India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహజన్ అన్నారు. సైబర్ నేరాల కట్టడికి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక శిక్షణ పొంది సైబర్ వారియర్స్‌గా నియమితులైన సిబ్బందికి బుధవారం ఆయన ఫోన్లు, సిమ్ కార్డులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్ల జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్‌కు ఒక సైబర్ వారియర్‌ను నియమించినట్టు ఆయన పేర్కొన్నారు.
వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో తాజాగా ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్డ్ చేసిన పది మంది సిబ్బందిలో ముగ్గురు కానిస్టేబుళ్లు శంకర్, అరుణ్, సురేశ్‌ను సస్పెండ్ చేశారు. వీరి సస్పెన్షన్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ఒగ్లాపూర్ గ్రామానికి చెందిన బైరి వెంకటేశం బతుకుదెరువు కోసం ఇరాక్ వెళ్లారు. ఆయన అక్కడ డిసెంబర్ 29, 2023న రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మూడు నెలలుగా మృతదేహం కోసం ఎదురుచూస్తున్నామని, బుధవారం వెంకటేశం మృతదేహం ఒగ్లాపూర్‌కు చేరుకుందని చెప్పారు.
సిరిసిల్ల జిల్లాలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల వివరాల ప్రకారం.. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన ఎత్తరి శైలజ(19) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వరకట్న వేధింపులతో కొడుక్కి విషమిచ్చి <<12973114>>తల్లి ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల ప్రకారం.. ఈ ఘటనలో తల్లి శ్రీజ(27), కొడుకు రేయాన్ష్(11నెలలు) మృతిచెందగా.. కూతురి మృతి తట్టుకోలేక శ్రీజ తల్లి జయప్రద విషగుళికలు తిని మరణించింది. WGLకు చెందిన నరేశ్‌తో 2021లో శ్రీజ పెళ్లయింది. గొడవలతో తల్లి ఇంటికి వెళ్లిన శ్రీజ.. కొడుకు ఫస్ట్ బర్త్ డేకు పిలవగా రానని దూషించాడు. మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది.
వేములవాడ రాజన్న ఆలయంలో ఈనెల 9 నుంచి 17వ తేదీ వరకు శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఈవో కృష్ణ ప్రసాద్ తెలిపారు. 9న ఉగాది పండుగను పురస్కరించుకొని పంచాంగ శ్రవణం నిర్వహిస్తామని, పండితులకు సన్మాన కార్యక్రమం ఉంటుందన్నారు. 15 నుంచి 17 వరకు భక్తి ఉత్సవాలు నిర్వహిస్తామని, సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తామని వివరించారు.
జగిత్యాల జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. మంగళవారం ధర్మపురి మండలంలోని జైన గ్రామంలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో జైన.. రాష్ట్రంలోనే నాల్గవ స్థానంలో నిలిచింది. ఉదయం తొమ్మిది దాటితే భానుడు భగ్గుమంటున్నాడు. మధ్యాహ్నం వేళ తీవ్రరూపం దాల్చుతున్నాడు. రోజు రోజుకూ ప్రతాపం చూపిస్తున్నాడు.
ఈతకు వెళ్లి ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన జగిత్యాల అర్బన్ మండలం మోతె చెరువులో చోటుచేసుకుంది. SI సుధాకర్ వివరాల ప్రకారం.. పట్టణంలోని నాగేంద్రనగర్‌కు చెందిన ఉమా మహేశ్(14) ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఎడుగురు విద్యార్థులతో కలిసి ఈతకు వెళ్లాడు. మహేశ్ నీటిలో ముగినిపోగా.. మిగతా విద్యార్థులు ఒడ్డుకు చేరుకున్నారు. స్థానిక మత్స్యకారులకు సమాచారం ఇవ్వగా.. గాలింపుల్లో బాలుడి మృతదేహం వలలో చిక్కింది.
KNR MPఅభ్యర్థి విషయంలో కాంగ్రెస్ ఆచితూచీ అడుగులేస్తోంది. ఇప్పటికే మెజారిటీ సీట్లను ఖరారు చేసిన కాంగ్రెస్ KNR విషయంలో జాప్యం చేస్తోంది. ప్రజలతో సత్సంబంధాలతో పాటు.. సామాజిక సమీకరణాల ఆధారంగా ఎవరికి ఓట్లు ఎక్కువొస్తాయనే విషయమై కూడా పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావులు తమకే టికెట్ వస్తుందనే ధీమాతో ఉండగా.. మరో కొత్త అభ్యర్థిని సైతం వెతుకుతున్నట్లు సమాచారం.
రైతులను కాంగ్రెస్ సర్వం ముంచిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి రైతులకు నష్టపరిహారం, వడ్ల బోనస్ అందజేయాలని బీఆర్ఎస్ నేతలతో వినతి పత్రం అందజేశారు. రైతుల పేరుతో మోసం చేసి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ తదితరులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.