Karimnagar

News April 9, 2024

జగిత్యాల జిల్లా వాసి సౌదీలో గుండెపోటుతో మృతి

image

ఉన్న ఊరిలో ఉపాధి కరువై ఎడారి దేశం వెళ్లిన వ్యక్తి మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన నిమ్మ రాజశేఖర్(36) సౌదీ అరేబియాలో డ్రైవింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఈక్రమంలో ఈనెల 3న తను ఉంటున్న గదిలో కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి మిత్రులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రాజశేఖర్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News April 9, 2024

జగిత్యాల: హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్

image

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న అశోక్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు మల్టీజోన్ ఐజి రంగనాథ్ సోమవారం అతడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ స్టేషన్లో మద్యం సేవించారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ జరిపి సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఇదే ఆరోపణలతో ఇటీవల ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే.

News April 9, 2024

సిరిసిల్ల: ఎంట్రెన్స్ రాయకున్నా పాలిటెక్నిక్‌లో ఉచిత సీటు

image

దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థ HYDలో ప్రవేశానికై తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ బాలికల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తెలిపారు. పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ రాయకున్నా కేవలం 10వ తరగతి చదివిన అర్హులన్నారు. ఆసక్తి గలవారు మే15లోగా దరఖాస్తులు సమర్పించాలన్నారు. దరఖాస్తు ఫారాల కోసం జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

News April 8, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

*మాట నిలబెట్టుకున్న KTR
*బండి సంజయ్‌పై మంత్రి పొన్నం ఫైర్ (VIDEO)
*100% సిజేరియన్లు చేసే ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామన్న సిరిసిల్ల కలెక్టర్.
*కొండగట్టు మెట్ల దారి సమీపంలో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
*పెద్దపల్లి సమీపంలో లారీ, కారు ఢీ.. పలువురికి గాయాలు.
*మల్లాపూర్ హెడ్ కానిస్టేబుల్ అశోక్ సస్పెండ్.
*సిరిసిల్ల: పోటీ పరీక్షల ఉచిత శిక్షణకు స్పాట్ అడ్మిషన్స్
*ఉగాది ఎఫెక్ట్: భారీగా పెరిగిన ధరలు

News April 8, 2024

కొండగట్టు మెట్ల దారి సమీపంలో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట పరిధిలోని కొండగట్టు మెట్ల దారి సమీపంలో సోమవారం సాయంత్రం ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని తక్కళ్లపల్లికి చెందిన మల్లయ్య(45)కు మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఈరోజు కుటుంబ సభ్యులు కొండగట్టుకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో చెట్టుకు ఉరేసుకున్నాడు.

News April 8, 2024

పెద్దపల్లి: కారును ఢీ కొట్టిన లారీ.. పలువురికి గాయాలు

image

పెద్దపల్లి సమీపంలోని బంధంపల్లి వద్ద ఈరోజు సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. గోదావరిఖనికి వస్తున్న కారును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టడంతో కారు బోల్తా పడింది. దీంతో కారులోని పలువురికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా.. లారీ డ్రైవర్ పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News April 8, 2024

సిరిసిల్ల: పోటీ పరీక్షల ఉచిత శిక్షణకు స్పాట్ అడ్మిషన్స్

image

రాష్ట్రస్థాయి పోటీ పరీక్షలతో పాటు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఉచిత శిక్షణకై ఎస్సీ అభ్యర్థులకు ఈనెల 10న స్పాట్ అడ్మిషన్స్ జరగనున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి తెలిపారు. 100 సీట్లకు గాను.. 45 సీట్లు భర్తీ కాగా మిగిలిన 55 సీట్లకు సిరిసిల్ల చంద్రంపేటలోని ఎస్సి స్టడీ సర్కిల్లో స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించబడునన్నారు. ఎంపికైన అభ్యర్థులకు 3 నెలలు ఉచిత భోజన వసతితో కూడిన శిక్షణ ఉంటుందన్నారు.

News April 8, 2024

జగిత్యాల జిల్లాలో సదరం శిబిరాల తేదీలు ఇవే

image

జగిత్యాలలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు హాస్పిటల్ ధరూర్‌లో ఏప్రిల్, మే నెలలో సదరం శిబిరాలు నిర్వహించబడునని జిల్లా వైద్య పర్యవేక్షకులు తెలిపారు. ఏప్రిల్ 10, 18, 19, 24, 26, 30, మే 8, 15, 17, 22, 29, 31 తేదీలలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో శిబిరాలు నిర్వహించబడునున్నారు. ఏప్రిల్ 23, మే 24 తేదీలలో మాతా శిశు హాస్పిటల్‌లో శిబిరం నిర్వహించబడునన్నారు. ఈనెల 8 నుంచి స్లాట్ బుకింగ్ చేసుకోవాలన్నారు.

News April 8, 2024

కొండగట్టులో హనుమాన్ జయంతికి పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

image

ఈనెల 22 నుంచి 24 వరకు కొండగట్టులో జరిగే శ్రీ చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం శ్రీ చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల నిర్వహణపై నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తాగునీరు, విద్యుత్తు తదితర సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అడిషనల్ కలెక్టర్ దివాకర తదితరులు పాల్గొన్నారు.

News April 8, 2024

జగిత్యాల: ఫొటోలు ఉన్నాయని బెదిరిస్తూ.. అత్యాచారం

image

జగిత్యాల పట్టణంలో నివసిస్తున్న ఓ వివాహితతో TRనగర్‌కు చెందిన మోహన్ పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు తీసుకుని.. కోరిక తీర్చమని లేకుంటే సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ బలవంతంగా అత్యాచారం చేశాడు. బెదిరింపులు భరించలేక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది. నిందితుడిపై మొత్తం 13 కేసులున్నాయని పట్టణ సీఐ తెలిపారు.