India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ ఈనెల 24 నుంచి రోడ్ షోలలో పాల్గొననున్నారు. 9వ రోజు మే 2న 6 సాయంత్రం జమ్మికుంటలో రోడ్ షో, వీణవంకలో రాత్రి బస, 3వ తేదీన 6 సాయంత్రం రామగుండంలో రోడ్ షో, రాత్రి బస, 5న 6 సాయంత్రం జగిత్యాలలో రోడ్ షో, బస, 9వ తేదీన 6 సాయంత్రం కరీంనగర్లో రోడ్ షో, రాత్రి బస, 10వ తేదీన 5 సాయంత్రం సిరిసిల్లలో రోడ్ షోలలో పాల్గొంటారని BRS పార్టీ వర్గాలు తెలిపాయి.
నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. అనంతరం నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జీవన్ రెడ్డి కోరారు.
ఎన్నికల షెడ్యూల్ వెలువడి దాదాపు నెల రోజులు అవుతోంది. నామినేషన్ ప్రక్రియ ప్రారంభమై 3రోజులైనా KNR కాంగ్రెస్ MP అభ్యర్థిపై స్పష్టత రాలేదు. ఇదిలా ఉండగా BJP, BRS అభ్యర్థులు నెల కిందటే ఖరారయ్యారు. ఈ లోక్‌సభ స్థానంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి నలుగురు MLAలు విజయం సాధించారు. కాగా ఇప్పటి వరకు ఎంపీ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎవరు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎవరైనా మానసిక ఆందోళనలు లేదా మానసిక ఒత్తిడికి గురి అయినప్పుడు మానసిక వైద్యుడిని సంప్రదించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత సూచించారు. చిరాకు పడడం, ఆసక్తిని కోల్పోవడం, నిద్రలేమి వంటి సమస్యలతో మానసిక ఒత్తిడికి గురి అయినట్లు భావిస్తే టెలి మానస్ టోల్ ఫ్రీ నెంబర్ 14416 ఫోన్ చేసి మానసిక వైద్యుడు సలహాలను సూచనలను ఉచితంగా పొందవచ్చునని తెలిపారు.
@ మల్లాపూర్ మండలంలో ప్రమాదవశాత్తు ఎలక్ట్రిక్ స్కూటర్ దగ్ధం. @ రాయికల్ మండలంలో అనారోగ్యంతో స్వర్ణకారుడి ఆత్మహత్య. @ కొండగట్టు అంజన్న ఆలయంలో ఈనెల 22 నుండి 24 వరకు అర్జిత సేవలు రద్దు. @ మెట్పల్లి మండలంలో పిడుగు పడి ఒకరికి తీవ్ర గాయాలు. @ మల్లాపూర్ మండలంలోని చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన అడిషనల్ ఎస్పీ. @ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ కోరుట్లలో వైభవంగా వీర హనుమాన్ విజయ యాత్ర.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 22 నుంచి 24 వరకు అన్ని అర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఈవో చంద్రశేఖర్ శనివారం తెలిపారు. ఈ సమయంలో అధిక సంఖ్యలో భక్తుల దర్శనం, దీక్ష స్వాముల మాలవిరమణ ఉండనున్న నేపథ్యంలో అర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తిమ్మాపూర్ మండలం LMD-ZP ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ హెడ్మాస్టర్ పి.రాజభాను చంద్రప్రకాశ్‌ను శనివారం సస్పెండ్ చేస్తూ వరంగల్ RJD సత్యనారాయణ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. స్కూల్ కాంప్లెక్స్‌లో ఉపాధ్యాయుల జీతాల రికవరీ పేరిట నిధులు గోల్‌మాల్, లీవుల్లో ఉన్న టీచర్లకు శాలరీ బిల్లు దాదాపు రూ.10లక్షల వరకు ట్రెజరీలో చెల్లించకుండా స్వాహా చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సస్పెండ్ చేశామని తెలిపారు.
గోదావరిఖని విద్యానగర్‌కు చెందిన విజయవర్ధన్ లోన్‌యాప్‌ల వేధింపులు భరించలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు 1టౌన్ పోలీసులు తెలిపారు. గత కొంతకాలం నుంచి వివిధ లోన్‌యాప్‌ల ద్వారా కొంత నగదు తీసుకొని తిరిగి చెల్లించే విషయంలో జాప్యం జరిగింది. దీంతో యాప్‌లకు సంబంధించిన వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
అప్రమత్తత, ఆలోచన, అవగాహనలతో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయగలమని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో శనివారం ప్రకటన విడుదల చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతోనే ప్రజలు మోసపోతున్నారని ఆయన స్పష్టం చేశారు. తమ మొబైల్ ఫోన్లకు వచ్చే తెలియని మెసేజులు, లింకులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
NZB బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌కు రూ.109.90 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఆయనపై 22 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అర్వింద్ ఒక్కరే సొంతంగా రూ.45.25 కోట్లు అడ్వాన్సులుగా ఇచ్చారు. ఆయన సతీమణి వద్ద 85 తులాల బంగారు ఆభరణాలున్నాయి. మొత్తం చరాస్తుల విలువ రూ.60.08 కోట్లు. ఎలాంటి భూముల్లేవు. జూబ్లీహిల్స్‌లోని వాణిజ్య, నివాస భవనాల విలువ రూ.49.81 కోట్లు. మొత్తం అప్పులు రూ.30.66 కోట్లుగా ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.