Karimnagar

News April 1, 2024

KNR: కిటకిటలాడుతున్న జిల్లా గ్రంథాలయం, స్టడీ సర్కిల్స్

image

జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం, స్టడీ సర్కిల్స్ అభ్యర్థులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం 7 గంటలకే గ్రంథాలయం అభ్యర్థులతో నిండిపోతోంది. వరుసగా నోటిఫికేషన్లు రావడంతో జిల్లాలోని నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఉద్యోగాలు దక్కించుకునేందుకు ప్రణాళికబద్ధంగా చదువుతున్నారు. బీసీ స్టడీ సర్కిల్, ఎస్సీ స్టడీ సర్కిల్స్‌లో శిక్షణ తీసుకుంటున్నారు.

News April 1, 2024

KNR: మిర్చి బండి మహిళతో KTR ముచ్చట్లు

image

HYD అంబర్‌పేట్‌లో మాజీ మంత్రి KTR.. BRS సికింద్రాబాద్ అభ్యర్థి పద్మారావు గౌడ్‌కు మద్దతుగా పాదయాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అంబర్‌పేట్‌లో రోడ్డు పక్కన ఉన్న ఓ మిర్చి బండి మహిళతో KTR ముచ్చటించారు. ఆమెతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో BRSను గెలిపించాలని KTR కోరారు. మన తెలంగాణ గళం పార్లమెంట్‌లో వినిపించాలంటే BRSతోనే సాధ్యమని అన్నారు.

News April 1, 2024

జగిత్యాల: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలకు గాయాలు

image

మెట్‌పల్లి మండల శివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు రాత్రి పదిన్నర గంటల సమయంలో రోడ్డు దాటే క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇరువురి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం మెట్‌పల్లి ఆసుపత్రికి తరలించారు.

News April 1, 2024

హుజూరాబాద్‌‌: భర్త వేధింపులు తట్టుకోలేక.. వివాహిత సూసైడ్

image

భర్త వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల ప్రకారం.. KNRకి చెందిన మౌనికరెడ్డిని, హుజూరాబాద్‌‌కి చెందిన రాకేశ్‌రెడ్డితో 2016లో పెళ్లైంది. రాకేశ్‌కెడ్డి తండ్రి తన ఆస్తిలో కొంతస్థలాన్ని మనవడి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో ఇద్దరికి గొడవలు జరుతున్నాయి. ఆదివారం మౌనిక తండ్రికి ఫోన్ చేసి భర్త వేధిస్తున్నాడని, తెలిపి ఉరేసుకుంది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News April 1, 2024

కరీంనగర్: కాంగ్రెస్ MP టికెట్ ఎవరికీ?

image

కరీంనగర్ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ ఎంపీ అభ్యర్థిని ప్రకటించగా కాంగ్రెస్ మాత్రం రోజుకొక పేరుతో చర్చలో నిలుస్తోంది. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం నేడు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్, బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఇద్దరు సీనియర్ లీడర్లే మరి కాంగ్రెస్ టికెట్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి.

News April 1, 2024

పెద్దపల్లి: బైక్ చెట్టుకు ఢీకొని వ్యక్తి మృతి

image

సుల్తానాబాద్ మండలం సుద్దాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపిన ప్రకారం… ఓదెల మండలానికి శ్రీనివాస్(46) ఓ వివాహ వేడుకల్లో పాల్గొని తిరిగి ఓదెలకు వెళ్తున్న క్రమంలో సుద్దాల సమీపంలో బైక్ అదుపుతప్పి చెట్టుకి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News April 1, 2024

KNR: BJP నాయకులపై కేసు నమోదు

image

ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు SI నరేశ్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. గన్నేరువరం మండలం మాదాపూర్‌లో EGS పథకంలో సీసీ రోడ్డు నిర్మాణం ఆదివారం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న ARO కిరణ్ ఆదేశాల మేరకు FST టీమ్ ఇన్‌ఛార్జ్ రాజశేఖర్ పరిశీలించి BJP నాయకులు తిరుపతి, రాజిరెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీకాంత్ ప్రారంభించారని నిర్ధారించారు. దీంతో వారిపై కేసు నమోదు చేసినట్లు SI తెలిపారు.

News April 1, 2024

KNR: ఏప్రిల్5న ఉమ్మడి జిల్లాలో కేసీఆర్ పర్యటన: ఎమ్మెల్యే గంగుల

image

ఉమ్మడి జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించి, రైతులకు బాసటగా నిలిచేందుకు ఏప్రిల్ 5న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ పర్యటనకు రానున్నారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెల్లడించారు. ఎంపీ అభ్యర్థి బోయిన్‌పల్లి వినోద్‌కుమార్ నివాసంలో కేసీఆర్ పర్యటన ఏర్పాట్లలో భాగంగా జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు, పలువురి నాయకులతో గంగుల సమావేశం నిర్వహించారు.

News March 31, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ మెట్ పల్లి మండలం పెద్దాపూర్ లో వైభవంగా మల్లన్న బోనాల జాతర. @ గంగాధర మండలంలో బిఆర్ఎస్ నాయకుల ధర్నా. @ చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అరెస్ట్. @ సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. @ ఓదెల మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ కరీంనగర్ లో కాలభైరవ స్వామిని దర్శించుకున్న ఎంపీ బండి సంజయ్. @ ఇబ్రహీంపట్నం మండలంలో పురుగు మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి.

News March 31, 2024

మల్లాపూర్: ఉరేసుకుని వ్యక్తి మృతి

image

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సంగెం శ్రీరాంపూర్‌లో ఉరేసుకొని వ్యక్తి మృతిచెందినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. సంగెం శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన నల్లూరి గంగాధర్(34) కొన్ని నెలల నుంచి మద్యానికి బానిసయ్యాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన అతడు.. ఈరోజు ఇంట్లోని దూలానికి చున్నీతో ఉరేసుకున్నాడు. మృతుని భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

error: Content is protected !!