India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ నేటి పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 10:30 గంటలకు ముకుదమ్పుర్ గ్రామంలో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంట్లో భోజనం చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు బోయిన్పల్లి, చొప్పదండి మండలాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. 3 గంటలకు శభాష్పల్లిలో మిడ్ మానేరును సందర్శిస్తారు. 4 గంటలకు సిరిసిల్లలో ప్రెస్ మీట్‌లో పాల్గొంటారు.
వేసవి నేపథ్యంలో తాగునీటికి గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. గురువారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాల్లో తాగునీటి సరఫరాపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ, ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, పలువురు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
*శంకరపట్నం మండలంలో ఆర్టీసీ బస్సు కింద పడి ఒకరి మృతి.
*వీర్నపల్లి మండలంలో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి.
*పోలీస్ కస్టడికి కరీంనగర్ కార్పొరేటర్ భర్త.
*కథలాపూర్ మండలంలో చైన్ స్నాచింగ్.
*ఎన్టిపిసి స్టేషన్ పరిధిలో హత్యాయత్నానికి పాల్పడిన ముగ్గురి అరెస్ట్.
*గుండెపోటుతో మృతి చెందిన గొల్లపల్లి మండల ఉపాధ్యాయుడు.
*దుబాయ్‌లో సిరిసిల్ల జిల్లా వాసి గుండె పోటుతో మృతి.
*జగిత్యాల కలెక్టరేట్లో ఇఫ్తార్ విందు.
కరీంనగర్ జిల్లా స్పెషల్ ఆఫీసర్‌గా ఆర్.వి.కర్ణన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐఏఎస్ ఆఫీసర్లను స్పెషల్ అబ్జర్వర్స్(ప్రత్యేక పరిశీలకులు)గా నియమిస్తూ ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వు 566 జారీ చేసింది. వేసవి దృష్ట్యా అన్ని ప్రాంతాలలో తాగు నీరు అందుబాటులో ఉండే విధంగా చూడాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
దుబాయ్‌లో సిరిసిల్ల జిల్లా వాసి మృతి చెందాడు. స్థానికుల ప్రకారం.. బోయిన్పల్లి మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన చల్ల శ్రీనివాస్ దుబాయ్‌లో రెండు రోజుల క్రితం మృతి చెందాడు. శ్రీనివాస్ 12 ఏళ్ల క్రితం బతుకుతెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. వీసా సమస్యల వల్ల ఇంటికి రాలేకపోయాడు. ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామం రప్పించేందుకు గల్ఫ్ సంఘాలు చర్యలు తీసుకుంటున్నాయి.
శంకరపట్నం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మండల పరిధిలోని చింతకుంటకు చెందిన సిరిసిల్ల ఆంజనేయులు, మంద హరీష్ బైకు పై వెళ్తున్నారు. ఈక్రమంలో కేశవపట్నం బస్టాండ్ ఎదురుగా బైకు అదుపుతప్పి పడటంతో కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్తున్న RTC బస్సు కిందపడి ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. కేశవపట్నం ఎస్సై లక్ష్మారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామానికి చెందిన ఓ విద్యార్థి ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. కుటుంబీకుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆలకుంట హరికృష్ణ(16) వీర్నపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు. గురువారం సరదాగా అల్మాస్‌పూర్ గ్రామ శివారులో ఉన్న రంగ చెరువులో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు.
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ప్రాథమిక పాఠశాల SGT ఉపాధ్యాయుడు లింగంపల్లి చంద్రయ్య బుధవారం సాయంత్రం గుండెపోటుతో మరణించారు. ఈరోజు ఆయన స్వగ్రామం వెల్గటూర్ మండలం గుల్లకోటలో అంత్యక్రియలు జరుగుతాయని ఉపాధ్యాయ వర్గాలు తెలిపాయి. లింగయ్య DTF ఉపాధ్యాయ సంఘం మండల అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు.
ఎల్లారెడ్డిపేటలో SI రమాకాంత్ తన సిబ్బందితో బుధవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించడం కలకలం రేపింది. అయితే సినిమా టాకీస్ ప్రాంతంలో గత కొంత కాలంగా కొందరు వ్యక్తులు వ్యభిచారం నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్లు సమాచారం మేరకు తనిఖీలు చేశారు. ఎస్ఐ మాట్లాడుతూ.. అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనే సమాచారంతో సోదాలు చేసినట్లు తెలిపారు. ఎలాంటి ఆధారాలు లభ్యంకాలేదన్నారు.
భూ వివాదంలో కరీంనగర్ 7వ డివిజన్ కార్పొరేటర్ భర్త ఆకుల ప్రకాశ్‌ను గత నెల 26న అరెస్ట్ చేసి రిమాండుకు తరలించిన విషయం తెలిసిందే. కోర్టు ద్వారా పోలీసులు 24 గంటల కస్టడీ తీసుకున్నామని కరీంనగర్ రూరల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ కుమార్ తెలిపారు. ప్రకాశ్ ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.