India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడి సంతకాలను ఫోర్జరీ చేసి తప్పుడు బిల్లులు సృష్టించిన జూనియర్ అసిస్టెంట్ తిరుమల, ఆమె భర్త రాజ్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానోపాధ్యాయుడు చంద్ర ప్రకాశ్ ఫిర్యాదు మేరకు శుక్రవారం ఎల్ఎండీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చేరాలు పేర్కొన్నారు.
@ భీమదేవరపల్లి మండలంలో తాటి చెట్టుపై నుండి పడి గీత కార్మికుడి మృతి. @ మెట్పల్లి మండలంలో 2 బైకులు ఢీకొని ఇద్దరి మృతి. @ రోడ్డు ప్రమాదంలో మల్లాపూర్ మండల వాసి మృతి. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ ఈనెల 19న బండి సంజయ్ నామినేషన్. @ బిజెపికి ఓట్లు అడిగి నైతిక హక్కు లేదన్నా మంత్రి పొన్నం ప్రభాకర్. @ కరీంనగర్ లో పర్యటించిన మాజీ మంత్రి హరీష్ రావు. @ జగిత్యాలలో చాయ్ పే చర్చలో పాల్గొన్న ఎంపీ అరవింద్
బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతున్నా.. తెలంగాణ విభజన హామీలను ఎందుకు అమలు చేయలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. దీనిపై ఈ నెల 14న కరీంనగర్లో దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని, ఓటు అడిగే నైతికహక్కు బీజేపీకీ లేదని అన్నారు. అధికారంలోకి వచ్చి ప్రభుత్వ సంస్థలను అమ్ముకున్నారే తప్పా.. ప్రజలకు ఏమి చేయలేదన్నారు.
ఎంపీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో వివిధ పార్టీలు తమవ్యూహాలకు పదునుపెట్టాయి. ఉమ్మడి జిల్లాలో కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ (కొంతమేర) పార్లమెంటు స్థానాలున్నాయి. కరీంనగర్‌లో కాంగ్రెస్ మినహా అన్నిస్థానాల్లో అభ్యర్థులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. గ్రామాలు, మండలాల వారీగా సర్వేలు చేయించుకుంటున్నారు. వివిధ సంఘాలతో సమావేశాలు నిర్వహించి వారిని దగ్గర చేసుకుంటున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని స్వయం సహాయక మహిళా సంఘాలకు గత ఆర్థిక సంవత్సరంలో రుణాలు తీసుకొని వడ్డీతో సహా చెల్లించిన వారికి ప్రభుత్వం వడ్డీ మాఫీని వారి ఖాతాల్లో జమ చేసింది. దీంతో జిల్లాలోని మొత్తం 33,471 స్వయం సహాయక సంఘాలకు రూ.36.56 కోట్ల లబ్ధి చేకూరింది. KNR రూ.11.34 కోట్లు, JGTL రూ.10.17 కోట్లు, SRCL రూ.8.23 కోట్లు, PDPL రూ.6.82 కోట్లు వడ్డీ జమ చేశారు.
కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ నామినేషన్ ముహూర్తం ఖరారైంది. ఈనెల 19న కరీంనగర్‌లో నామినేషన్ వేయనున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు. నామినేషన్ కార్యక్రమానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ లో బీజేపీ గెలుస్తుందని సర్వేలన్నీ స్పష్టం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు అబద్ధాలతో ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ నెలకొంది. వరుసగా సెలవులు రావడంతో రాజన్నను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్‌లో బారులుదీరారు. అనంతరం ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు రాజన్నను దర్శించుకొని తరించారు.
హనుమకొండ జిల్లా కేంద్రంలోని నయీంనగర్ పెద్ద మోరీ వద్ద బ్రిడ్జి నిర్మిస్తున్న సందర్భంగా బస్సులు ములుగు రోడ్డు నుంచి తిరిగి వెళుతున్నాయి. దీంతో బస్సు ఛార్జీలు నేటి నుంచి ఆర్టీసీ అధికారులు పెంచారు. హుజూరాబాద్ నుంచి హనుమకొండకు రూ.50 ఉంటే రూ.10 పెంచి రూ.60 చేశారు. బ్రిడ్జి నిర్మాణం వల్ల ప్రయాణికులపై భారం మోపడం సరికాదని విమర్శలు వస్తున్నాయి. పెంచిన ఛార్జీలు తగ్గించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
కరీంనగర్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి మినహా ప్రధాన పార్టీలకు అభ్యర్థులు ఖరారవడంతో తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. మరో 6 రోజుల్లో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుండటంతో అభ్యర్థులు జనం మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కాంగ్రెస్ తమ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. దీంతో కరీంనగర్‌లో ఉత్కంఠ నెలకొంది.
*రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడు ప్రైవేటు ఆసుపత్రుల ప్రసూతి గదుల సీజ్.
*ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి.
*ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రంజాన్ పర్వదిన వేడుకలు.
*మహదేవ్పూర్ మండలంలో వడ్డీ వ్యాపారుల ఇండ్లపై దాడులు.
*మెట్ పల్లి పట్టణంలో చాయ్ పై చర్చ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ధర్మపురి అరవింద్.
*తన జీవితం తెరిచిన పుస్తకమన్న మాజీ మంత్రి కొప్పుల
Sorry, no posts matched your criteria.