Karimnagar

News April 6, 2024

ఐపీఎల్ మ్యాచ్‌లో ఉమ్మడి జిల్లా మంత్రులు

image

శుక్రవారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై మ్యాచ్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు సందడి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, హీరో వెంకటేష్‌లతో కలిసి మ్యాచ్ వీక్షించారు. అనంతరం హైదరాబాద్ జట్టు గెలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

News April 6, 2024

నేతన్న కుటుంబానికి రూ.50,000 ఆర్థికసాయం చేసిన కేటీఆర్

image

సిరిసిల్లలో ఉరేసుకుని<<13002333>> లక్ష్మీనారాయణ<<>> అనే నేత కార్మికుడు మృతి చెందాడు. ఆయన పార్థివదేహానికి ఎమ్మెల్యే కేటీఆర్ నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు తక్షణ సహాయం కింద రూ. 50,000 ఆర్థికసాయం చేశారు. ప్రభుత్వం తరఫున రావాల్సిన ఆర్థికసాయమందించాలని కలెక్టర్‌ను కోరారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

News April 6, 2024

కోరుట్ల: ఆటో ఢీకొని 16 నెలల బాలుడు మృతి

image

తాగునీటి సరఫరా చేసే ట్రాలీ ఆటో ఢీకొని 16 నెలల బాలుడు మృతి చెందిన సంఘటన కోరుట్ల పట్టణంలో శనివారం జరిగింది. అంబేడ్కర్ నగర్ కాలనీకి చెందిన పొట్ట రిసింద్ర, అపూర్వల కుమారుడైన సుధన్వన్.. ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఈక్రమంలో అటుగా వచ్చిన ఆటో డ్రైవర్ అజాగ్రత్తతో నడిపి బాలుడిని ఢీకొట్టాడు. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 6, 2024

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మీ మొబైల్ ఫోన్‌లోకి వచ్చే లింకులపై క్లిక్ చేయవద్దని, మీ ప్రమేయం లేకుండా మీ మొబైల్‌కి వచ్చే ఓటీపీలను ఎవరికీ చెప్పొద్దని సూచించారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే 1930, 100 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు.

News April 6, 2024

KNR జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు

image

రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలలో శుక్రవారం ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొల్వాయి, సిరిసిల్ల జిల్లా మర్దన పేటలో 43.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత నమోదయింది. కరీంనగర్ జిల్లా వెదురుగట్టలో 43.2, పెద్దపల్లి జిల్లా సుగ్లాంపల్లిలో 43.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు జగిత్యాల పరిశోధన స్థానం అధికారి బి.శ్రీ లక్ష్మీ తెలిపారు.

News April 6, 2024

KCR కరీంనగర్ పర్యటనలో దొంగతనం!

image

KNR జిల్లాలో శుక్రవారం KCR పర్యటించిన విషయం తెలిసిందే. అయితే KNR రూరల్ మండలం ముగ్దుంపూర్‌లో KCR పంట పొలాల సందర్శన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తమ చేతివాటం చూపించారు. KCR పంట చేను వద్దకు రాగానే రైతులు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో ఆయనకు స్వాగతం పలికేందుకు రాగా.. అదే అదనుగా దొంగలు నాయకుల జేబుల నుంచి డబ్బు, సెల్ ఫోన్ మాయం చేశారు. వీరిలో ఒకరిని పట్టుకొని చితకబాది డబ్బు తిరిగి తీసుకున్నారు.

News April 6, 2024

UPDATE.. కరీంనగర్: అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

image

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో శుక్రవారం రాత్రి సమయంలో జరిగిన ప్రమాదంలో గంట విజయ్(17), గంట వర్ష(15), సింధూజ(18)లు మృత్యువాత పడ్డారు. బోర్నపల్లి పెద్దమ్మ జాతరలో పాల్గొని బైక్ పై తిరుగు ప్రయాణం అయిన వీరు అటు వైపుగా వస్తున్న మొరం లారీని చూసి క్రాసింగ్ వద్ద ఆగారు. మొరం తరలిస్తున్న టిప్పర్ అదుపుతప్పి వారిపైనే బోల్తాపడింది. విజయ్, వర్ష, సింధూజలపై మొరం పడటంతో చిక్కుకుపోయి అక్కడికక్కడే మృతి చెందారు.

News April 6, 2024

GREAT.. KNR జిల్లా వాసి అద్భుత ఆవిష్కరణ

image

చదివింది పదో తరగతి అయినప్పటికీ నూతన పరికరాలను తయారు చేసి ఔరా అనిపిస్తున్నాడు జగిత్యాల జిల్లా మల్యాల మండలానికి చెందిన తిరుపతి. పదేళ్లు సింగపూర్‌లో ఉండి 20 రోజుల క్రితం స్వగ్రాయానికి వచ్చారు. రైతులకు ఉపోయోగపడేలా రూ.15వేల ఖర్చుతో 2 వారాల్లోనే సైకిల్ మోటార్‌ను తయారు చేశారు. లీటరు పెట్రోల్‌కు 20కి.మీ దూరం ప్రయాణించేలా రూపొందించాడు. కాగా, గతంలో గడ్డికోసే యంత్రం, పసుపు తవ్వే యంత్రాన్ని కూడా తయారుచేశాడు.

News April 6, 2024

KNR: విషాదం.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

image

రోడ్డు ప్రమాదందో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన హుజూరాబాద్‌లో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. సైదాపూర్ మండలం ఎలబోతారం నుంచి HZBDకు ఓ మట్టితో ట్రక్కు బయల్దేరింది. ఈ క్రమంలో బోర్నపల్లి శివారు వద్దకు రాగా.. ట్రక్కు అదుపు తప్పి బైకుపై వస్తున్న ముగ్గురు యువతీ యువకులపై మట్టి పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన విజయ్, సింధుజ, వర్ష మృతి చెందారు.

News April 6, 2024

CMPFలో అందుబాటులో ఆన్ లైన్ సేవలు

image

బొగ్గు గని కార్మికుల భవిష్య నిధి(CMPF) సంబంధించిన ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. చాలాకాలంగా CMPF-ట్రస్ట్ బోర్డులో ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని చర్చించిన మేరకు ఇటీవల C-కేర్ పోర్టల్‌ను అధికారులు ప్రారంభించారు. పింఛన్‌తో పాటు CNPF చెల్లింపులకు సంబంధించి ప్రతి అంశాల సేవలు ఆన్‌లైన్లో పొందే అవకాశం ఉంది. దీంతో రిటైర్డ్ కార్మికులకు పారదర్శకంగా సేవలు అందే అవకాశం ఏర్పడింది.

error: Content is protected !!