India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి పట్నాల మహోత్సవ వేడుకలను నేడు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్నాల మహోత్సవ వేడుకల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మంగళవారం సాయంత్రం పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక బోనం చెల్లించి మొక్కులు సమర్పించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారిని ఆలయ కమిటీ సభ్యులు కాంగ్రెస్ నాయకులు సన్మానం చేశారు.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం చాలా సంతోషం అని ఎంపీ బండి సంజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వస్త్ర పరిశ్రమ ఆసాములు, నేతన్నలంతా ఐక్యంగా చేసిన పోరాటాల ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఈ విషయంలో నేతన్నలకు అండగా నిలిచిన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.
చికెన్‌పాక్స్, తట్టు కేసులు ఉమ్మడి KNR జిల్లాలో పెరుగుతున్నాయి. వేసవి కారణంగానే కేసులు పెరుగుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇటీవల KNR పట్టణం గణేశ్‌నగర్‌కు చెందిన విద్యార్థికి జ్వరం వచ్చి.. సాయంత్రంలోపే శరీరంపై బుగ్గలు కనిపించాయి. అతడికి తగ్గగానే తన తమ్ముడికి వచ్చింది. ఉమ్మడి జిల్లా మొత్తం ఇదే పరిస్థితి. అయితే వ్యాక్సిన్లు వేసుకోనివారిలో ఈ తీవ్రత ఎక్కువ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, స్థానాచార్యులు కాపీందర్, ప్రధాన అర్చకులు జితేంద్రప్రసాద్, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందిన 15 మంది యువకులకు పుష్ప2 సినిమాలో పులి వేషం వేసే అవకాశం లభించింది. 45 రోజులపాటు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చేపట్టిన ఓ సాంగ్ షూటింగ్‌లో యువకులు పులి వేషంలో పాల్గొన్నారు. మొహర్రం పండుగ సందర్భంగా తాము గ్రామంలో వేసిన పులి వేషధారణను యూట్యూబ్‌లో పెట్టగా.. డైరెక్టర్ చూసి అవకాశం ఇచ్చినట్లు సంపత్ అనే యువకుడు తెలిపాడు.
ఉగాది పర్వదినం సందర్భంగా సెంట్రల్ రైల్వే ముంబైలోని CSMT (చత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్) నుంచి కరీంనగర్‌కు వీక్లీ ఎక్స్ ప్రెస్‌ను నేటి నుంచి నడపనున్నారు. CSMT నుంచి ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 గం.కు బయలుదేరి బుధవారం ఉదయం 8:30 గం.కు కరీంనగర్ చేరుతుంది. తిరిగి అదే రోజు రాత్రి 7:05 గంటలకు KNR నుంచి బయలుదేరి గురువారం మధ్యాహ్నం 1:40 గంటలకు ముంబై చేరుకుంటుంది.
GDK LBనగర్‌కు చెందిన గౌతమి, హనుమాన్ నగర్‌కు చెందిన రాజుకు 2009 వివాహం చేసుకున్నారు. కొద్దిరోజుల తర్వాత రాజు, అతని తల్లి వరకట్నం తేవాలని వేధింవారు. ఈక్రమంలో 2014 AUG 9న గొంతు నులిమి హత్య చేసి, కిరోసిన్ పోసి నిప్పంటించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో వన్ టౌన్‌లో కేసు నమోదు చేశారు. సోమవారం నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శ్రీనివాసరావు భర్త, అత్తకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చారు.
ధర్మారం మండలం నర్సింగాపూర్‌లో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు నిరసన చేపట్టింది. MNCL జిల్లా కాసిపేటకు చెందిన స్వాతికి గతంలో వివాహమై భర్త మరణించాడు. దీంతో KNR కూల్ డ్రింక్స్ కంపెనీలో పనిచేస్తోంది. దూరపు బంధువైన శ్రీనివాస్ రెడ్డితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఈక్రమంలో శ్రీనివాస్ రెడ్డి పెళ్లికి నిరాకరించడంతో యువతి అతడి ఇంటి ముందు బైఠాయించింది.
ధర్మారం మండలంలో ఓ వృద్ధుడిపై పోక్సో కేసు నమోదైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆరేళ్ల చిన్నారి ఆదివారం సాయంత్రం ఆడుకుంటుండగా తాత వరుసైన వృద్ధుడు తన నివాసంలోకి తీసుకెళ్లాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు అతడిని మందలించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.
జమ్మికుంట ఫోర్లేన్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో HNK జిల్లా పెంచికల్ పేటకు చెందిన RMP డాక్టర్ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రవీందర్, ఇందిరానగర్ కాలనీకి చెందిన అంజన్ కుమార్‌లు ద్విచక్ర వాహనాలపై ఎదురెదురుగా ఢీకొన్నారు. గమనించిన స్థానికులు ఇద్దిరినీ హుజూరాబాద్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రవీందర మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కేసు నమోదైంది.
Sorry, no posts matched your criteria.