటివి బీజేపీకి రుచించడం లేదని, ప్రధాని స్థాయిలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించాల్సిన మోదీ నీచంగా మాట్లాడుతున్నారని అన్నారు.
జగిత్యాల జిల్లా మల్యాల మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన కొండగట్టు ఆంజనేయ స్వామి చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా.. మంగళవారం అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అరటి పండ్లు, తమలపాకు, కొబ్బరికాయలతో స్వామివారిని అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు.
కొండగట్టులో జరుగుతున్న హనుమాన్ చిన్న జయంతి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన లక్ష్మణ్(55) కుటుంబంతో కలిసి కొండగట్టు వచ్చారు. ఉచిత బస్సు ఎక్కబోతుండగా కిందపడిన లక్ష్మణ్ కాళ్లపై నుంచి బస్సు చక్రం వెళ్లడంతో అతని కాళ్లు నుజ్జు నుజ్జయ్యాయి. దీంతో వెంటనే లక్ష్మణ్‌ను 108లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
జగిత్యాల్ రూరల్ మండలంలోని ధరూర్, అంతర్గామ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ గట్టు వద్ద మంగళవారం గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతదేహం సగం కాలినట్లు ఉందని, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో సోమవారం నుంచి హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేడు జయంతి కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి దీక్షాపరులు తరలివస్తున్నారు. అంజన్నకు ముడుపు కట్టి దర్శించుకుంటున్నారు. దీంతో ఆలయ అధికారులు, పోలీసు సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. కొండగట్టు స్టేజి నుంచి దొంగలమర్రి, జేఎఎన్టీయూ మీదుగా కొండపైకి ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించారు.
రోడ్డు ప్రమాదంలో జగిత్యాల జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతిచెందాడు. బాధితుల ప్రకారం.. కోరుట్ల మున్సిపల్ పరిధిలోని ఏఖీన్‌పూర్‌కు చెందిన మనీశ్(25) HYDలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. 6 రోజుల క్రితం కంపెనీ ప్రాజెక్టు పనిమీద పుదుచ్చేరి వెళ్లొస్తుండగా.. మార్గమధ్యలో డిండివనం వద్ద ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో మనీశ్‌తో పాటు HYDకి చెందిన మరో మహిళా ఉద్యోగి మృతి చెందింది.
కాంగ్రెస్ పాలనలో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని పెద్దపల్లి పార్లమెంట్ BRSపార్టీ MPఅభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఎలిగేడు మండల, నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పంటలు ఎండిపోతుంటే పాలకులు మాత్రం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలలో ప్రశ్నించే గొంతుకు పట్టం కట్టాలని అన్నారు.
Sorry, no posts matched your criteria.