India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
@ వేములవాడ రూరల్ మండలంలో కల్తీకల్లు తాగి ఆరుగురికి అస్వస్థత. @ కరీంనగర్ లో కొడుకుకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య. @ రాయికల్ మండలంలో పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన వ్యక్తిపై కేసు. @ కథలాపూర్ మండలంలో ఏడుగురు పేకాటరాయుళ్ల పట్టివేత. @ జగిత్యాలలో ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్. @ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ మల్యాల ఎంపీపీపై నెగ్గిన అవిశ్వాసం. @ జగిత్యాల మండలంలో చెరువుల మునిగి బాలుడి మృతి
రోజూరోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి వైద్యాధికారులకు సూచించారు. ఎవరైనా వడదెబ్బ బారిన పడితే వెంటనే హాస్పిటల్ కు తరలించి వైద్య సేవలు అందించాలని పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ రూరల్ మండలం తీగలగుట్టపల్లిలోని బస్తీ దవాఖానను కలెక్టర్ సందర్శించారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం జ్యోతిష్మతి కళాశాల విద్యార్థి తల లభ్యమైంది. మార్చి 1న విద్యార్థి అదృశ్యం కాగా.. 27న తల లేకుండా విద్యార్థి మొండెంతో మృతదేహం లభ్యమైంది. తల కోసం గాలించిన పోలీసులు.. ఓ బావిలో మంగళవారం గుర్తించారు. బావిలో నీరు ఖాళీ చేయించి తలను వెలికితీశారు. ఘటనా స్థలంలోనే వైద్యాధికారులతో తలకు పోస్టుమార్టం నిర్వహించారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పలు పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నామని ప్రిన్సిపల్ మంగళవారం తెలిపారు. ప్రొఫెసర్స్- 5, అసోసియేట్ ప్రొఫెసర్స్- 17, అసిస్టెంట్ ప్రొఫెసర్స్- 10, సీనియర్ రెసిడెంట్స్- 4, ట్యూటర్స్- 11 పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. అర్హత, ఆసక్తి గలవారు ఈ నెల 4న ఉదయం 10 గంటల నుంచి వైద్య కళాశాలలో జరిగే వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు.
కరీంనగర్‌లో దారుణం జరిగింది. బొమ్మకల్‌కు చెందిన ఓ తల్లి శ్రీజ.. ఏడాదిన్నర వయసున్న కొడుకుకి విషమిచ్చి తాను బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలిసి శ్రీజ తల్లి జయప్రద విషం తాగింది. దీంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జగిత్యాల జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. సోమవారం మల్లాపూర్ మండల కేంద్రంలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో మల్లాపూర్ రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. ఉదయం తొమ్మిది దాటితే భానుడు భగ్గుమంటున్నాడు. మధ్యాహ్నం వేళ తీవ్రరూపం దాల్చుతున్నాడు. రోజు రోజుకూ ప్రతాపం చూపిస్తున్నాడు.
బెజ్జంకి మండలం తోటపల్లికి చెందిన ప్రమోద్‌రావు, సరిత దంపతుల కుమార్తె సుహానీరావు మిస్ టీన్ గెలాక్సీ పేజెంట్ యూకే టైటిల్ కైవసం చేసుకుంది. యూకేలోని వారింగ్‌టన్ పార్ హాల్‌లో యునైటెడ్ కింగ్‌డమ్ నలుమూలల నుంచి 25 మంది యువతులతో కలిసి పోటీపడి అన్ని విభాగాల్లో ప్రతిభ కనబర్చి దక్షిణాసియా మొదటి విజేతగా నిలిచింది. వచ్చే ఆగస్టులో యూఎస్‌ఏలో జరిగే పోటీల్లో యూకే తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.
ఈనెల 1 నుంచి నెల రోజుల పాటు రామగుండం పోలీస్ కమిషనరేట్లో నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. పెద్దపల్లి-మంచిర్యాల జిల్లాల పరిధిలో ఎలాంటి డ్రోన్ కెమెరాలు, డీజే సౌండ్ సిస్టంలు వినియోగించకూడదని పేర్కొన్నారు. అలాగే బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగితే కఠిన చర్యలు తీసుకుంటూమన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.
పురుగు మందు తాగి ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో చోటుచేసుకుంది. SI రామకృష్ణ వివరాల ప్రకారం.. మద్దులపల్లికి చెందిన వైష్ణవి(20) KNRలోని ఓ ప్రైవేట్ కళాశాలో డిగ్రీ చదువుతోంది. అయితే రెండు, మూడో సెమిస్టర్లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి పురుగు మందు తాగింది. కుటుంబీకులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించింది.
రామగుండం NTPC 2023-24 ఆర్థిక సంవత్సరంలో వార్షిక ఉత్పత్తి వివరాలను అధికారులు సోమవారం విడుదల చేశారు. 1600 మెగావాట్ల తెలంగాణ ప్లాంటులో మార్చి 29 నాటికి 37.12 మి. యూ, 2600 మెగావాట్ల ప్లాంట్‌లో మార్చి 26 నాటికి 16,645 మి.యూ. విద్యుత్ ఉత్పత్తి నమోదయింది. NTPC రిజర్వాయర్‌లోని 100 MV ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌లో 164.21 మి.యూ.కు గాను 196.17మి.యూ.తో 15.58 శాతం అధిక ఉత్పత్తి నమోదు చేసిందని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.