Karimnagar

News March 28, 2024

మేడిపల్లిలో గుర్తుతెలియని మృతదేహం

image

మేడిపల్లి మండలం కొండాపూర్ శివారులోని గల ఎస్సారెస్పీ వరద కాలువలో గుర్తుతెలియని వ్యక్తి శవం కొట్టుకొచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి వయసు 40 ఏళ్లు ఉన్నట్లు తెలిపారు. చనిపోయిన వ్యక్తి ఎవరు..? ఆత్మహత్యకు పాల్పడ్డాడా..? ప్రమాదవశాత్తు జారిపడ్డాడా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News March 28, 2024

కరీంనగర్: భర్తను కొట్టి చంపిన భార్య

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్‌లో దారుణం జరిగింది. భర్త రోజు తాగి వచ్చి తరచూ గొడవ చేస్తున్నాడన్న నెపంతో రోహితి అనే మహిళ తన భర్త హేమంత్‌ను హత్య చేసింది. పడుకొని ఉన్న భర్తపై వేడి నీళ్లు పోసి అనంతరం తీవ్రంగా కొట్టి గాయపర్చింది. అనంతరం ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 28, 2024

పెద్దపల్లి: విలాసాలకు అడ్డొస్తుందని భార్యను హతమార్చిన భర్త

image

విలాసాలకు అడ్డు వస్తుందని భార్యను భర్త హత్యచేసిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. ACP కృష్ణ వివరాల ప్రకారం.. ఈ ఘటనలో జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం మారెడుపల్లికి చెందిన రజిత(33) మృతి చెందింది. అయితే కొన్నేళ్లుగా మద్యానికి బానిసైన భర్త పున్నం రెడ్డి రోజూ భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడి, ఇనుపచైన్‌పానతో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

News March 28, 2024

నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి టీ.జీవన్ రెడ్డి నేపథ్యమిదే!

image

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా టీ.జీవన్ రెడ్డిని ఆపార్టీ అధిష్ఠానం బుధవారం రాత్రి ప్రకటించింది. ఈయన 1983లో TDP నుంచి తొలిసారిగా జగిత్యాల MLAగా ఎన్నికై.. మంత్రివర్గంలో చేరారు. తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్‌లో చేరి 1989, 1996, 1999, 2004, 2014లలో కాంగ్రెస్ పార్టీ నుంచి MLAగా గెలిచారు. 2019లో కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ MLCగా ఎన్నికయ్యారు.

News March 28, 2024

KNR: అదృశ్యమయ్యాడు.. శవమై కనిపించాడు!

image

అదృశ్యమైన ఓ యువకుడు బావిలో శవమై తేలిన ఘటన KNR జిల్లా తిమ్మాపూర్‌లో జరిగింది. CI స్వామి వివరాల ప్రకారం.. BHPL జిల్లా కాటారం మండలానికి చెందిన అభిలాశ్(20) తిమ్మాపూర్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో డిప్లొమా చేస్తున్నాడు. అయితే ఈనెల 1న రాత్రి అభిలాశ్ అదృశ్యమయ్యాడు. బుధవారం సాయంత్రం కుళ్లిన స్థితిలో స్థానికంగా ఓ వ్యవసాయ బావిలో మృతదేహం కనిపించగా.. చరవాణి, దుస్తుల ఆధారంగా అభిలాశ్‌గా పోలీసులు గుర్తించారు.

News March 28, 2024

కథలాపూర్: వరకట్న వేధింపు.. కేసు నమోదు

image

అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్తపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన బంటు లావణ్యను మెట్ల చిట్టాపూర్ గ్రామానికి చెందిన బంటు నారాయణతో వివాహం జరిగింది. అయితే భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని భార్య లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నవీన్ తెలిపారు.

News March 28, 2024

KNR: మీ ఇంటి నుంచే వాతావరణ సమాచారం తెలుసుకోండి!

image

ప్రతి చోటా వాతావరణంం.. ఇంటింటికీ వాతావరణం పేరుతో భారత వాతావరణ విభాగం(IMD) ‘పంచాయత్ సేవా మౌసం యాప్‌’ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా నేరుగా ఇంటి నుంచే వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ సేవలు 12 భాషల్లో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. ఎండల తీవ్రత, రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు, వడగాల్పులు పెరగనుండటంతో దీని ద్వారా ముందస్తుగా సమాచారం తెలుసుకోవచ్చు. కాగా, ఈ యాప్‌ను ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది.

News March 28, 2024

కాటారం: చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి

image

కాటారం మండలంలోని సుందర్ రాజ్ పేటకు చెందిన విద్యార్థిని అక్షయ(15) చికిత్స పొందుతూ మృతి చెందింది. SI అభినవ్ వివరాల ప్రకారం.. ఈనెల 19న అక్షయ మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో పదో తరగతి పరీక్ష రాసేందుకు ఆమె తండ్రి ప్రవీణ్‌తో కలిసి, బైక్ పై వెళ్తోంది. ఈ క్రమంలో మద్దులపల్లి సమీపంలో బైక్ అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. అక్షయ తలకు తీవ్ర గాయాలు కాగా.. ఎంజీఎంలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.

News March 27, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

*ఇబ్రహీంపట్నం ఏఎస్సై రామయ్య సస్పెండ్.
*మల్లాపూర్ మండలంలో తేనెటీగల దాడిలో బర్ల కాపరి మృతి.
*కాటారం మండలంలో ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య.
*జగిత్యాలలో మత్తులో మైనర్ల హంగామా.
*వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలన్న జగిత్యాల కలెక్టర్.
*ఇఫ్తార్ విందులో పాల్గొన్న పెద్దపల్లి కలెక్టర్.
*కరీంనగర్‌లో నలుగురు బైక్ దొంగల అరెస్ట్.
*ఎల్లారెడ్డిపేట మండలంలో దొంగకు దేహశుద్ధి.

News March 27, 2024

ముత్తారం: ‘అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు’

image

ముత్తారం మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ హెచ్చరించారు. ఇటీవల (మానేరులో దొంగలు పడ్డారు) అనే కథనంతో స్పందించిన జిల్లా కలెక్టర్ మండలంలో ఎవరికైనా ఇసుక కావల్సిన వారు మన ఇసుక వాహనం అనే వెబ్ సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని సూచించారు. అక్రమంగా ఇసుక తరలిస్తే అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలని తెలిపారు.

error: Content is protected !!