India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశించిన వెంకటేష్ నేతకు కాంగ్రెస్‌లోనూ మొండిచేయి చూపడంతో ఇప్పుడు బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ పేరును ప్రకటించిన బీజేపీ.. వెంకటేష్ నేత చేరితే టికెట్ మార్చే అవకాశం ఉందని టాక్.
కరీంనగర్‌కు చెందిన కొలనుపాక సహన సివిల్స్ ఫలితాల్లో 739వ ర్యాంకు సాధించారు. గతంలో కరీంనగర్ కలెక్టర్‌గా విధులు నిర్వహించిన స్మితా సబర్వాల్ తనకు ఆదర్శమన్నారు. ఏ క్యాడర్ వచ్చినా IAS కావడమే లక్ష్యమని పేర్కొన్నారు. తన రోల్ మోడల్ స్మితా సబర్వాల్ అని సహన పేర్కొనగా.. ట్విట్టర్‌లో స్మిత స్పందించారు. ‘ప్రియమైన సహన.. మీ ఎంపికకు శుభాకాంక్షలు. So proud of you’ అంటూ అభినందనలు తెలిపారు.
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో బస్సు కిందపడి <<13062336>>చిన్నారి మృతి చెందిన<<>> విషయం విదితమే.మద్దుట్లకు చెందిన రజాక్-హసీనా దంపతులకు కొడుకు, కుమార్తె ఉన్నారు. మంగళవారం ఉదయం కొడుకు సాజిల్‌ను పాఠశాల బస్సు ఎక్కించేందుకు తల్లి హసీనా వెళ్లగా.. ఆమె వెనుకే 18 నెలల కూతురు అరిబా బస్సు ముందుకు వెళ్లింది. డ్రైవర్ గమనించక వాహనాన్ని ముందుకు కదిలించడంతో చిన్నారి తలపై నుంచి వెనుక చక్రం వెళ్లింది. దీంతో చిన్నారి చనిపోయింది.
ఈ నెల 6న నిజామాబాద్ నుంచి నర్సంపేటకు వస్తున్న బస్సులో జగిత్యాల జిల్లా మెట్‌పల్లి వద్ద ఇద్దరు వ్యక్తులు ఓ వ్యక్తి(46)ని ఎక్కించారు. అతడి ఆరోగ్యం బాగాలేదని, వరంగల్ వెళ్లాక లేపితే.. అక్కడి నుంచి రైలులో ఆంధ్రా ప్రాంతానికి వెళతారని కండక్టర్ రాజ్‌కుమార్‌కు చెప్పి వారు బస్సు దిగిపోయారు. వరంగల్ చేరుకున్నాక కండక్టర్ లేపడానికి ప్రయత్నించగా..అప్పటికే మృతి చెందారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రామడుగు మండలం వెలిచాలకు చెందిన సాయికిరణ్ సివిల్స్ ఫలితాల్లో 27వ ర్యాంకు సాధించిన విషయం విదితమే. నిరుపేద కుటుంబానికి చెందిన సాయికిరణ్ బాల్యం నుంచే చదువులో చురుగ్గా రాణిస్తున్నారు. వరంగల్ NITలో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తూ పరీక్షలకు హాజరై ఉత్తమ ర్యాంకు సాధించారు. ఆయన తండ్రి కాంతయ్య బాంబే, భీవండిలో పవర్ లూమ్ కార్మికుడిగా పని చేసి మృతిచెందారు. తల్లి ఇప్పటికీ గ్రామంలో బీడీలు చూడుతున్నారు.
కొండగట్టు అంజన్న ఆలయంలో ఈ నెల 22 నుంచి జరిగే చిన్న జయంతి ఉత్సవాల్లో భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని అదనపు కలెక్టర్ దివాకర అధికారులను ఆదేశించారు. మంగళవారం కొండగట్టులో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్సవాలలో అధికారులు సమన్వయంతో పని చేయాలని, ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కల్గనివ్వొద్దన్నారు. ఆర్డీఓ మధుసూదన్, డీఎస్పీ రఘుచందర్‌తో పాటు ఆయా శాఖల అధికారులు ఉన్నారు.
@ సివిల్స్ లో సత్తా చాటిన కరీంనగర్ జిల్లా యువతి, యువకుడు. @ వేములవాడ రాజన్న చెరువు అభివృద్ధి పనులను పూర్తి చేయాలన్న కలెక్టర్. @ జగిత్యాల మండలంలో వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా. @ మల్లాపూర్ మండలంలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య. @ మల్లాపూర్ మండలంలో 98 వేల నగదు పట్టివేత. @ గోదావరిఖనిలో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురి అరెస్ట్.@ కొండగట్టులో ఈత తాటి చెట్లు దగ్ధం
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఉరేసుకొని మామిడి నర్సయ్య(34) మృతి చెందినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. నర్సయ్య కొంతకాలంగా మద్యానికి బానిస అయ్యారని చెప్పారు. అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం ఉరేసుకొని మృతి చెందినట్లు పేర్కొన్నారు. నర్సయ్య భార్య వనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
సివిల్స్ ఫలితాల్లో కరీంనగర్ యువతి ప్రతిభ కనబరిచారు. పట్టణానికి చెందిన కొలనుపాక సహన 739వ ర్యాంకు సాధించి సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. కరీంనగర్ టౌన్‌లో ఇంటర్ వరకు చదివిన సహన.. హైదరాబాద్ జేఎన్‌టీయూలో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీలోని ఓ ఐఏఎస్ అకాడమీలో కోచింగ్ తీసుకుని తాజా ఫలితాల్లో ర్యాంకు సాధించారు. సహన తండ్రి అనిల్ కరీంనగర్ టౌన్‌లో ఓ పత్రిక రిపోర్టర్‌గా పని చేస్తున్నారు.
నేడు ప్రకటించిన యూపీఎస్సీ ఫలితాల్లో కరీంనగర్ జిల్లాకు చెందిన నందల సాయి కిరణ్ సత్తాచాటారు. చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన సాయి కిరణ్ 27వ ర్యాంకు సాధించారు. ఈయన ఐఏఎస్‌కు ఎంపికయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా గ్రామస్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆయన్ను అభినందించారు.
Sorry, no posts matched your criteria.