Karimnagar

News April 10, 2024

జగిత్యాల: విషాదం.. యువకుడి ఆత్మహత్య

image

జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో విషాదం జరిగింది. రామన్నపేట గ్రామానికి చెందిన వాకులాబరణం మణిదీప్ (30) ఇంట్లో ఎవరూ లేని సమయంలో బుధవారం ఉదయం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న మల్యాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అయితే మృతికి గల కారణం తెలియాల్సి ఉంది. మణిదీప్ మృతి పట్ల కుటుంబసభ్యులు రోదిస్తున్నారు.

News April 10, 2024

పొన్నం అశోక్‌కు టీపీసీసీ లీగల్ పదవి

image

కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ న్యాయవాది, పొన్నం అశోక్ గౌడ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్, హ్యూమన్ రైట్స్, ఆర్టీఐ డిపార్ట్మెంట్ ఛైర్మన్‌గా నియామకమయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ వర్గాలు బుధవారం నియామక ఉత్తర్వులు జారీ చేశాయి. అశోక్ గౌడ్ నియామకం పట్ల స్థానిక న్యాయవాదులు, కాంగ్రెస్ నాయకులు, బార్ అసోసియేషన్ వర్గాలు అభినందనలు తెలిపాయి.

News April 10, 2024

నిర్భయంగా పోలీసులను సంప్రదించాలి: ఎస్పీ అఖిల్ మహాజన్

image

మహిళలు ఎలాంటి సమస్య ఉన్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. జిల్లాలో మహిళను వేధిస్తున్న పోకిరీలపై 5 కేసులు, 4 పెట్టి కేసులు నమోదు చేశామని చెప్పారు. లేడీస్ ఎవరైనా వేధింపులకు గురైనట్లయితే వెంటనే 87126564425, 100కి ఫిర్యాదు చేయాలని అన్నారు. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవడంతోపాటు ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.

News April 10, 2024

కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ సీటుపై వీడని చిక్కుముడి..?

image

ఎన్నికల షెడ్యూలు విడుదలై దాదాపు నెల రోజులు కావస్తుంది. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. కానీ, కాంగ్రెస్ మాత్రం ఇప్పటివరకు అభ్యర్థి విషయంలో పీట మూడి వీడటం లేదు. మరో 8 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ ఉత్కంఠకు ముగింపు ఎప్పుడా అని స్థానికులు ఎదురుచూస్తున్నారు.

News April 10, 2024

KNR: మత్తులో చిత్తవుతున్న యువత

image

ఉమ్మడి KNR జిల్లాలో గంజాయి అక్రమ రవాణా భారీగా పెరుగుతోంది. దీని నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్ తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే గత రెండేళ్ల నుంచి కరీంనగర్‌లో 22, పెద్దపల్లి 25, జగిత్యాల11, సిరిసిల్ల 59కి పైగా పోలీస్ అధికారులు కేసులు నమోదు చేశారు. కాగా, జిల్లాలో యువత ఎక్కువగా మత్తుకు అలవాటు పడింది.

News April 10, 2024

సిరిసిల్ల: అత్తింటి వేధింపులు భరించలేక గృహిణి సూసైడ్

image

అత్తింటి వేధింపులతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. జీనోమ్ వ్యాలీ ఇన్స్పెక్టర్ యాదయ్య గౌడ్ ప్రకారం.. మల్యాలకు చెందిన మాధురి(22)కి.. వేణుతో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. శామీర్పేట మండలంలో నివాసం ఉంటూ భర్త వేణు ఓ సంస్థలో పనిచేస్తున్నాడు. సోమవారం సా. భర్త వచ్చేసరికి మాధురి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉంది. అయితే అత్తింటి వేధింపులతో కుమార్తె ఆత్మహత్యకు పాల్పడినట్లు, కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

News April 10, 2024

KNR: మే 3న ఉద్యోగంలో జాయినింగ్.. బీటెక్ విద్యార్థి మృతి

image

ఈతకు వెళ్లిన ఓ యువకుడికి ఫిట్స్ వచ్చి బావిలోనే మృతి చెందిన ఘటన HZBD మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. కందుగులకు చెందిన విజయ్ కుమార్(21) HYDలో బీటెక్ చదువుతున్నాడు. అయితే పండగకు స్వగ్రామానికి వచ్చాడు. ఈక్రమంలో స్నిహితులతో కలిసి ఊరి చివరి బావిలోకి ఈతకు వెళ్లగా.. బావిలోనే మునిగిపోగా నీటిని తోడి మృతదేహాన్ని గుర్తించారు. కాగా, విజయ్‌కు ఇటీవల ఓ ఉద్యోగం రాగా.. మే 3న చేరాల్సి ఉంది.

News April 10, 2024

KNR: గుంటకు రూ.10లక్షలు.. ఖాళీ అవుతున్న గుట్ట

image

KNR-JGTL జాతీయ రహదారిలోని మధురానగర్ శివారులో వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న వంటశాల గుట్ట అక్రమార్కులకు వరంగా మారింది. కొందరు వాణిజ్య అవసరాలకు తవ్వుకోవడంతో పాటు.. గుట్టను తొలచి అడుగు స్థలాన్ని చదను చేస్తున్నారు. ఇక్కడి స్థలం గుంట రూ.10 లక్షల వరకు పలుకుతుండటంతో ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వీరివెనక రాజకీయ నేతల అండ ఉండటంతో పాటు అధికారులు పట్టించుకోవట్లేదని మండిపడుతున్నారు.

News April 10, 2024

నేడు జగిత్యాలకు KCR

image

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు జగిత్యాల పట్టణానికి రానున్నారు. MLA డాక్టర్ సంజయ్ కుమార్ తండ్రి, సీనియర్ న్యాయవాది మాకునూరి హనుమంతరావు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ క్రమంలో నేడు ఓ గార్డెన్స్‌లో జరిగే 13వ రోజు(స్వర్గ పాత్ర) కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించనున్నట్టు ఎమ్మెల్యే కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేశారు.

News April 9, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

*ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా ఉగాది పర్వదిన వేడుకలు.
*KNR: అగ్గిపెట్టెలో పట్టే పట్టు వస్త్రం బహూకరణ (VIDEO)
*భక్తులతో కిటకిటలాడిన ఓదెల మల్లన్న ఆలయం.
*భీమదేవరపల్లి మండలంలో ఆరుగురు పేకాటరాయుళ్ల పట్టివేత.
*పుష్ప2 సినిమా సాంగ్‌లో పాల్గొన్న మల్యాల మండల యువకులు.
*కాటారం మండలంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం.
*ధర్మారం మండలంలో వృద్ధుడిపై ఫోక్సో కేసు నమోదు.

error: Content is protected !!