India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన ముత్తారం మండలంలో చోటుచేసుకుంది. స్థానికలు తెలిపిన వివరాలు.. ఓడేడుకు చెందిన మొగిలి రమేష్ (45) ప్రతి రోజు లాగానే తన పంట పొలం వద్దకు మోటారు వేయడానికి ఉదయం వెళ్లి మధ్యాహ్నం వరకు ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా మానేరులో కింద పడి ఉండటం చూసి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్టు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపారు.
గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామంలో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన సుంకోజు నరేష్ (29) అనే స్వర్ణకారుడు మంగళవారం ఉదయం ఛాతిలో నొప్పి అంటూ ఒక్కసారిగా కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడిని చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు.
<<13057630>>మహాదేవపూర్ <<>>PSలో సోమవారం జరిగిన ఘటనపై పోలీస్ శాఖ తీవ్రచర్యలు చేపట్టింది. ఆ ఘటనపై మల్టీ జోన్-1 ఐజీ రంగనాథ్ ఆదేశాల మేరకు జిల్లా SP కిరణ్ ఖరే.. SI ప్రసాద్‌ను VRకు బదిలీ చేశారు. హెడ్ కానిస్టేబుల్ సోయం శ్రీనివాస్‌ను సస్పెండ్ చేశారు. అదేవిధంగా స్టేషన్ పరిధిలోని ఓ హెడ్ కానిస్టేబుల్‌తో పాటు మరో ఆరుగురి సిబ్బందిపై బదిలి వేటు వేశారు. దీంతో పోలీసు అధికారులు, సిబ్బందిలో అలజడి మొదలైంది.
స్కూల్ బస్సు కిందపడి ఏడాదిన్నర చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం మద్దుట్లలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. అన్నను బస్సు ఎక్కించేందుకు వెళ్లిన చిన్నారి అలీఫా ప్రమాదవశాత్తు బస్సు కిందపడి ప్రాణాలు కోల్పోయింది. దీంతో చిన్నారి కుటుంబంలో విషాదం అలుముకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సుల్తానాబాద్ మండలం చిన్నకల్వలలో ఓ వ్యక్తి కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై శ్రావణ్ కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గంట్ల తిరుపతి (40) PDPLలో ఓ హోటల్లో టిఫిన్ మాస్టారుగా పనిచేస్తున్నారు. కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం తన భార్యతో గొడవ జరగగా ఇంట్లో ఉరి వేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య రజిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
KNR కాంగ్రెస్ MP అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు పేరు దాదాపు ఖరారైనట్లు తెలిసింది. MP టికెట్‌పై ఢిల్లీ అధిష్ఠానం ఇంకా నిర్ణయం తీసుకోనప్పటికీ.. మొదటి నుంచి ఆశావహుల జాబితాలో మాజీ MLA అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, వెలిచాల ఉన్నారు. వీరిద్దరూ నువ్వానేనా అన్నట్లు టికెట్ కోసం పోటీపడుతున్నారు. అన్ని అంశాలను పరిశీలించిన అధిష్ఠానం వెలిచాల వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. దీనిపై క్లారిటీ రావల్సి ఉంది.
భద్రాచలంలో ఈ నెల 17న శ్రీరామ నవమి సందర్బంగా జరిగే శ్రీ సీతారామచంద్రుల వారి కల్యాణ తలంబ్రాలను ఆన్లైన్‌లో బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని ఆర్టీసీ కల్పించింది. సంస్థ లాజిస్టిక్స్ విభాగ వైబ్ సైట్ tsrtclogistics.in సందర్శించి విశిష్టమైన రాములోరి కల్యాణ తలంబ్రాలను పొందండి. ఆఫ్లైన్‌లో తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లపై 040-23450033ను సంప్రదించాలన్నారు.
రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఈరోజు హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTRను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఈనెల 19న పెద్దపల్లి పార్లమెంట్ MPఅభ్యర్థి కొప్పుల ఈశ్వర్ నామినేషన్ కోసం ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ మేరకు KTR పెద్దపల్లికి వస్తున్నట్లు ప్రకటించారు.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో అమానుష ఘటన వెలుగుచూసింది. గోపాలపురం చెరువులో సోమవారం పసికందు మృతదేహం కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మగశిశువు మృతదేహం చెరువులో తేలియాడుతూ కనిపించిందన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ పారేసి ఉంటారని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు శిశువు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.
ఈనెల 25నుంచి మే 2వరకు జరుగనున్న ఓపెన్ స్కూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సోమవారం సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు సజావుగా సాగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పరీక్ష కేంద్రాల్లోకి ఫోన్లు అనుమతించొద్దన్నారు.
Sorry, no posts matched your criteria.