India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 31 గంటల దీక్ష చేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్.. ధర్మపురి రైతుల గురించి ఎప్పుడైనా 30 నిమిషాలైనా ఆలోచించారా అని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. శుక్రవారం ధర్మపురిలో మీడియాతో మాట్లాడారు. తన ఎమ్మెల్యే పదవి కాలం ముగిసే లోపు ధర్మపురిలో రిజర్వాయర్ ఏర్పాటు చేసి సస్యశ్యామలం చేస్తామన్నారు. కాంగ్రెస్ మండల నాయకులు పాల్గొన్నారు.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి. @ కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మాజీ సీఎం కేసీఆర్. @ మల్లాపూర్ మండలంలో వ్యక్తి దారుణ హత్య. @ మేడిపల్లి మండలంలో అనుమానాస్పద స్థితిలో వలస కూలి మృతి. @ కథలాపూర్ మండలంలో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగల అరెస్ట్. @ మెట్పల్లి మండలంలో సైబర్ మోసంతో నగదు తస్కరణ. @ జగిత్యాలలో 15 తులాల బంగారు నగలు చోరీ.
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం జాగిరిపల్లిలో నమ్మదగిన సమాచారం మేరకు శుక్రవారం హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ, రూరల్ సీఐ పులి వెంకట్ గౌడ్, స్థానిక ఎస్సై జన్ను ఆరోగ్యం పోలీస్ సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా హుజూరాబాద్ గ్రామానికి చెందిన కన్నబోయిన మహేందర్ ఒక రూమంలో అక్రమంగా 21.30 క్వింటాళ్ల గన్ పౌడర్ దాచి పెట్టినట్లు ఎస్సై చెప్పారు. అతడిపై కేసు నమోదు చేశామన్నారు.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం దారుణ హత్య జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రంలోని దుర్గమ్మ ఆలయ సమీపంలో నివసిస్తున్న అంబదాస్ మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం కాసేపు సేద తీరుతున్నారు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి హత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ప్రత్యర్థులుగా పోటీపడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం ఓ వేడుకలో సరదాగా మాట్లాడుకున్నారు. కోరుట్లలో గురువారం జరిగిన ఓ వివాహ వేడుకకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కోరుట్ల కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ నర్సింగరావు హాజరయ్యారు. అదే సమయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, బాజిరెడ్డి గోవర్ధన్ అక్కడికి రావడంతో అందరూ కలుసుకున్నారు.
మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలో ప్రేమ జంటపై అమ్మాయి కుటుంబ సభ్యులు దాడి చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. సాతారానికి చెందిన అనిల్ అదే గ్రామానికి చెందిన రమ్యను ఇటీవల ప్రేమ వివాహం చేసుకొని వేరే గ్రామంలో నివసిస్తున్నాడు. గురువారం గ్రామానికి తిరిగి రావడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయి ఇంట్లోకి చొరబడి దాడి చేసి అమ్మాయిని తీసుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
కరీంనగర్ MLA, మాజీ మంత్రి గంగుల కమలాకర్ పార్టీ మారుతున్నారనే పలు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. గురువారం ఆయన కరీంనగర్‌లో ఓ సమావేశంలో మాట్లాడుతూ.. పార్టీ మారుతున్నానంటూ తనపై కొందరు బురద జల్లుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తి లేదని అన్నారు. కాంగ్రెస్ నాలుగు నెలల పాలనకే రైతులు ఆగమయ్యారని, వారిని ఆదుకునేందుకే కేసీఆర్ రంగంలోకి దిగారని తెలిపారు.
పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు నేడు కరీంనగర్‌కు వస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఏ ముఖం పెట్టుకుని పంట పొలాల సందర్శనకు వస్తున్నారో సమాధానం చెప్పాలని మండిపడ్డారు. కేసీఆర్‌కు నిజంగా రైతులపట్ల చిత్తుశుద్ధి ఉంటే రైతుల దుస్థితికి తానే కారణమని ఒప్పుకుని ముక్కు నేలకు రాసి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి కరీంనగర్‌కు రావాలని గురువారం ఓ సమావేశంలో డిమాండ్ చేశారు.
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు సోషల్ మీడియా వేదికగా వినూత్న రీతులలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఓవైపు నియోజకవర్గాలలో తిరుగుతూనే మరోవైపు సోషల్ మీడియా బాధ్యుల పేరుతో హల్ చల్ చేస్తున్నారు. ప్రచారాలు కాస్తా దూషణల వరకు వెళ్తుంది. దీంతో ఏకంగా పోలీసులకు ఫిర్యాదులు చేసుకునే వరకు వచ్చింది. బూతు పురాణాలు, విభిన్న ప్రచారాలతో ఓటర్లను నేతలు సందిగ్ధంలో పడేస్తున్నారు.
వర్షాకాలం వచ్చిందంటే చాలు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్వగ్రామమైన HNK జిల్లా వంగరలో గ్రామ చెరువు నిండి అలుగు పారుతూ రోడ్డు పైనుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తుంటుంది. దీంతో రాకపోకలు స్తంభిస్తాయి. అయితే గతంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్ ఇక్కడ వంతెన నిర్మిస్తామని చెప్పినప్పటికీ జరగలేదు. ప్రస్తుత ప్రభుత్వంలోనైనా మంత్రులు చొరవ తీసుకుని వంతెన నిర్మిస్తారని గ్రామస్థులు ఎదురు చూస్తున్నారు.
Sorry, no posts matched your criteria.