Karimnagar

News April 15, 2024

ఎంపీ సీట్ల కేటాయింపులో మాదిగలకు అన్యాయం: మందకృష్ణ

image

రాష్ట్రంలో పార్లమెంటు సీట్ల కేటాయింపులో మాదిగలకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. ఆదివారం ఆయన సిరిసిల్లలో జరిగిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి తన కుర్చీని కాపాడుకునేందుకు మాలల మాట వింటూ, మాదిగలకు అన్యాయం చేస్తున్నాడని మండిపడ్డారు.

News April 15, 2024

కాంగ్రెస్ నేతల దీక్షలు ఎన్నికల స్టంట్: బండి సంజయ్

image

మోదీ పాలనపై నిరసన పేరుతో కాంగ్రెస్ నేతలు చేస్తున్న దీక్షలు ఎన్నికల స్టంట్ అని ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మళ్లీ కేంద్రంలో మోదీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ నేతలు తమ పదవులకు రాజీనామాలు చేసి తప్పుకుంటారా? అని ప్రశ్నించారు. ఎన్నడూ లేనంతగా కాంగ్రెస్ నేతలు అంబేడ్కర్‌పై ప్రేమను ఒలకబోస్తున్నారని విమర్శించారు.

News April 15, 2024

WOW.. కరీంనగర్: సీతమ్మకు త్రీడీ చీర

image

భద్రాచలంలోని సీతమ్మవారికి రంగులు మారే త్రీడీ చీరను రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ రూపొందించారు. ఐదున్నర మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు ఉన్న ఈ చీర బరువు 600 గ్రాములు. 18 రోజులు శ్రమించి బంగారు, వెండి, ఎరుపు వర్ణాలతో తయారు చేసినట్లు విజయ్ తెలిపారు. ఈ చీరను మంగళవారం భద్రాచలం సీతమ్మకు కానుకగా అందించనున్నట్లు వెల్లడించారు.

News April 15, 2024

రామగుండం: రైలు కిందపడి ఆటో డ్రైవర్ ఆత్మహత్య

image

రైలు కిందపడి ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన రామగుండంలో చోటుచేసుకుంది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ జీ.తిరుపతి వివరాల ప్రకారం.. పట్టణంలోని భీమయ్య కాలనీకి చెందిన దండుగుల అంజి(29) ఆదివారం స్థానిక విద్యుత్ నగర్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల కుటుంబంలో జరిగిన పరిణామాలతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. మృతుడి భార్యలావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

News April 15, 2024

KNR: నిబంధనలు అతిక్రమించిన టీచర్ సస్పెండ్

image

నిబంధనలకు విరుద్ధంగా టెన్త్ మూల్యాంకన కేంద్రంలో ఫోన్ ఉపయోగించినందుకు ఓ టీచర్ సస్పెండ్ అయ్యాడు. ఈ ఘటన KNR జిల్లాలో చోటుచేసుకుంది. ఈమేరకు మానకొండూర్ మండలం పచ్చునూర్ జడ్పీ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్, TPF జిల్లా అధ్యక్షుడు పి.దామోదరరెడ్డిని DEO జనార్దనరావు సస్పెండ్ చేశారు. సస్పెండ్ ఉత్తర్వులను శనివారం రాత్రి ప్రధానోపాధ్యాయుడికి పంపినట్లు మూల్యాంకన కేంద్రం జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు.

News April 14, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో TOP NEWS

image

➤ జిల్లా వ్యాప్తంగా ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
➤కోనరావుపేట: ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య
➤ఓదెల: పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య
➤జగిత్యాలలో వైభవంగా పడిపూజ
➤మెట్పల్లి పట్టణంలో కిలోన్నర బంగారం, ఏడు లక్షల నగదు సీజ్
➤భీమారం మండలంలో రైస్ మిల్లులో అగ్ని ప్రమాదం
➤సిరికొండలో వైభవంగా జింక మల్లన్న జాతర

News April 14, 2024

KNR: పెళ్లి కావడం లేదని యువతి ఆత్మహత్య

image

పెళ్లి కావడం లేదని మనోవేదనకు గురై యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఓదెల మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని కొలనూరు గ్రామానికి చెందిన కొంగర స్వప్న(29) పెళ్లి సంబంధాలు కుదరడం లేదని ఈనెల 12న పురుగుల మందు తాగింది. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. తన తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 14, 2024

కరీంనగర్: రేపు గడువు చివరి తేదీ

image

ఈ నెల 18న లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా.. మే 13న పోలింగ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో చాలా మంది ఓటరుగా పేరు నమోదు చేసుకోలేదు. 2006 మార్చి 31లోపు పుట్టిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఈ నెల 15 వరకు సమయం ఉంది. ఫారం-6 నింపి, ధ్రువీకరణ పత్రాల నకలు, పాస్ ఫొటోలు జతపర్చి స్థానిక BLOకు అందజేయండి. లేదంటే స్థానిక మీసేవ సెంటర్లో అప్లై చేసుకోవచ్చు. అంతేకాదు మార్పులు చేసుకోవచ్చు.

News April 14, 2024

సిరిసిల్ల: తాటి చెట్టుపై నుంచి పడి ఒకరి మృతి

image

తాటి చెట్టుపై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సిరిసిల్ల జిల్లాలో జరిగింది.  గ్రామస్థుల వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బీమారి దేవయ్య ముంజలు కోయడానికి ఆదివారం ఉదయం తాటి చెట్టు ఎక్కాడు.  ప్రమాదవశాత్తు జారి కింద పడడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 14, 2024

నేడు కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన!

image

కరీంనగర్ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిపై నేడు స్పష్టత రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ స్థానానికి తీవ్ర పోటీ నెలకొనడంతో అభ్యర్థి ఎంపిక ఆలస్యమైంది. ఇప్పటికే ఇక్కడ BRS అభ్యర్థిగా మాజీ ఎంపీ వినోద్ కుమార్‌ను ప్రకటించగా.. BJP అభ్యర్థిగా ఎంపీ బండి సంజయ్ మరోసారి బరిలో ఉన్నారు. ఓ వైపు వారు ప్రచారం చేసుకుంటుండగా.. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరని ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. దీనిపై మీ కామెంట్.

error: Content is protected !!