Karimnagar

News April 8, 2024

వేములవాడలో ఫిట్స్‌తో భక్తుడి మృతి

image

ఫిట్స్‌తో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన వేములవాడలో జరిగింది. ఆదివారం శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన ఓ వ్యక్తి ఫిట్స్‌కు గురయ్యారు. వెంటనే ఆలయ అధికారులు స్థానికుల సమాచారంతో 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. మరణించినట్లు వేములవాడ టౌన్ ఇన్‌ఛార్జ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. సదరు వ్యక్తి వివరాలు తెలిసిన వారు వేములవాడ పోలీసులను సంప్రదించాలన్నారు.

News April 7, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ మల్యాల మండలంలో ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య. @ కోరుట్ల మండలంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి. @ ఎల్లారెడ్డిపేట మండలంలో నెంబర్ ప్లేట్లు లేని వాహనాల పట్టివేత. @ ఓదెల మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ మెట్పల్లి మండలం కొండ్రికర్ల లో వైభవంగా మల్లన్న జాతర. @ కోనరావుపేట మండలంలో చెరువులో చేపల మృతి. @ జగిత్యాల జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా జలపతి రెడ్డి.

News April 7, 2024

మల్యాల: ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

image

మల్యాల మండలం ఓబులాపూర్ గ్రామానికి చెందిన బొజ్జ లక్ష్మి (38) అనే మహిళ ఆదివారం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అప్పులు ఎక్కువ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ గ్రామ శివారులోని వెంకటేశ్వర్ల గుట్టపై ఓ చెట్టుకు ఉరి వేసుకున్నట్లు పేర్కొన్నారు. మృతురాలి భర్త బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

News April 7, 2024

జగిత్యాల: రోడ్డు యాక్సిడెంట్‌లో వ్యక్తి మృతి

image

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన కట్కం లక్ష్మీకాంతం వృత్తిరీత్యా కిరాణా షాపులో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో తన సొంత పనుల నిమిత్తం కోరుట్ల వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో పైడిమడుగు గ్రామసమీపంలో తన బైకు అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టుకు ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అతడి మృతితో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.

News April 7, 2024

పెద్దపల్లి: కరెంట్ షాక్‌తో బాలింత మృతి

image

కరెంట్ షాక్‌తో బాలింత మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. ఎలిగేడు మండలం శివపల్లికి చెందిన పరమేశ్వరి, వెంకటేశం దంపతుల కుమార్తె కీర్తిని రామగుండానికి చెందిన స్వాగత్‌కు ఇచ్చి 2021లో పెళ్లి చేశారు. కీర్తి ఆడబిడ్డకు జన్మనివ్వగా.. ఈ నెల 1న పుట్టినింట్లో సంప్రదాయ కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం రాత్రి కీర్తి స్నానం చేయడానికి వెళ్లగా.. విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురై మృతి చెందారు.

News April 7, 2024

ఈసారి నిజామాబాద్ ఎంపీ స్థానం దక్కేదెవరికి?

image

నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని ఓటర్లు ఎన్నికల్లో విలక్షణ తీర్పు ఇస్తూ ఉంటారు. ఇప్పటికీ ఇక్కడ 5 పార్టీలను ఆదరించారు. 6 సార్లు కాంగ్రెస్, 2 సార్లు టీడీపీ, స్వతంత్ర, బీఆర్ఎస్, బీజేపీ ఒక్కోసారి గెలిచాయి. బీజేపీ నుంచి సిట్టింగ్ MP అర్వింద్ ధర్మపురి మరోసారి బరిలో నిలవగా.. బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి బరిలో ఉన్నారు. గెలుపుపై ముగ్గురూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

News April 7, 2024

కరీంనగర్: ‘బయటకు రావొద్దు’

image

కరీంనగర్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. వీణవంకలో 44℃, కొత్తపల్లి 43.8, జమ్మికుంట 43.7, కొత్తగట్టు 43.6, వెదురుగట్టు 42.9, మల్యాల 42.6, ఇందుర్తి 42.5, ఆర్నకొండ 42.4, దుర్షెడ్‌ 42.1, వెంకేపల్లి 41.9, ఆసిఫ్‌నగర్‌ 42, గంగిపల్లి 41.7, బోర్నపల్లి 41.7, చింతకుంట 41.5, తనుగుల 41.5, కరీంనగర్ 41.5, పోచంపల్లి 41.4, రేణికుంట 40.9, నుస్తులాపూర్ 41℃గా నమోదైంది. అవసరమైతేనే బయటకు రావాలని వైద్యులు సూచించారు.

News April 7, 2024

కరీంనగర్: DSC ఉచిత శిక్షణకు స్పాట్ అడ్మిషన్లు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులకు DSCలో SGT, SAకు GS మొదటి పేపర్ ఉచిత శిక్షణ కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ కరీంనగర్ డైరెక్టర్ రవి కుమార్ ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్ జిల్లాకు చెందిన అర్హత గల అభ్యర్థులకు ఈ నెల 8న ఉదయం 10 గంటలకు బీసీ స్టడీ సర్కిల్‌లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామని చెప్పారు.

News April 7, 2024

సిరిసిల్ల: 14 కేసులు నమోదు చేశాం: ఎస్పీ

image

అక్రమవడ్డీ, ఫైనాన్స్ వ్యాపారస్తులపై 14 కేసులు నమోదు చేశామని సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ… జిల్లాలో అనుమతులు లేకుండా అక్రమ వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ నిర్వహిస్తున్న 14 మందిపై కేసులు నమోదు చేసి వారి నుండి రూ.16,13,000, 359 డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.

News April 6, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ సిరిసిల్లలో ఉరి వేసుకుని నేత కార్మికుడి ఆత్మహత్య @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బిఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు దీక్షలు. @ కోరుట్ల పట్టణంలో ఆటో ఢీకొని 16 నెలల బాలుడు మృతి. @ సిరిసిల్లలో రైతు దీక్షలో పాల్గొన్న కేటీఆర్. @ సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న సిరిసిల్ల ఎస్పీ.

error: Content is protected !!