India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సారంగాపూర్ పీఎస్‌లో ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు కానిస్టేబుల్స్ సస్పెండ్ అయ్యారు. గతేడాది ఫిబ్రవరిలో 70 కిలోల గంజాయిని పట్టుకొని పీఎస్ వెనుక ఉంచినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ నెల 1న దుండగులు ఆ గంజాయిని ఎత్తుకెళ్లారు. వారి నిర్లక్ష్యంపై ఆగ్రహించిన ఉన్నతాధికారులు.. ఈ కేసులో ఎస్సైలు జి.మనోహర్‌రావు, ఎ.తిరుపతితో పాటు.. హెడ్ కానిస్టేబుల్ బి.రవీందర్ రెడ్డి, కానిస్టేబుల్ టి.నరేందర్‌ను సస్పెండ్ చేశారు.
కరీంనగర్ జిల్లాలో వింత జరిగింది. ఓ మామిడి చెట్టుకు ఒకే కొమ్మకు దాదాపు 22 కాయలు కాసింది. ఈ ఘటన KNR జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవి పల్లెకి చెందిన కర్ర జగన్మోహన్ రెడ్డి మామిడి తోటలో జరిగింది. రైతు మాట్లాడుతూ.. గతేడాది ఈదురు గాలులకు కొమ్మలు విరిగిపోవడంతో చెట్టు ఎండిపోయే దశకు చేరిందని అన్నారు. ఇక ఈ చెట్టు కాత కాయదనుకున్నా కానీ, ఒకే చోట సుమారు 50 కాయల వరకు కాసిందని అన్నారు.
సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంతో పాటు గాలిపెళ్లి, తాళ్లపల్లి, అనంతగిరి గ్రామాలలో కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ సతీమణి మాధవి గురువారం ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. గత ఐదేళ్లలో బండి సంజయ్ ఎంపీగా ఉండి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో వినోద్ కుమార్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఈరోజు నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల MP అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. రేపు (శుక్రవారం) ముగ్గురు అభ్యర్థులు మొదటి సెట్టు నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్-వంశీకృష్ణ, BRS-కొప్పుల ఈశ్వర్, BJP-గోమాస శ్రీనివాస్ సిద్ధమయ్యారు. తర్వాత మరో మారు అట్టహాసంగా నామినేషన్ వేయనున్నారు.
లోక్ సభ ఎన్నికల బరిలో పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌లకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. జీవన్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎమ్మెల్సీగా గెలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో 3సార్లు మంత్రిగా పనిచేశారు. ఇక ఈశ్వర్ 6 సార్లు (మేడారం నుంచి రెండు, ధర్మపురి నుంచి నాలుగు సార్లు) గెలిచి చీఫ్ విప్‌గా, మంత్రిగా పనిచేశారు. మరి ఇంత అనుభవం ఉన్న వీరివురూ ఈసారి ఎన్నికల్లో సత్తా చాటుతారా..? కామెంట్ చేయండి.
ప్రసవానికి వెళ్ళిన బాలింత డెలివరీ అనంతరం మృతిచెందిన ఘటన కరీంనగర్‌లో జరిగింది. తీగలగుట్ట పల్లికి చెందిన వర్షినికి పురిటి నొప్పులు రావడంతో వారం రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. బాబుకు జన్మనిచ్చిన అనంతరం ఆపరేషన్ వికటించి
ఆమె మృతి చెందిందని బంధువులు తెలిపారు. దీంతో ఆస్పత్రి వద్ద పెద్దఎత్తున బంధువులు ఆందోళన చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యమే మృతికి కారణమని ఆరోపించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో సినీ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్‌లు సందడి చేశారు. తన బంధువుల వివాహ కార్యక్రమానికి హాజరైన హాజరయ్యారు. వారిని చూసేందుకు గ్రామస్థులు ఉత్సాహాన్ని కనబరిచారు. వారితో సెల్ఫీలు దిగేందుకు ఎగబడటంతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది.
పకడ్బందీగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. ఎంపీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ, తుది ఓటర్ జాబితా రూపకల్పనపై జిల్లా ఎన్నికల అధికారులతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెండింగ్ ఓటర్ నమోదు దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. సమావేశంలో సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్ కిమ్యా నాయక్, ఆర్డిఓలు రమేష్, రాజేశ్వర్ పాల్గొన్నారు.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా శ్రీరామనవమి వేడుకలు. @ శ్రీరామనవమి వేడుకలలో ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్. @ సైదాపూర్ మండలంలో అక్రమంగా రవాణా చేస్తున్న 3 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత. @ రాయికల్ మండలంలో తమ్మునిపై దాడి చేసిన అన్నపై హత్యాయత్నం కేసు. @ కథలాపూర్ మండలంలో చోరీకి పాల్పడిన నలుగురికి రిమాండ్. @ సివిల్స్ లో సత్తా చాటిన రామడుగు మండల యువకుడికి సన్మానం.
రామగుండం ఎన్టీపీసీ పరిధి జంగాలపల్లి గ్రామానికి చెందిన మేకల రవికుమార్ తన యువకుడు వడదెబ్బతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పశువులను మేపేందుకు బయటకు వెళ్లిన రవికుమార్ వడదెబ్బకు గురయ్యాడని తెలిపారు. కాగా ఈ సంఘటనపై మృతుని తండ్రి లింగయ్య ఎన్టీపీసీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Sorry, no posts matched your criteria.