India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకర్‌పై మంథని పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ నెల 6న అంబేడ్కర్ కూడలిలో అనుమతి లేకుండా దీక్ష చేపట్టడంతో మధుకర్‌పై అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. అంతేకాకుండా పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలకు నోటీసులు జారీ చేశామన్నారు.
ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి శివారులో శనివారం ఉదయం ఓ కారు అదుపుతప్పి కరెంటు స్తంభానికి ఢీ కొట్టింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఈ కారులో ధర్మపురి మండలం దోనూరు గ్రామానికి చెందిన భార్యాభర్తలు ప్రయాణిస్తున్నారు. తీవ్రంగా గాయడిన వీరిని అంబులెన్సులో కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో భర్త మహేశ్ మృతి చెందాడు.
హుస్నాబాద్ మార్కెట్ యార్డ్ షెడ్‌లో కార్ల పార్కింగ్ చేస్తున్నారని తెలిసింది. మార్కెట్ యార్డ్ సిబ్బంది నిర్లక్ష్యంతో రైతులు షెడ్డులో ధాన్యం పోసుకుందామంటే షెడ్‌లో కార్లు పార్కింగ్ చేసి ఉన్నాయని, మార్కెట్ సిబ్బంది తీరు చూస్తేనే వారి పనితీరు తెలుస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు. కూతవేటు దూరంలో మంత్రి కార్యాలయం ఉండగా.. రైతులను పట్టించుకునే నాథుడే లేడని రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం మండలంలోని వడ్డీ వ్యాపారుల ఇళ్లపై శనివారం దాడులు నిర్వహించినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. గోదూర్ గ్రామానికి చెందిన పురుషోత్తం వద్ద రూ.8,33,000 విలువ గల ప్రామిసరీ నోట్లను, బ్లాంక్ చెక్కులను, నోటుబుక్కులను, సత్యక్కపల్లి గ్రామానికి చెందిన రాజా గౌడ్ వద్ద రూ.38,14,370 విలువ గల ప్రామిసరీ నోట్లు, నోటుబుక్కులు, నగదును సీజ్ చేసి కేసు చేశామన్నారు.
గంజాయి గ్యాంగులపై ఉక్కు పాదం మోపుతానని వేములవాడ డిఎస్పి నాగేంద్ర చారి అన్నారు. శనివారం రోజు పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐదుగురు గంజాయి నిందితులను అరెస్ట్ చేయగా వారి వద్ద రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. జిల్లాలో గంజాయి నిర్మూలనకు ప్రతిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని డిఎస్పి అన్నారు.
మంథని పట్టణంలో పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ముందుగా మాజీ స్పీకర్ శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికలు ఇచ్చిన హామీలలో నాలుగు గ్యాలరీలు అమలు చేస్తున్నామని వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఎమ్మెల్యేలు రాజ్ ఠాకూర్, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ తదితరులు ఉన్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి తీసుకువచ్చి వేములవాడలో విక్రయిస్తున్న ఐదుగురిని పట్టుకొని రిమాండ్‌కు తరలించినట్లు వేములవాడ డీఎస్పీ నాగేంద్ర చారి తెలిపారు. నిందితుల వద్ద 1,900 గ్రాముల గంజాయి, ఒక వాహనాన్ని సీజ్ చేశామన్నారు. రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు మారుతి, అంజయ్య, సిబ్బంది ఉన్నారు.
ముత్తారం మండలంలోని కేశనపల్లి గ్రామం వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఎస్ఐ మధుసూదన్ రావుకు ప్రమాదం తప్పింది. కేశనపల్లి గ్రామం వైపు ఇనుప రాడ్లతో వెళ్తున్న ట్రాక్టర్ ఆర్టీసీ బస్సును దాటించే క్రమంలో ఎదురుగా గోదావరిఖనికి కారులో వెళ్తున్న ఎస్ఐ వాహనాన్ని ట్రాక్టర్ డ్రైవర్ చూసి సడన్ బ్రేకు వేశారు. ఈ క్రమంలో పోలీస్ వాహనం అద్దాలు పగిలాయి. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
GDK హనుమాన్ నగర్‌కు చెందిన డిగ్రీ విద్యార్థిని అర్షియా పట్టణ శివారులోని గోదావరి బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు టూ టౌన్ CI రవీందర్ తెలిపారు. డిగ్రీ చదువుతున్న అర్షియా శుక్రవారం నదిలోకి దూకిందన్నారు. జాలర్లు గమనించి ఆమెను కాపాడే ప్రయత్నం చేశారని, అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు CI తెలిపారు. వివరాలు తెలియాల్సి ఉంది.
శుక్రవారం రాత్రి రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు.. జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్‌పల్లి ప్రధాన రహదారిపై రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కోరుట్లకు చెందిన వెంకటేశ్, మెట్‌పల్లికి చెందిన కాజా పాషా అనే ఇద్దరు మృతిచెందారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.