India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెద్దపల్లి లోక్‌సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పూర్తి వివరాలతో అఫిడవిట్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. రూ.24.09 కోట్ల ఆస్తులున్నాయని వివరించారు. నగదు, డిపాజిట్ల రూపంలో రూ.93.27 లక్షలు, వివిధ కంపెనీల్లో షేర్ల రూపంలో రూ.11.39 కోట్లు ఉన్నాయని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో 4.18 ఎకరాలు, సంబల్‌పుర్(ఒడిశా)లో 10.09 ఎకరాల భూమి, అప్పులు రూ.17.76 లక్షలు ఉన్నాయని వెల్లడించారు.
కరీంనగర్ లోక్‌సభ స్థానం BJP అభ్యర్థి బండి సంజయ్ పూర్తి వివరాలతో అఫిడవిట్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. తనకు సొంతిల్లు, గుంట భూమి కూడా లేదని, మొత్తం 41 క్రిమినల్ కేసులున్నాయని వెల్లడించారు. కుటుంబ ఆస్తుల విలువ రూ.1.12 కోట్లు అని, స్థిరాస్తులు లేకున్నా 3 కార్లు, 2 ద్విచక్ర వాహనాలు ఉన్నాయని పేర్కొన్నారు. వాహనాల కోసం తీసుకున్న అప్పులు రూ.13.4 లక్షలు ఉన్నాయన్నారు.
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ఆత్మకూరులో శుక్రవారం పిడుగు పడి కూలికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. ఆత్మ నగర్‌కు చెందిన వ్యవసాయ కూలి కోరుట్ల రమేశ్ పొలం పనులకు వెళ్లి ఇంటికి వస్తున్నారు. ఈక్రమంలో ఈదురు గాలులు, ఉరుములతో వర్షం రావడంతో ఓ చెట్టు కిందకు వెళ్లాడు. అదే సమయంలో చెట్టుపై ఓవైపు పిడుగు పడటంతో అక్కడే ఉన్న రమేశ్ ఎడమ చేయి, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
కరీంనగర్ లోక్‌సభ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లు గతంలో ఒకే జిల్లా పరిధిలో ఉండేవి. జిల్లాల పునర్విభజనతో ఈ MP స్థానం 5 జిల్లాలకు విస్తరించింది. కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, జగిత్యాల, హనుమకొండ జిల్లాల పరిధిలోని మండలాలు ఈ లోక్‌సభ స్థానంలో ఉన్నాయి. గతంలో పార్టీలపరంగా ఒకే జిల్లా అధ్యక్షుడు ఉండేవారు. ప్రస్తుతం అయిదుగురు ఉండటంతో వారందరినీ సమన్వయం చేసుకోవాల్సి ఉంది.
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2024 – 25 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి TS – పాలిసెట్ 2024 కోసం రాష్ట్ర సాంకేతిక విద్య శిక్షణా బోర్డ్ ప్రకటన విడుదల చేసిందని పరకాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదవ తరగతి పూర్తి అయిన విద్యార్థులు ఈ నెల 22 వరకు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. మే 24న ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.
@ ఈవీఎం, వివి ప్యాట్ల తరలింపును పరిశీలించిన సిరిసిల్ల కలెక్టర్
@ మేడిపల్లి మండలంలో వాటర్ హౌస్ లో పడి బాలుడు మృతి
@ ఎల్లారెడ్డిపేట మండలంలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
@ ఓదెల మండలంలో బావిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య
@ పెగడపల్లి మండలంలో 5 అక్రమ ఇసుక రావణ ట్రాక్టర్ల పట్టివేత
@ ఓటు హక్కు వినియోగం పై అవగాహన కల్పించాలన్న జగిత్యాల కలెక్టర్
@ జగిత్యాల రూరల్ మండలంలో రైలు పట్టాలపై బాలిక మృతదేహం లభ్యం
ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి గ్రామంలో ఓ వ్యక్తి అప్పుల బాధతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన నేతేట్ల మల్లయ్య(48) అనే వ్యక్తి కుటుంబ పోషణకై అప్పులు చేశాడు. అప్పుల భారం పెరగడంతో గురువారం రాత్రి 10:30 గంటలకు ఇంట్లో నుంచి వెళ్లిపోయి నారాయణపూర్ గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.
మేడిపల్లి మండల కేంద్రంలో వాటర్ హౌస్‌లో పడి బాలుడు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఒడిశాకు చెందిన బైగాని సంబర్ మేడిపల్లిలోని ఓ ఇటుకబట్టీలో కూలి పని చేస్తుంది. ఆమె కుమారుడు పరమేశ్వర్ (7) స్నానం చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు వాటర్ హౌస్‌లో పడ్డాడు. గమనించిన కుటుంబీకులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే బాలుడు మృతి చెందాడన్నారు. ఘటనపై కేసు చేసి దర్యాప్తు చేపట్టారు.
బావిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఓదెల మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓదెల గ్రామానికి చెందిన చింతం లక్ష్మి(74) శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు నాగులకుంట కట్ట వెనకాల బావిలో దూకి మృతి చెందింది. ఘటనా స్థలానికి పొత్కపల్లి ఎస్ఐ చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. భార్య చనిపోవడంతో భర్త చంద్రయ్య విలపించిన తీరు అందరినీ తీవ్రంగా కలచివేసింది.
ఫస్ట్ ర్యాండమైజేషన్లో భాగంగా సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు కేటాయించిన ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపును కలెక్టర్ అనురాగ్ జయంతి శుక్రవారం పరిశీలించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్ధాపూర్ ఈవీఎం గోడౌన్ నుంచి సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోని స్ట్రాంగ్ రూములకు భద్రత మధ్య తరలించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు పూజారి గౌతమి, కీమ్యా నాయక్, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.