India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ తరఫున స్థానిక బీజేపీ నాయకులు నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టరెట్‌లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతికి అందజేశారు. నామినేషన్ దాఖలు చేసిన వారిలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, కరీంనగర్ బీజేపీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, మాజీ మేయర్ శంకర్ తదితరులు ఉన్నారు. కాగా కరీంనగర్‌లో బీజేపీ విజయం ఖాయమని ట్విట్టర్‌లో బండి సంజయ్ పోస్ట్ చేశారు.
జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్ రైల్వే ట్రాక్‌పై కైకేయి(17) అనే బాలిక రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు ఒడిశాకు చెందిన బాలికగా గుర్తించిన జగిత్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చల్ గల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇటుక బట్టీల్లో పని చేసే కూలీగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా సూసైడ్‌కు కారణాలు తెలియాల్సి ఉంది.
బావిలో దూకి వృద్ధురాలు మృతి చెందిన ఘటన ఓదెల మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓదెల గ్రామానికి చెందిన చింతం లక్ష్మి(74) శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు నాగులకుంట కట్ట వెనకాల బావిలో దూకి మృతి చెందింది. ఘటనా స్థలానికి పొత్కపల్లి ఎస్ఐ చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. భార్య చనిపోవడంతో భర్త చంద్రయ్య విలపించిన తీరు అందర్నీ తీవ్రంగా కలిచివేస్తోంది.
వచ్చేనెల 13న లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంట్ పరిధి మంథని, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులోని కొన్ని అటవీ ప్రాంతాలలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న అటవీ ప్రాంతాలలో పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉన్న అటవీ గ్రామాలపై పోలీసులు డేగ కన్ను వేశారు.
నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. అయితే ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. 1952 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో 1967లో మాత్రమే స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. 11 సార్లు కాంగ్రెస్, 3 సార్లు TDP, TRS, BJP ఒకసారి విజయం సాధించాయి. 2014లో TRS అభ్యర్థిగా కవిత ఎన్నికయ్యారు. 2004లో పునర్విభజన అనంతరం జగిత్యాల, కోరుట్లు నియోజకవర్గాలు నిజామాబాద్‌లో వచ్చి చేరాయి.
మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు రూ.54.01 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అధికారికి ఇచ్చిన తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రూ.20.43 కోట్ల అప్పులు ఉన్నాయని, తనపై 54 కేసులు ఉన్నట్లు చెప్పారు. చేతిలో రూ. లక్ష నగదు, భార్య జమునకు 1.5 కిలోల బంగారు ఆభరణాలు, వివిధ కంపెనీల్లో పెట్టబడులు ఉన్నాయన్నారు. కుటుంబానికి 72.25 ఎకరాల భూమి, పౌల్ట్రీ ఫారాలు, నివాస, వాణిజ్య భవనాలు ఉన్నాయని వెల్లడించారు.
ఓ బాలిక బావిలో పడి మృతి చెందింది. నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన దేవరకొండ శ్రీనివాస్, అతని భార్య, కూతురుతో కలిసి బాతులు పెంచుకొనుటకు కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గంగారం గ్రామానికి వచ్చారు. గురువారం బాతులు మేపుతుండగా బాలికకు దాహం వేసి గూడెపు తిరుపతిరెడ్డి వ్యవసాయ బావి వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందింది. తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ తిరుపతి కేసు నమోదు చేశారు.
ఎల్ఎండీ మానేరు డ్యామ్‌లో దూకిన యువకుడిని లేక్ పోలీసులు రక్షించారు. శంకరపట్నం మండలం కరీంపేట గ్రామానికి చెందిన ఓ యువకుడు గురువారం మానేరు డ్యామ్ నీటిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించగా గస్తీ కాస్తున్న పోలీసులు నీటిలో దూకి తనని రక్షించి కౌన్సిలింగ్ ఇచ్చి అతని కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు ఆ యువకుడు తెలియజేశారు.
@ జగిత్యాల: ఇద్దరు SIలు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ సస్పెండ్
@ మల్హర్ మండలంలో లారీ, కారు ఢీ
@ పెద్దపల్లి: తొలి రోజు నాలుగు నామినేషన్లు
@ కరీంనగర్: తొలిరోజు రెండు నామినేషన్లు
@ మెట్ పల్లి: ఐదుగురు పేకాటరాయుళ్ల పట్టివేత
సారంగాపూర్ పీఎస్‌లో ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు కానిస్టేబుల్స్ సస్పెండ్ అయ్యారు. గతేడాది ఫిబ్రవరిలో 70 కిలోల గంజాయిని పట్టుకొని పీఎస్ వెనుక ఉంచినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ నెల 1న దుండగులు ఆ గంజాయిని ఎత్తుకెళ్లారు. వారి నిర్లక్ష్యంపై ఆగ్రహించిన ఉన్నతాధికారులు.. ఈ కేసులో ఎస్సైలు జి.మనోహర్‌రావు, ఎ.తిరుపతితో పాటు.. హెడ్ కానిస్టేబుల్ బి.రవీందర్ రెడ్డి, కానిస్టేబుల్ టి.నరేందర్‌ను సస్పెండ్ చేశారు.
Sorry, no posts matched your criteria.